జటాధరుని నెలవు 'జగన్నాథ గట్టు'
Vaartha-Sunday Magazine|April 28, 2024
మనందరం చూడకపోయినా వినే వుంటాం ఈ విషయం గురించి.. అదేమిటంటే శ్రీశైలం దగ్గరలో సంవత్సరంలో ఎనిమిది నుండి తొమ్మిది నెలలు కృష్ణా నదిలో మునిగి ఉండి మూడు నెలలు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలిగించే శ్రీ సంగమేశ్వర ఆలయం, మచ్చుమర్రి.
ఇలపావులూరి వెంకటేశ్వర్లు
జటాధరుని నెలవు 'జగన్నాథ గట్టు'

ఇది కర్నూలు జిల్లా ఆత్మకూరుకి సుమారు ముప్ఫై కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఒకప్పుడు ఈ ప్రాంతం పవిత్ర నదుల సంగమ క్షేత్రంగా ప్రసిద్ధికెక్కి అనేక ఆలయాలు ఇక్కడ ఉండేవట. కానీ కృష్ణా నది మీద శ్రీశైలం ఆనకట్ట నిర్మించడం వలన వీటిలో చాలా ఆలయాలు నీట మునిగిపోయాయి.

వాటిలో ఒకటి శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం. నదిలో నీటి ప్రవాహం తగ్గిన సమయంలో అంటే జనవరి/ఫిబ్రవరి నుండి జూన్ వరకు శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం వెలుపలికి వస్తుంది. తిరిగి వర్షాలు పడగానే నీటి ప్రవాహం పెరిగి జలాధివాసంలోకి స్వామి వెళ్లిపోతారు.

కొన్ని ఆలయాలను ఆ సమయంలో కర్నూలు, ఆలంపూర్ లాంటి ప్రదేశాలకు తరలించారు.

పవిత్ర క్షేత్రం ఎందుకైంది?

పవిత్ర సంగమ క్షేత్రం

ఈ క్షేత్రం ఎంత గొప్పది అంటే ఇక్కడ మొత్తం ఆరు నదులు కృష్ణా నదిలో సంగమిస్తాయి. అవి వేణి, భవనాశి, తుంగ, భద్ర, మలాహారిణి, భీమరథి. వీటిలో భావనాశి నదిని మగ నది అంటారు. తూర్పు నుండి పడమరగా ప్రవహించే వాటిని మగ నదులుగా గుర్తించారు.

ఇదే కాకుండా ఒకప్పుడు ఇక్కడ ఏడు నదుల పవిత్ర సంగమం అయిన ఈ

ప్రాంతానికి పాండవులు తమ అరణ్యవాస సమయంలో శ్రీశైల మల్లికార్జున స్వామిని సేవించుకొని వచ్చారట. ఎందరో మునులు ఇక్కడ తపస్సు చేసుకొంటూ ఉండేవారట. ద్రౌపదీ దేవితో కలిసి వారిని సేవిస్తూ కొంత కాలం ఇక్కడ గడిపారట.

ఒకరోజు మునులు ధర్మరాజుతో జ్యోతిర్లింగ, అష్టాదశ శక్తిపీఠాల క్షేత్రం అయిన శ్రీశైలాన్ని తాకుతూ ప్రవహించే పావన నదుల సంగమమైన ఈ పవిత్ర క్షేత్రంలో ఒక శివలింగాన్ని ప్రతిష్టించడం వలన వారికి ఏదైనా దుష్టగ్రమ పీడ వుంటే తొలగిపోయి సమస్త జయాలు కలుగుతాయని చెప్పారట. గ్రహ స్థితి, జయాల విషయం ఎలా ఉన్నా శివలింగ ప్రతిష్ట శ్రీ అనే పవిత్ర కార్యక్రమం చేయడం మనోల్లాసాన్ని కలిగించి మనిషిని శక్తివంతుని చేస్తుంది అని తలంచిన ధర్మరాజు భువిలో కైలాసం, మోక్షపురి, శ్రీ అన్నపూర్ణా క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన వారణాశి నుండి ఒక శివలింగాన్ని తీసుకొని రమ్మని భీమసేనుని పంపించారు.

この記事は Vaartha-Sunday Magazine の April 28, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Vaartha-Sunday Magazine の April 28, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

VAARTHA-SUNDAY MAGAZINEのその他の記事すべて表示
ఫోటో ఫీచర్
Vaartha-Sunday Magazine

ఫోటో ఫీచర్

పశ్చిమ బెంగాల్లోని కాల్నా నగరంలో ఉందీ దేవాలయం.

time-read
1 min  |
January 19, 2025
స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం
Vaartha-Sunday Magazine

స్వయంభూ లింగం శ్రీ అగస్తీశ్వరాలయం

మ హా పాశుపత బంధ ఆలయాలు లేదా 'త్రిలింగ క్షేత్రాలలో మొదటిది కొలకలూరులో ఉన్న శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయం

time-read
3 分  |
January 19, 2025
రాజ భోగాల రైలు
Vaartha-Sunday Magazine

రాజ భోగాల రైలు

భా రతదేశంలోని తొలి విలాసవంతమైన రైలుగా ఖ్యాతినార్జించిన ట్రైన్ ప్యాలెస్ ఆన్ వీల్స్. చక్రాలపై పరుగులు తీసే రాజసౌధంలో ప్రయాణం స్వర్గ సౌఖ్యాలు చవిచూచిన అనుభూతి కలగక మానదు.

time-read
3 分  |
January 19, 2025
గుప్త దానం
Vaartha-Sunday Magazine

గుప్త దానం

ఓ ఊళ్ళో ఒకరున్నారు. ఆయన చాలా మంచివారు. ఎవరికో ఒకరికి ఏదో ఒకటి ఇస్తుండేవారు. ఆయనను అందరూ దాతగా చెప్పుకునేవారు.

time-read
2 分  |
January 19, 2025
వారఫలం
Vaartha-Sunday Magazine

వారఫలం

వారఫలం

time-read
2 分  |
January 19, 2025
ఈ వారం కార్ట్యు న్స్
Vaartha-Sunday Magazine

ఈ వారం కార్ట్యు న్స్

ఈ వారం కార్ట్యు న్స్

time-read
1 min  |
January 19, 2025
దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?
Vaartha-Sunday Magazine

దక్షిణ నైరుతి వీధి పోటు అంటే?

నైరుతి వీధి పోట్ల గురించి చెప్పుకునే ముందు నైరుతి భాగం ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకోవాలి.

time-read
2 分  |
January 19, 2025
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

ఊగాడు

time-read
1 min  |
January 19, 2025
సూపర్ చిప్స్
Vaartha-Sunday Magazine

సూపర్ చిప్స్

సూపర్ చిప్స్

time-read
2 分  |
January 19, 2025
విజయానికి సోపానాలు
Vaartha-Sunday Magazine

విజయానికి సోపానాలు

విజయానికి సోపానాలు

time-read
1 min  |
January 19, 2025