అది వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తున్న సమయం.ఆ సమయంలో బోధిసత్వుడు నగరం దగ్గర ఉన్న శ్మశానంలో వేపచెట్టు దేవతగా జన్మించాడు.
ఒక రోజున ఓ దొంగ నగరానికి ద్వారంలా ఉండే గ్రామంలో దొంగతనం చేశాడు.తాను దొంగిలించిన వస్తువులన్నీ వేపచెట్టు కింద పెట్టి అక్కడ నిద్ర పోయాడు.
వేపచెట్టు పక్కనే రావిచెట్టు ఉంది.
ఆ కాలంలో దొంగలకు ఒక ప్రత్యేమైన శిక్ష వేసేవారు.
దొంగ పట్టుబడగానే వేపచెట్టు నరికి, శూలంగా చేసి దొంగ వీపుపై ఎక్కిస్తారు.
ఆ బరువును మోస్తూ దొంగ వీధుల గుండా తిరగాలి.
వేపచెట్టుకు ఈ విషయం తెలుసు.
ఇప్పుడు ఆ దొంగ పట్టుబడితే ముందుగా తన కొమ్మను విరగ్గొడతారు.అందుకని ఆ దొంగను తన దగ్గర నుంచి తరిమేసేందుకు వేపచెట్టు నిశ్చయించింది.
ఆ దొంగతో "ఒరే దొంగవెధవా, చేసే దొంగతనం ఎలాగో చేశావు. దొంగతనం చేసినవాడివి దోచుకున్న సొమ్ము తీసుకుని ఎక్కడికయినా పారిపో. ఇక్కడే పడుకుని ఉంటే భటులు నిన్ను పట్టుకుంటారు. ఘోరంగా శిక్షిస్తారు.కాబట్టి పారిపో. భటులకు చిక్కి అనవసరంగా కష్టపడటం ఎందుకు?”అని అంది.
వేపచెట్టు మాటలు విన్న దొంగకు నిద్ర పట్టలేదు. తాను దొంగిలించిన వస్తువులను తీసుకుని అక్కడి నుంచి పారిపోయాడు.
ఇదంతా పక్కనే ఉన్న రావిచెట్టు చూస్తూనే ఉంది. దొంగ పారిపోగానే వేపచెట్టును అడిగింది.
“వాడు దొంగ. వాడెవడో నీకు తెలియదు. వాడు దొంగతనం చేశాడు.వాడిని భటులు పట్టుకుపోతే నీకేమయింది? నువ్వెందుకు వాడిని తరిమేశావు? ఈ విషయాల్లో నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు? నీవు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది?”
దానికి వేపచెట్టు సమాధానం ఇచ్చింది.
"నాకూ దొంగకూ ఉన్న సంబంధం నీకు తెలియదు. ఆ దొంగ దొరికితే, ముందు నా కొమ్మ విరిచి వాడి వీపున కట్టి మోయిస్తారు. తరువాత నా కొమ్మకు వాడిని వేలాడగట్టి ఉరి తీస్తారు. అందుకని వాడిని పారిపొమ్మన్నాను. తప్పు చేసింది వాడు శిక్ష, నష్టం నాకు".
చెట్లు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో దొంగ కాలిగుర్తులను బట్టి వెతుకుతూ రాజభటులు చెట్టుదగ్గరకు వచ్చేశారు.
అక్కడి నుండి దొంగ పారిపోయిన చిహ్నాలు కనిపించాయి.
この記事は Vaartha-Sunday Magazine の September 22, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Vaartha-Sunday Magazine の September 22, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
జ్ఞానోదయం
అదొక డాబా ఇల్లు. ఆ ఇంట్లో ఓ పెద్దమనిషి ఉన్నారు. ఆయనకో ఖరీదైన, విలాసవంతమైన కారు ఉండేది. ఆయన విదేశీయుడు.
వివేకానంద కవితా వైభవం
1900 సెప్టెంబరు 22న బ్రిట్టనీలోని పెర్రోస్ గైరీ నుంచి సిస్టర్ నివేదితకు పంపిన 'ఏ బెనిడిక్షన్' కవితకు స్వేచ్ఛానువాదం.
ఇల్లు పునర్నిర్మించినప్పుడు..
వాస్తువార్త
సమయస్పూర్తి
అక్టర్ చక్రవర్తి మంచి ప్రజాదరణ కలిగిన 'చక్రవర్తుల్లో ఒకరు.
నవ్వు...రువ్వు...
నవ్వు...రువ్వు...
చరవాణి
హాస్య కవిత
ఫోటో ఫీచర్
చిట్టడవి తలపించే ఈ మహా వృక్షం 'బ్రెజిల్లో ఉంది.
ఈ వారం కార్ట్యున్స్'
ఈ వారం కార్ట్యున్స్'
రంగు రంగుల బీచ్లు
బీచ్అంటే సముద్రం, అప్పుడప్పుడు వచ్చి పోయే అలలు, గోధుమ వర్ణంలో ఉండే ఇసుకలో పిట్టగూళ్లు కట్టుకునే పిల్లలు..
కృష్ణమ్మ పరవళ్లు..సోమశిల అందాలు..
చుట్టూ కొండా కోనలు.. ఎటు చూసినా కృష్ణమ్మ పరవళ్లు.. తాకుతున్నట్లు కనువిందు చేసే అలలు.. చల్లని స్వచ్ఛమైన గాలి.