“మనస్సునూ, శరీరాన్నీ పవిత్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోండి. అవి మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి సాధనాలు. అదే వాటి అసలైన ఉద్దేశం." - స్వామి వివేకానంద
ఈ లోకంలో విద్యార్థి నుండి వయోవృద్ధుని వరకూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.జీవితపు ప్రతి దశలోనూ శరీర ఆరోగ్యం అత్యంత కీలకం.విద్యార్థులు తమ చదువులు నిరాటంకంగా కొనసాగించాలన్నా, ఉద్యోగస్థులు తమ కార్యాలయ, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలన్నా, వృద్ధులు తమ పనులు తాము చేసుకోవాలన్నా, చివరకు ఆధ్యాత్మిక సాధన చేసుకునేవారైనా సరే... ఆరోగ్యంగా ఉంటేనే సాధ్యపడుతుంది. ధర్మార్థ కామ మోక్షాలను సాధించాలంటే శరీరమే సాధనం. అందుకే ఈ శరీరం కోసం ఎంతోకొంత సమయం కేటాయించి, దానిని ఆరోగ్యంగా ఉంచడం మన బాధ్యత. అలాగని ప్రతి ఒక్కరూ కండలు పెంచి, శరీరాకృతిని సాధించాలని కాదు. అది అందరికీ సాధ్యపడదు, అవసరమూ లేదు. అయితే, కేవలం శరీరస్థాయిలోనే మనం ఆగిపోకూడదు. బుద్ధిజీవులం కాబట్టి మరింత శ్రేయస్సును అందుకోవడానికి ప్రయత్నించాలి. భగవంతుడే ఆ శ్రేయస్సు.
ఆధునిక యుగం ప్రాచీన యోగం : ఈరోజు ప్రపంచమంతా వినపడుతున్న మాట 'యోగా'. ఇది మన ప్రాచీన వారసత్వ సంపద. దీనిని మనం ఆచరణలో పెడితే చాలు...శరీరం, మనస్సు కూడా ఉత్తేజభరితం, ఉత్సాహపూరితం అవుతాయి. వయో తారతమ్యం లేకుండా వచ్చిపడుతున్న ఆధునిక రోగాలన్నీ నియంత్రించబడతాయి. కొన్ని సందర్భాల్లో రోగాలు పూర్తిగా నయమవుతాయి కూడా!
వ్యాయామశాలల్లో చేసే వ్యాయామాలకు అనేక ఉపకరణాలు అవసరం. శ్రమ అధికం. పైగా ఆహారం కూడా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. కండపుష్టి కలుగుతుందిగానీ,శరీరం లోపలి అవయవాలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరదు.యోగాసనాలైతే ఎటువంటి ఉపకరణాలూ లేకుండానే, ఇంటిలోనే అభ్యాసం చేసుకోవచ్చు. కాకపోతే మొదట్లో కొన్నాళ్ళు శిక్షకుని సమక్షంలో అభ్యాసం చేయాలి. ఆసనాలు, ప్రాణాయామం వల్ల నాడీమండలం చురుగ్గా పనిచేస్తుంది.రోగనిరోధకశక్తి పెరుగుతుంది.
この記事は Sri Ramakrishna Prabha の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Sri Ramakrishna Prabha の June 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద