దివ్యజనని శ్రీశారదాదేవి ప్రత్యక్ష శిష్యులైన స్వామి శారదేశానందజీ (1892-1988) రామకృష్ణ సంఘంలో ఎంతో గౌరవాన్నీ, ప్రేమాభిమానాలనూ చూరగొన్న గొప్ప సన్న్యాసి. ఆయన తపోమయ జీవితం, సేవాదర్శాలు అనేకమంది సాధువులకూ, భక్తులకూ స్ఫూర్తిమంతంగా నిలిచాయి. ఆధ్యాత్మిక సాధకులకు, ముఖ్యంగా రామకృష్ణ వివేకానంద భావధారలో ఉన్నవారికి ఆ మహనీయుని జీవిత విశేషాలు, ఆయన చేసిన సూచనలు ఉపయుక్తంగా ఉంటాయని తలచి, 2024 జనవరి సంచిక నుంచి వాటిని ధారావాహికగా ప్రచురిస్తున్నాం.
శారదమ్మ శిష్యుని విశాల దృక్పథం
శారదమ్మ మరొక శిష్యులు స్వామి నిత్యస్వరూపానందజీతో జరిగిన సంఘటన. నేను (స్వామి శుక్లాత్మానంద మఠంలో చేరిన తొలి రోజుల్లో చాలా సన్నగా ఉండేవాడిని. నా దుర్బల శరీరాన్ని చూసి ఒకసారి ఆయన 'ఏం రోగ శరీరం నీది! ఇలా ఉంటే స్వామీజీ పని ఎలా చేయగలవు? ఆయన ఇనుప కండరాలు, ఉక్కు నరాలు గల యువతను ఆశించారు' అన్నారు. అంతే!.. మా మధ్య అంతరాలు మరచిపోయి నేను ఆయనతో వాదనకు దిగాను. ఒకానొక దశలో ఆయనను విమర్శిస్తూ 'సన్నగా కాకపోతే మీలాగా లావుగా ఉండాలా?' అనేశాను. వాదన మరింత ముదిరిపోతుందని భావించిన ఆయన 'పో ఇక్కడ్నుంచి' అన్నారు. నేను మెల్లగా బయటకు వచ్చేశాను. నా మనస్సంతా అపరాధ భావనతో నిండిపోయింది.
కొద్దిసేపటి తరువాత నేను తిరిగి ఆయన దగ్గరకు వెళ్ళి, 'మహరాజ్! నాపై కోపం వహించారా? మీతో అలా వాదించినందుకు క్షమించండి' అన్నాను. అందుకాయన ఇచ్చిన సమాధానం నన్ను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్కడికి కొద్ది దూరంలోవున్న పచ్చికబయలును చూపిస్తూ 'అదుగో అక్కడ ఆవులు మేస్తున్నాయి చూశావా! అవి ఆలోచించనూ లేవు, మాట్లాడనూ లేవు. కేవలం మనుషులే ఆ పనులు చేయగలరు. అందుకే మనుషుల మధ్య అభిప్రాయ భేదాలు కూడా! నా అభిప్రాయంతో నువ్వు ఏకీభవించనంత మాత్రాన, నీపై నేనెందుకు కోపం వహిస్తాను. నువ్వు భయపడకుండా నీ అభిప్రాయాలను వ్యక్తపరిచావు. అందుకు సంతోషించాను' అన్నారు. అలాంటి విశాల దృక్పథం కలిగివుంటే కొత్త తరానికి, పాత తరానికి అంతరాలే ఉండవు కదా! ఈ సంఘటనతో 'సాధువుల కోపం నీటిపై రాతలాంటిది' అన్న శ్రీరామకృష్ణుల వచనాలు స్ఫురణకు వచ్చాయి.
ఆయన ప్రేమ శారదమ్మ ప్రేమే !
この記事は Sri Ramakrishna Prabha の May 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Sri Ramakrishna Prabha の May 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద