ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో 5 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లల స్క్రీన్ సమయం ఎంతన్నది నిర్ణయించింది. స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల పిల్లల కళ్లు మాత్రమే పాడవుతాయని ఇప్పటి వరకు అనుకుంటున్నాం. కానీ డబ్ల్యూహెచ్ నివేదిక ప్రకారం, దాని వల్ల జరిగే నష్టాలు మరింత ప్రమాదకరమైనవని తేలింది.
5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సూచించిన స్క్రీన్ సమయం కంటే ఎక్కువగా ఉంటే వారి శారీరక, మానసిక వికాసంపై నష్టం కలుగుతుంది. ఆ రిపోర్టు ప్రకారం తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను మొబైల్ ఫోన్లు, టీవీ స్క్రీన్లు, ల్యాప్టాప్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు వీలైనంత దూరంగా ఉంచాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు
ఒక సంవత్సరం లోపు పిల్లలకు జీరో స్క్రీన్ టైమ్ నిర్దేశించారు. అంటే వారికి అవి అందుబాటులో ఉండకుండా చూడాలి. 1 నుంచి 2 సంవత్సరాల వయసు గల పిల్లలకు స్క్రీన్ సమయం రోజుకు 1 గంటకు మించకూడదు.దీంతోపాటు 3 గంటల పాటు వాళ్లు శారీరక శ్రమ చేయాలని సూచించారు.
ఈ వయసులో పిల్లలకు కథలు చెప్పడం వారి మానసిక వికాసానికి ఉపయోగపడుతుంది. 3 నుంచి 4 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు ఒక రోజులో గరిష్ట సమయం ఒక గంటగా నిర్ణయించారు.
తమ పిల్లలను మొబైల్, టీవీలకు దూరంగా ఉంచడం తల్లిదండ్రుల బాధ్యత. అయినప్పటికీ ఈ విషయాన్ని, సమస్య తీవ్రతను తల్లిదండ్రు లందరూ అర్థం చేసుకోవటం లేదు. పీయూ రీసెర్చ్ సెంటర్ 2020 నివేదిక ప్రకారం 45 % మంది తల్లిదండ్రులు 12 ఏళ్లలోపు పిల్లలకు ఫోన్లు ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. అయితే | 28% మంది తల్లిదండ్రులు పిల్లలు 15 ఏళ్లు నిండిన తర్వాతే ఫోన్ వాడవచ్చని చెప్పారు. 22% మంది తల్లిదండ్రులు 11 ఏళ్లలోపు పిల్లలు ఫోన్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
పిల్లలకి ఫోన్ ఇచ్చిన తర్వాత, తల్లిదండ్రులు వారిపై దృష్టి పెట్టాలి. వాళ్లు వాడే ఫోన్లోని యాప్లను పర్యవేక్షించాలి. వినియోగ సమయాన్ని పరిమితం చేయాలి. పిల్లలు వాడే ఫోన్ నుంచి చెడు వెబ్సైట్లు శోధించే వెసులుబాటును బ్లాక్ చేయాలి. ఇంటర్నెట్ సోషల్ మీడియా వల్ల కలిగే హాని గురించి, ప్రమాదాల గురించి వారికి చెప్పాలి.
この記事は Grihshobha - Telugu の June 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の June 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.