మిక్చర్ కజ్జికాయలు
కావలసిన పదార్థాలు :
• మైదా పిండి - 200 గ్రాములు • రవ్వ 50 గ్రాములు • నెయ్యి - 65 గ్రాములు • నవరత్న మిక్చర్/ స్టఫింగ్ - 250 గ్రాములు నూనె - వేయించడానికి • ఉప్పు - రుచికి సరిపడినంత.
తయారుచేసే పద్ధతి :
మైదాపిండి, రవ్వ, నెయ్యి, ఉప్పు బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి పిసికి చపాతీ పిండి ముద్ద తయారు చేసుకోవాలి. అరగంటసేపు ఒక బౌల్ లో వేసి మూత పెట్టి ఉంచండి. ఈ పిండి ముద్దను చిన్న చిన్న ఉండలు చేసుకోండి. పలుచగా గుండ్రంగా ఒత్తుకోండి. వాటిని కజ్జికాయల చెక్కలో పెట్టి మధ్యలో మిక్చర్‌ను నింపి ప్రెస్ చేయాలి. అంచులు తీసివేయాలి. తర్వాత సన్నని సెగపై నూనెలో వేయించండి. కరకరలాడే కజ్జికాయలు రెడీ.
పల్లీ పకోడీ
కావలసిన పదార్థాలు :
• పల్లీలు - 1 కప్పు • శనగపిండి - 1 పెద్ద చెంచా • తరిగిన అల్లం - 1 చిన్న చెంచా • తరిగిన పచ్చిమిర్చి - 1 చిన్న చెంచా • తరిగిన కొత్తిమీర - 1 చిన్న చెంచా • పసుపు - చిటికెడు • కారం - 1/2 చిన్న చెంచా • ధనియాల పొడి - 1 చిన్న చెంచా ఆమ్చూర్ పౌడర్ - '/2 చిన్న చెంచా • నూనె తగినంత • ఉప్పు - రుచికి సరిపడినంత.
తయారుచేసే పద్ధతి :
పల్లీలు, నూనె తప్ప మిగిలిన వాటినన్నింటినీ కలపండి. తగినన్ని నీళ్లు పోసి చిక్కని మిశ్రమంగా తయారుచేసుకోండి. కడాయిలో నూనె పోసి వేడి చేయండి. పల్లీలను ఇందులో వేసి కరకరలాడే వరకు వేయించండి. వీటిని ఆ మిశ్రమంలో కలపండి.మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకుని నూనెలో వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించండి. పల్లీ పకోడీలు సిద్ధం. గ్రీన్ చట్నీతో సర్వ్ చేయండి.
పన్నీర్ టిక్కా మసాలా
కావలసిన పదార్థాలు :
• కావలసిన పరిమాణంలో కట్ చేసిన పన్నీర్ ముక్కలు ఒకటిన్నర కప్పు • తరిగిన గ్రీన్ లేదా రెడ్ క్యాప్సికమ్ - 1/2 కప్పు • తరిగిన ఉల్లిపాయ - 1/2 కప్పు • అల్లం - వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర చిన్న చెంచా • గట్టి పెరుగు - 1 కప్పు • కారం - 1/2 చిన్న చెంచా . గరం మసాలా - 1/4 చిన్న చెంచా • ధనియాల పొడి - 1 చిన్న చెంచా • ఛాట్ మసాలా - 1 చిన్న చెంచా • నూనె - 2 పెద్ద చెంచాలు • నిమ్మరసం - 1/2 చిన్న చెంచా • ఉప్పు - రుచికి సరిపడినంత.
この記事は Grihshobha - Telugu の July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Grihshobha - Telugu の July 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
'ఖిలాడీ'' కుమార్ తో 'ఆడుకున్న' ప్రేక్షకులు
ఖిలాడీ కుమార్ చిత్రం 'ఖేల్ ఖేలే మే' ఫర్దీన్ ఖాన్, ఎమీ విర్క్ లాంటి స్టార్లతో గ్లామర్ పెరిగినప్పటికీ రిజల్ట్ మాత్రం ఆశించినంతగా రాలేదు
విక్రాంత్ 12 వీ 'ఫెయిల్' కాలేదు 'పాస్' అయ్యింది!
ఓటీటీ లో వచ్చిన 'ఫిర్ ఆయీ హసీన్ దిల్ రుబా' చిత్రాన్ని ప్రేక్షకులు బాగా ఆదరించారు.
ఆమె 'అలియా కాపీ' కాదు
'ముంజ్యా' చిత్రం విజయం తర్వాత 'వేద' లోనూ శర్వరి అద్భుతంగా నటించింది.
'స్త్రీ 2' తో సూపర్ హిట్
శ్రద్ధ తన సినిమా సక్సెస్‌ను పండుగ చేసుకుంటోంది.
జ్యోతిష్యుడిపై ఆగ్రహం
ట్రోల్స్ భరించలేక ఇకపై ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పనని ప్రకటించారు.
నాగచైతన్య, శోభిత లది ప్రేమ పెళ్లి
నిశ్చితార్థం జరిగిందంటూ వచ్చిన వార్తలతో అభిమానులు, తెలుగు ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
పీఎంతో విందు... ఫేక్ కాల్ అనుకున్న హీరోయిన్!
చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అటు హిందీ ఆడియన్స్ ఇటు సౌత్ ఆడియన్స్ ను తన బుట్టలో వేసుకుంది అవికా గోర్.
'అఖండ 2' లో ఆ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్...?
నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో 'అఖండ 2' సినిమా రాబోతున్న సంగతి తెలిసింది.
తారక్ బన్నీల మాస్ 'జాతర'ల పోటీ
ఈ ఏడాది అత్యంత క్రేజ్ ఉన్న పాన్ ఇండియా సినిమాల్లో 'దేవర, 'పుష్ప 2 ది రూల్' కీలకమైనవి.
'ఐశ్వర్యరాయ్'తో విడాకులపై అభిషేక్ క్లారిటీ
సెలబ్రిటీలు కాబట్టి, ఇలాంటివి లైట్‌గా తీసుకుంటాం. ఇది నిజం కాదు” అంటూ తన చేతి ఉంగరాన్ని చూపించాడు.