తన తాతయ్య పొలానికి వెళ్లడానికి తయారుకావడం త వరకు పొలానికి వెళ్తాను. మీరు విశ్రాంతి తీసుకోండి” అని చెప్పాడు.
ఇది విని వాళ్ల తాతయ్య నవ్వుతూ “నీకు నేను అనుమతిస్తే మీ నాన్నగారు నన్ను నీతో పొలం పని చేయిస్తున్నానని అంటారు" అన్నాడు.
“కానీ తాతయ్యా, పొలంలో పని చేయడం చాలా గొప్ప విషయం. పెద్ద చదువులు చదివిన వాళ్లు కూడా వ్యవసాయ పనులు చేయడం మొదలు పెట్టారని స్కూల్లో మా టీచరు చెప్పారు".
“అది సరే, నిజంగానే అక్కడ చాలా వేడిగా ఉంటుంది. ఎంత ఎండ ఉందో చూడు".
“అయ్యో వెళ్లనివ్వండి. రాము అతన్ని చూసుకుంటాడు” అంది వాళ్ల అమ్మమ్మ.
తాతగారి పొలం చూసుకునే రాము ఎంతో ఉత్సాహంగా “అవున్సార్, నేను చూసుకుంటాను. నాతో రానివ్వండి" అన్నాడు.
“సరే, అతన్ని తీసుకెళ్లు. నేను ఈ రోజు సర్పంచి కలవాలి. మధ్యాహ్నం పన్నెండు గంటలకు అతన్ని తీసుకువస్తాను. ప్రభుత్వ గొట్టపు బావిని అమర్చడానికి మనం సరైన స్థలం కనుక్కోవాలి. అప్పుడు రోహనన్ను నాతో ఇంటికి తీసుకువస్తాను"
తాతగారు వెళ్లడానికి అనుమతి ఇవ్వగానే రోహన్ ముఖం వెలిగిపోయింది. రాము కూడా తాతగారికి భరోసా ఇస్తూ “అతని గురించి ఏమీ విచారించకండి. మేము స్నాక్స్ తీసుకుంటాం.కుండలోని చల్లని నీరు తాగుతాం, ఆనందిస్తాం” అని చెప్పాడు.
తాతగారు “సరే” అని చెప్పి తయారుకావడానికి వెళ్లారు.
వాళ్లు వెళ్లిపోతూ ఉంటే రోహన్ అమ్మమ్మ “వెళ్లి తిరుగుతూ ఎంజాయ్ చెయ్. మధ్యాహ్నం నువ్వు తిరిగి వచ్చాక నీకు ఇష్టమైన కూరలతో రొట్టెలు చేసి పెడతాను” అని చెప్పింది.
రోహన్కి నోట్లో నీళ్లూరాయి.
అతడు ఎంతో ఉత్సాహంగా రాముతో కలిసి పొలం వైపు నడిచాడు.
రోహన్ వేసవి సెలవుల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూసాడు.
ఒక రోజు క్రితం తన తండ్రితో కలిసి గ్రామానికి వచ్చాడు. ఈ రోజు అతని తండ్రి మీరట్ వెళ్లిపోయాడు.
పదిహేను, ఇరవైరోజుల తర్వాత అతని తల్లిదండ్రులు వచ్చి ఒక వారం లేదా రెండు వారాలు ఉండి, ఆ తర్వాత అతన్ని వెనక్కి తీసుకెళతారు. కాబట్టి రోహన్ గ్రామంలో ఎక్కువ రోజులు గడపవచ్చు.
అతడు ఇక్కడ ఉండి ఎంజాయ్ చేసాడు. వంట గ్యాస్ ఉంది. అతడు అడిగినప్పుడు వాళ్ల అమ్మమ్మ ధాన్యాలతో పొయ్యిపైన రొట్టెలను చేసి ఇచ్చింది.
Denne historien er fra May 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఆసక్తికర విజానం
వంతెనల నిర్మాణం
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు