చీకూ కుందేలు, మీకూ ఎలుక ఒక చెట్టు కొమ్మకి ఊయల కట్టి ఊగుతున్నారు.
“వాహ్ ఎంత సరదాగా ఉందో”.
“మీకూ, సరదా అయితే లభిస్తోంది. కానీ జాగ్రత్తగా ఉండు. కింద పడితే సరదా మొత్తం శిక్షగా మారుతుంది.”
“డోంట్ వర్రీ చీకూ, నేను ఒకవేళ చేతులు వదిలినా, కింద పడిపోను" గట్టిగా ఊయల ఊగుతూ చెప్పాడు మీకూ.
మీకూ తన మాట ముగించగానే, బలమైన గాలి విసురు వచ్చింది. మీకూ చేతులు ఊయల నుంచి జారి పోయాయి. నేరుగా వెళ్లి, దగ్గరలోనే నిద్ర పోతున్న గజ్జూ ఏనుగు మీద పడ్డాడు.
మీకూ మీద పడగానే గజ్జూ నిద్ర చెదిరిపోయింది.
“నా నిద్ర చెడగొట్టడానికి ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది" అని గజ్జూ కోపంతో ఘీంకరించాడు. అతని చూపు మీకూపై పడగానే అతని కోపం మరింత పెరిగింది.
"మీకూ, నాపై దూకడానికి నీకు ధైర్యం ఎలా వచ్చింది. నువ్వు ఏం చేసావో నీకు తెలుసు కూడా.” “నన్ను క్షమించు గజ్జూ, నేను కావాలని అలా చేయలేదు. గాలి విసురుతో ఊయల గట్టిగా ఊగిసలాడింది. నేను నీపై పడిపోయాను. నా కారణంగా నీకు దెబ్బ తగిలినందుకు నాకు బాధగా ఉంది" భయపడుతూ చెప్పాడు మీకూ.
“హూ, నీలాంటి అల్పప్రాణి నాపై పడితే నాకేం దెబ్బ తగులుతుంది. కానీ నువ్వు నన్ను నిద్ర లేపి నాకు చాలా నష్టం కలిగించావు. నాకు నిద్రలేమి రోగం ఉంది. పది రోజుల తర్వాత అతి కష్టంగా ఈ రోజు నేను కొంచెం కళ్లు మూయగానే నువ్వు నన్ను నా నిద్ర చెడగొట్టావు. ఇప్పుడు నిన్ను అస్సలు వదిలిపెట్టను.”
"చీకూ నన్ను రక్షించు" గజ్జూ తనవైపు రావడం, తొండం ఎత్తడం చూసి మీకూ భయంతో అరిచాడు.
“అరే ముందు నన్ను రక్షించుకోనీ. తర్వాత నిన్ను రక్షించే విషయం ఆలోచిస్తా" చీకూ అక్కడి నుంచి పరుగెత్తుతూ చెప్పాడు. కొద్ది దూరం వెళ్లి ఒక చెట్టు వెనుక దాక్కున్నాడు.
'హూ... నేను నిజమైన స్నేహితుడనుకున్న మనిషే కష్ట సమయంలో నన్ను విడిచి పారిపోయాడు’ అనుకున్నాడు. మీకూ కళ్లలో నీళ్లు నిండాయి.
Denne historien er fra August 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్