ఆ నందవనంలో నివసించే జిజూ జీబ్రా, రోరో ఎలుక మంచి స్నేహితులు. బాగా చదివే వారు. వారి స్నేహాన్ని అందరూ ఆదర్శంగా తీసుకునే వారు.
జానే జీబ్రా అదే వనంలో నివసించే వాడు. జిజూ, రోరోల స్నేహం అతనికి నచ్చకపోయేది. దాని గురించి తరచూ జిజూతో మాట్లాడేవాడు.
ఒక రోజు ఉదయం జిజూను కలిసాడు.
“అంతా బాగేనా? ఎలా ఉన్నావు" జిజూకి షేక్ హ్యాండ్ ఇస్తూ అడిగాడు జానే.
“అంతా బాగుంది, సెలవుల్లో ఏం చేస్తున్నావు?” అడిగాడు జిజూ.
“ఏమీ లేదు, అలా తిరుగుతున్నాను అడవిలో” అన్నాడు జానే.
“రోరో, నేను కలిసి కోడింగ్ క్లాసుల్లో చేరబోతున్నాం” చెప్పాడు జిజూ.
“ఆ చిన్న ఎలుక రోరోతోనా? ఎలుకతో నీ స్నేహం చూసి ప్రతి ఒక్కరు ఎగతాళి చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తే నాకూ నవ్వు వస్తోంది. నువ్వు మా గ్రూపుకి లీడరివి. తెలివైన వాడివి. చెట్లు ఎక్కడంలో నేర్పరివి. అలాంటిది నువ్వు ఒక చిన్న ఎలుకతో స్నేహం చేస్తున్నావు. జీబ్రాల గౌరవం, హెూదాల గురించి అస్సలు పట్టించుకోవడం లేదు" అన్నాడు జానే.
“అలా ఎలా అంటావు జానే? ఆకారం, రంగు చూసి ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ప్రాముఖ్యత ఉంటుంది. నువ్వు ఏ గౌరవం గురించి మాట్లాడుతున్నావు? మనమందరం కలసిమెలసి జీవించాలి. పరస్పరం సహాయం చేసుకోవాలి. స్నేహంలో చిన్నా పెద్దా అనే తేడా ఉండదు. కులం, జాతి, మత బేధాలు ఏమీ లేవు ఇందులో" అని చెప్పాడు జిజూ.
జానే విసుక్కుంటూ “సరే నీ ఇష్టం. ఇది నీ స్నేహం విషయం, నేను పట్టించుకోను. కానీ మళ్లీ చెబుతున్నాను. నీ స్నేహం ఆ ఎలుకతో మ్యాచ్ కాలేదు" అన్నాడు.
“నువ్వు కూడా అతనితో స్నేహం చెయ్. ముగ్గురం కలిసి సరదాగా గడపవచ్చు. రోరో చాలా మంచివాడు. ఒక్కసారి నువ్వు అతనితో మాట్లాడి చూడు, ఎంతో సంతోషిస్తావు" అని నచ్చజెప్పాడు జిజూ.
Denne historien er fra August 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!