ఆ నందవనంలో జోజో గుంట నక్కకు మాత్రమే కొబ్బరి కాయల దుకాణం ఉంది. అందుకే అతడు ఇష్టానుసారం ధర నిర్ణయించి కొబ్బరి నీళ్లు అమ్మేవాడు. అడవిలో ఎవ్వరూ మరో కొబ్బరి నీళ్ల దుకాణం తెరవకూడదనుకున్నాడు. అయితే అడవిలో డానీ గాడిద కూడా కొబ్బరి నీళ్ల దుకాణం తెరవబోతున్నాడన్న విషయం తెలిసి, అతనికి కోపం వచ్చింది. వెంటనే డానీ దగ్గరికి వెళ్లాడు.
“డానీ, నీకు పని చేయడానికి ఇంకేదీ దొరకలేదా? కొబ్బరి నీళ్ల దుకాణం తెరవబోతున్నావా? అలాంటి ధైర్యం చేయకు" బెదిరించాడు జోజో.
"జోజో, నా దుకాణంతో నీకేమిటి సమస్య? మన దుకాణాలు దగ్గరగా ఎదురెదురుగా ఉండవు కదా” జవాబిచ్చాడు డానీ.
“నాకదంతా తెలియదు. దుకాణం తెరవద్దు, అంతే" అరిచాడు జోజో.
“అదేం కుదరదు. ఈ దుకాణం కోసం నేను నా పొదుపు డబ్బంతా ఖర్చు చేసాను. దుకాణం తెరవకపోతే నేను చాలా బాధపడాల్సి వస్తుంది” చెప్పాడు డానీ.
“ఓకే, అయితే నాలాగే నువ్వు కొబ్బరి నీళ్లకు వంద రూపాయలు తీసుకోవాలి" అన్నాడు జోజో.
“అంత ఖరీదుకా? నేను ముప్పై రూపాయలకే అమ్ముతాను” బదులిచ్చాడు డానీ.
“డానీ, అందుకే అందరు నిన్ను పూల్ అంటారు. అంతా వంద రూపాయలకు కొనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ముప్పైకి అమ్మడం ఎందుకు?" అడిగాడు జోజో
"లేదు, నేను కొబ్బరి నీళ్లు ముప్పై రూపాయలకే అమ్ముతాను. అంత ఆశపడటం మంచిది కాదు” చెప్పాడు డానీ.
కొబ్బరి నీళ్లను వంద రూపాయలకే అమ్మమని జోజో ఎన్నో రకాలుగా చెప్పి ఒప్పించడానికి ప్రయత్నించాడు. అయినా డానీ ఒప్పుకోకపోవడంతో జోజోలో కోపం మరింత పెరిగింది. “నువ్వు మంచిగా చెబితే వినవు" అన్నాడు జోజో చిరాగ్గా.
డానీని కొట్టబోయాడు కానీ ఇంతలో తనవైపు ఎల్లీ ఏనుగు రావడం చూసి మౌనం వహించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు జోజో.
సెప్టెంబర్ 2 ‘ప్రపంచ కొబ్బరి దినోత్సవం' సందర్భంగా అడవిలో కొబ్బరి నీళ్ల దుకాణం తెరవబోతున్నానని, ప్రారంభోత్సవానికి సాయంత్రం వరకల్లా అంతా రావాలని డానీ అడవిలోని అందరికీ చెప్పాడు.
దుకాణానికి కింగ్ లియోను ప్రత్యేకంగా ఆహ్వానించాడు.
మరుసటి రోజు డానీ దుకాణం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అందరూ వచ్చారు. కింగ్ లియో రిబ్బన్ కట్ చేసి దుకాణం ప్రారంభించాడు. అందరూ చప్పట్లు కొట్టారు.
Denne historien er fra September 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 2023-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్