ఒక రోజు అతడు నది దగ్గర పచార్లు చేస్తున్నాడు. అక్కడ జంబో ఏనుగు, చీకూ కుందేలు, జంపీ కోతి, వారి స్నేహితులు నదిలో స్నానం చేయడం చూసాడు.
జంపీ నీటిలో దూకసాగాడు. అతడు నీళ్లలో మునగగానే కొన్ని నీళ్లు బ్యాడీ మీద పడ్డాయి. బ్యాడీ ఈ అవకాశం కోసమే ఎదురుచూస్తున్నట్లుగా అనిపించింది.
“ఏం చేస్తున్నావ్ నువ్వు? నీళ్లు నా మీద పడటం చూడ్డం లేదా? నీకు స్నానం చేయడం తెలియదు
పూల్. ఎలాంటి మర్యాదలూ తెలియవు" అన్నాడు.బ్యాడీ కోపంగా.
“నువ్వు గుడ్డివాడివా? మేమిక్కడ స్నానం చేస్తున్నామని నీకు తెలియదా? నువ్వు దగ్గరికి వస్తే నీళ్లు నీపై పడకుంటే ఏం చేస్తాయి? కాస్త దూరంగా వెళ్లు” అన్నాడు జంపీ.
“అంటే నేను ఈ ప్రదేశంలో షికారు చేయకూడదా? అది నీకు సంబంధం లేదు. ఇక్కడ నీకెంత హక్కుందో నాకూ అంతే ఉంది. ముందు నువ్వు స్నానం ఎలా చేయాలో నేర్చుకో" అన్నాడు బ్యాడీ చిరాగ్గా.
“నోర్మూసుకుని వెళ్లు. పదండిరా, స్నానం చేద్దాం” అంటూ జంపీ నీళ్లలోకి మళ్లీ దూకాడు. దాంతో నీళ్లన్నీ బ్యాడీ మీద చిల్లాయి.
బ్యాడీ సహనం కోల్పోయాడు. స్నానం చేస్తున్న వారినందరినీ తిట్టసాగాడు. జంపీ స్నానం చేసి బయటకు రాగానే పోట్లాడడానికి అతనివైపు వెళ్లాడు. దాడి చేయాలనుకున్నాడు. జంపీ సైతం ఆవేశానికి లోనయ్యాడు.
బ్యాడీ తన గోళ్లతో రక్కడానికి జంపీవైపు వెళ్తుండగా అతన్ని ఆపడానికి చీకూ ఇతర జంతువులు అక్కడికి వచ్చాయి. గుంపును చూసి బ్యాడీ పారిపోయాడు.
“మనం బ్యాడీకి గుణపాఠం చెప్పాలి. ఎలాంటి కారణం లేకుండానే ఎవరితో పడితే వారితో గొడవ పెట్టుకుంటాడు. ఈ రోజు అతను భలేగా స్నానం చేసాడు" అన్నాడు జంపీ.
Denne historien er fra January 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్