పదేళ్ల అమర్‌కి బామ్మ, తాతయ్యతో చాలా అనుబంధం ఉండేది. అమర్ తల్లిదండ్రులు వ్యాపారంలో బిజీగా ఉండటంతో అతని బాగోగులు బామ్మ తాతయ్యలు చూసుకునే వారు. తాతయ్య పొద్దున వారి షాపుకు వెళ్లి భోజనం వేళకు ఇంటికి తిరిగి వచ్చేవాడు. ఆ సమయానికి అమర్ స్కూల్ నుంచి వచ్చేసేవాడు. బామ్మ, తాతయ్య, అమర్ కలిసి కబుర్లు చెప్పుకునేవారు. స్కూలులో జరిగే ప్రతి చిన్న విషయాన్ని అమర్ బామ్మ, తాతయ్యలతో చెబుతుంటే తాతయ్య తన చిన్ననాటి సంఘటనలు అతనికి కథలుగా వినిపించే వాడు. ఆయన చెప్పే కథలను అమర్ ఎంతో ఇష్టంగా వినేవాడు.
చాలా సంవత్సరాల క్రితం తాతయ్య ఆ ఊర్లో తన కోసం ఒక ఇల్లు కట్టుకున్నాడు. కానీ ఇప్పుడు పెరిగిన కుటుంబానికి ఇది చిన్నదైంది. అమర్ తన స్నేహితులలాగా తనకూ ఓ ప్రత్యేక గదిఉండాలనుకున్నాడు. ఇల్లు బాగానే ఉంది. కానీ చాలా సంవత్సరాల క్రితం కట్టడంతో అది పాతబడింది. ప్రతి ఒక్కరూ ఇప్పుడు కొత్త హంగులతో కూడిన ఆధునిక ఇంటిని కోరుకుంటుండటంతో అమర్ సైతం అలాంటి ఇల్లే కావాలని అడిగాడు. అతను పట్టుబట్టడంతో చివరికి తాతయ్య అతని కోరిక ప్రకారం కొత్త ఇల్లు కట్టడానికి అంగీకరించాడు. ఇంటి నిర్మాణం పనులు ప్రారంభించారు. కొన్నిసార్లు అమర్ తాతయ్యతో కలిసి ఆ ఇంటి వద్దకు వెళ్లేవాడు. ఎప్పుడెప్పుడు కొత్త ఇంటి పనులు పూర్తవుతాయా, ఆ ఇంట్లోకి ఎప్పుడు మారతానా, తన గదిని సామాన్లతో ఎప్పుడు అలంకరించుకోవాలా అని తహతహలాడేవాడు.
స్కూల్ నుంచి వచ్చాక ఒక రోజు భోజనం చేస్తూ అమర్ “తాతయ్యా, మనం ఎప్పుడు కొత్త ఇంట్లోకి మారబోతున్నాం. ఇంటి పనులు ఎప్పటివరకు పూర్తవుతాయి?" అని అడిగాడు.
“త్వరలో పూర్తవుతుంది. ఇంకా కొంచెం పని మిగిలి ఉంది”.
“తర్వాత ఈ ఇంటిని ఏం చేస్తాం తాతయ్యా?" అడిగాడు అమర్.
“మేము దీన్ని ప్రస్తుతం ఎవరికీ ఇవ్వము.అవకాశం దొరికినప్పుడల్లా ఇక్కడికి వస్తూనే ఉంటాము.ఈ ఇల్లు పాతదే కావచ్చు. కానీ దీనితో నా పాత జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు నీకు చెప్పినా అర్థం కాదు" అన్నాడు తాతయ్య.
Denne historien er fra February 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra February 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫ్రెండ్షిప్ బ్యాండ్స్
స్మార్ట్
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
తాతగారు క్విట్ ఇండియా ఉద్యమం
మ్యాప్ క్వెస్ట్
జోజో దెయ్యం నిద్రలో నుంచి లేవగానే తనపై కొన్ని మరకలు చూసి భయపడింది.
అరుదైన దెయ్యం
అరుదైన దెయ్యం
బొమ్మను పూర్తి చేయండి
క్విట్ ఇండియా ఉద్యమం 1942, ఆగస్టు 8వ తేదీన ప్రారంభమైంది.
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు
చుక్కలు కలపండి
ఆగస్టు 4 వ తేదీ ఫ్రెండ్షిప్ డే.
చీకూ
చీకూ
న్యూటన్ డిస్క్
ఆసక్తికర విజ్ఞానం ఏడు రంగులు ఒకదానిలో కలిసి పోవడాన్ని చూడండి!