పెద్దల కోసం సమయం లేకపోవచ్చు. కానీ పిల్లల కోసం నాకు తగినంత సమయం ఉంది" అని పిండిట్ జవహర్ లాల్ నెహ్రూ తరచూ చెప్పేవారు. అవును, ప్రధానమంత్రి బాధ్యతలు నిర్వహించే నెహ్రూకి తన బిజీ షెడ్యూల్లో ఎక్కువ ఖాళీ సమయం దొరకకపోయేది. కానీ పిల్లలంటే అతనికి ఉన్న ప్రేమ వల్ల వారితో తరచూ కలవడానికి ఇష్టపడేవారు.
ప్రత్యేక హక్కులు, విభిన్న సంస్కృతులు, దేశ భవిష్యత్తులో పిల్లలే కీలకమని అతని గట్టి నమ్మకం. అతను పిల్లలకు రాసిన ఒక లేఖలో “నాకు పిల్లలతో కలవడం, వారితో మాట్లాడటం, ఇంకా వారితో ఆడుకోవడం ఇష్టం. ప్రస్తుతానికి నేను చాలా పెద్దవాడిని. నేను నా బాల్యాన్ని చాలాకాలం క్రితమే మర్చిపోయాను" అని పేర్కొన్నారు. పిల్లల లాంటి ఆలోచన కారణంగానే, పిల్లలకు అతను ప్రధానమంత్రిలా కాకుండా వారికి ప్రియమైన బాబాయి లేదా చాచా నెహ్రూగా ప్రసిద్ధిగాంచారు.
నెహ్రూ “పిల్లలను సంస్కరించడానికి ఏకైక మార్గం, ప్రేమతో వారిని గెలవడమే. పిల్లలతో స్నేహపూర్వకంగా లేనంత కాలం, వారి తప్పులను లేదా తప్పుడు మార్గాలను సరిదిద్దలేము" అని అభిప్రాయ పడేవారు. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అతను పిల్లలను కలిసినప్పుడల్లా వారితో స్నేహంగా ఉండేవారు. అతను పిల్లలకు దగ్గరయ్యేందుకు ఒక అద్భుతమైన మార్గాన్ని ఎంచుకున్నారు. నిష్ణాతుడైన ఉత్తరాది రచయిత కావడంతో తన ఆలోచనలను లేఖలతో వ్యక్త పరిచారు!
'భారతదేశ పిల్లలకు ఒక లేఖ' అనే శీర్షికతో ఉన్న అలాంటి ఒక లేఖ పాఠశాల పాఠ్యాంశాల్లోకి గద్య పాఠంగా కూడా కనిపిస్తుంది. లేఖలో నెహ్రూ పిల్లలు తమ జీవితం పైనే కాకుండా తమ చుట్టూ ఉన్న అందమైన ప్రపంచం గురించి వారు తెలుసుకోవాలని ప్రోత్సహించారు. మతం, కులం, పేద, ధనిక, భాష లాంటి విభేదాలతో అడ్డుపడే పెద్దలుగా ఎదగవద్దని చెప్పేవారు. అలాంటి భావాలున్న వారిని అడ్డుకునేవారు. అతను తన లేఖలలో "మనది చాలా పెద్ద దేశం. మనమందరం కలిసి చేయవలసినది చాలా ఉంది. ప్రతి ఒక్కరు చేసే చిన్నచిన్న పనులు కలిస్తే దేశం పురోగమిస్తుందని, వేగంగా ముందుకు సాగుతుంది” అని బలంగా చెప్పేవారు. ఆ లేఖలోని ప్రభావవంతమైన పదాలు, చాచా నెహ్రూపై పిల్లలకు ప్రేమ, అభిమానం, గౌరవాన్ని కలిగించాయని చెప్పవచ్చు. నైతిక విలువలు, సూత్రాలకు ప్రాధాన్యత ఇవ్వడం, విదేశాలతో సుహృద్భావ సంబంధాలను ఏర్పాటు చేసుకోవడం లాంటివి, వాటి ప్రాముఖ్యతను ఇది వారికి అర్థమయ్యేలా చేసింది.
Denne historien er fra November 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 2024-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్