నాగావళి నదికి ఒడ్డున సంగంవలస అనే పెద్ద గ్రామమొకటి ఉంది. అక్కడే 5 సువర్ణముఖి, వేగావతి నదులు నాగావళిలో కలుస్తున్నాయి. అందుకే ఆ ప్రాంతాన్ని త్రివేణీసంగమం అంటారు. ఆ ప్రాంతమంతా ప్రాకృతికశోభతో అత్యంత ఆహ్లాదకరంగా ఉంటుంది. కొండల నడుమ గుండా ప్రవహించే నదుల గలగలల సోయగాలు యాత్రికులను కనువిందు చేస్తుంటాయి. ఆ నదులకు ఆనుకుని ఉన్న పంటపొలాలు పచ్చదనంతో పలకరిస్తుంటాయి.అంత అందమైన సంగంవలస గ్రామంలో రాఘవవర్మ ఏకైక భూస్వామి.గతంలో వారి పూర్వీకులే రాజులూ జమీందారులూను. అక్కడ కొంతమేర శిధిలావస్థలో ఉన్న కోట ఒకటి ఉంది. ఆ కోటలో ఓ ప్రక్కన ఒక అధునాతన భవనం ఉంది. అదే రాఘవవర్మ నివాసం.
వర్మ సంగంవలస నియోజకవర్గానికి గతసారి జరిగిన సాధారణ ఎన్నికలలో శాసనసభ్యునిగా పోటీచేసి ఓడిపోయారు. గతంలో వారి తాత మాధవవర్మ మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత వారి తండ్రి విక్రమవర్మ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, రెండుసార్లు మంత్రిగా కూడా పదవిని అలంకరించారు.ఒకప్పుడు వారి తాతదండ్రుల్లా నేడు వీరికి గెలుపేమి సునాయాసం కాదు.ఎందుకంటే ఆ నియోజకవర్గంలో వారి సామాజిక వర్గం ఉండేది.బహుస్వల్పమే. నేడు బహుజన సామాజిక వర్గాలలో రాజకీయ చైతన్యం పెరిగింది. ఆయా వర్గాలు ఐక్యంగా పనిచేయడంతో జనాభాపరంగా తక్కువ ఉన్న అగ్రవర్ణాల గెలుపేమి ఇంతకుమునుపులా సులువు కాదు. అందువల్లనే వర్మ గత ఎన్నికల్లో పోటీచేసి ఓ సామాన్యుడి చేతిలో ఓడిపోయాడు.ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న బహుజన వర్గానికి చెందిన ఓ సామాజిక వర్గం రాజకీయాలను బాగా శాసిస్తున్నది. అందువల్ల అగ్రవర్ణ వర్గాలకు చెందిన రాఘవవర్మ గెలుపు ఆనాడు అసాధ్యమైంది. కానీ వర్మ ఈసారైనా గెలిచి ఎమ్మెల్యే కావాలని తహతహలాడుతున్నాడు. ఈసారి ఎన్నికల్లో ఎలాగో ఒకలాగా విజయాన్ని సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతున్నాడు.డబ్బు అంతకు పదింతలు విరజల్లాలనే ఆలోచనతో ఉన్నాడు. తన తండ్రీతాతల్లా గెలిచి తన సత్తా ఏంటో అందరికీ చాటాలనుకుంటున్నాడు.అయితే ఒకవైపు తనకు గెలుపు సాధ్యం కాకపోవడం పట్ల బాధతో ఉన్నాడు.
Denne historien er fra November 26, 2023-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 26, 2023-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
భరతమాత మెచ్చిన రత్నం మన రతన్ నవల్ టాటా
ప్రపంచ ప్రఖ్యాత పారిశ్రామిక వేత్త, టాటా గ్రూపు/టాటా సన్స్ కంపెనీలకు 21 ఏళ్ల పాటు చైర్మన్గా పని చేసి, దాతృత్వానికి పెట్టింది పేరుగా నిలిచి, భారతీయులందరికీ గర్వకారణం అయిన రతన్ నవల్ టాటా 28 డిసెంబర్ 1937న సూనీ టాటా - నవల్ టాటా పుణ్య దంపతులకు ముంబాయిలో జన్మించారు.
దివికెగిన ఆర్థిక & రాజకీయ దిగ్గజం..
మన్మోహన్ సింగ్ 1932 సెప్టెంబర్ 26న అవిభాజ్య భారత దేశంలోని పంజాబ్ ప్రావిన్స్లో జన్మించారు.
సూర్య ఫైండ్ ది difference
సూర్య ఫైండ్ ది difference
సూర్య కవిత
సూర్య కవిత
VEGETABLES CROSSWORD
VEGETABLES CROSSWORD
సూరు బుడత
సూరు బుడత
సూర్య find the way
సూర్య find the way
సూర్య బుడత
బాలల కథ మార్పు తెచ్చిన రేఖ
ఫన్ చ్
ఫన్ చ్
కాలచక్రం లో.....
కాలచక్రం లో.....