అగ్రరాజ్యమైన అమెరికా ఎన్నికలను పరిశీలిస్తే.. అక్కడ వయస్సుపైబడిన వారే తప్ప... యువతరం అగ్రపీఠాన్ని అధిరోహించే అవకాశాలు దగ్గరలో ఉన్నట్లు ఎక్కడా కనిపించడం లేదు. ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో యువతరం ఎప్పుడు ఎదుగుతుందా అని ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తుంటే.. అందుకు భిన్నంగా అగ్రరాజ్యం ఎన్నికలు జరుగుతుండటం ఇప్పుడు ప్రధానమైన చర్చకు దారితీసింది. ఇదిలా ఉంటే... పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పీఠాన్ని అధిరోహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడు జరిగినా యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా శతృదేశాలపై అమెరికా నూతన అధ్యక్షుడు వ్యూహం ఎలా ఉంటుందో అన్న ఆందోళనతో ఒకరైతే... ద్వైపాక్షిక సత్సంబంధాలు కొనసాగించడానికి సరికొత్త మార్గాలను అన్వేషించడానికి అమెరికా మిత్రదేశాలు ఉవ్విళ్లూరుతుంటాయి. ప్రపంచ దేశాలను శాసించేలా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో అగ్రరాజ్యానిదే పెద్దపీట. ఆతరువాతే ఇతర దేశాలు అభిప్రాయాలుంటాయి. ఇటువంటి నేపథ్యంలో అధ్యక్ష ఎన్నకిలు మరింత కీలకం కానున్నాయి. దశాబ్దాల కాలంగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎప్పుడైనా... ఎవరైనా యువ నాయకుడు పోటీ చేస్తారా..? లేదా..? అనే విషయంలో ప్రపంచ దేశాలు ఎదురు చూస్తూనే ఉంటున్నాయి. కానీ ఎప్పటికప్పుడు ఆ ఎదురు చూపులు అడియాశలైపోతున్నాయి.తాజాగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో అభ్యర్థులు శరవేగంతో తమ గెలుపు ఓటములపై కసరత్తు ముమ్మరం చేశారు.అయోవా రాష్ట్ర రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో గెలిచిన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు న్యూ హ్యాంప్ షైర్ రాష్ట్ర ప్రైమరీలోనూ మెజారిటీతో గెలవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ట్రంప్ వరుసగా రెండు రాష్ట్రాల్లో గెలిస్తే దేశాధ్యక్ష ఎన్నికలో రిపబ్లికన్ పార్టీ నామినేషన్ ఆయన్నే వరించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ (డెమోక్రటిక్ పార్టీ)తో డొనాల్డ్ ట్రంప్ తలపడటం ఖాయమవు తుంది. అధ్యక్ష పదవికి బైడెన్ (81), ట్రంప్ (77) వంటి వృద్ధ సింహాలు తప్ప మరో గతి లేదా అని మెజారిటీ అమెరికన్ ఓటర్లు ఇప్పుడు మధనపడుతున్నారు.
Denne historien er fra January 28, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 28, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
1.12.2024 నుంచి 7.12.2024 వరకు
వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము. గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి.
'మెకానిక్ రాకీ'
కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి తీసిన ఈ సినిమాలో కథ ఏమిటి? కథనం ఎలా ఉంది?
'లక్కీ భాస్కర్'
దుల్కర్ సల్మాన్‌కు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది
ఆదరణ కొరవడి అంతరించిపోతున్న బాషలు
భావ వ్యక్తీకరణకు మూలం భాష. భాషలేవీ మనుగడలో లేని ఆదిమానవుల కాలంలో, వారు సౌంజ్ఞలు చేయడం, అగ్ని, పొగ రాజేయడం, తప్పెట్లపై దరువు వేయడం, నోటితో ధ్వనులు చేసి తమ ఆలోచనలు మరియు భావాలను వ్యక్తపరిచేవారని అధ్యయనకారుల అభిప్రాయం.
ముఖానికి బెల్లం రాస్తే చాలు, వయసు తగ్గడం ఖాయం..!
పంచదారకు ప్రత్యామ్నాయంగా ఈ బెల్లాన్ని వాడుతూ ఉంటాం. కానీ.. ఈ బెల్లం మన ఆరోగ్యాన్ని మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుందని మీకు తెలుసా?
తక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ గాలి నాణ్యత కారణంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు
చలికాలం ప్రారంభమై నగరంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
వేమన శతకం
వేమన శతకం
సూర్య find the difference
find the difference
సూర్య sudoku
sudoku
సూర్య Color by number
Color by number