బహుళ ప్రజాదరణ పొందిన రంగస్థలం
Suryaa Sunday|March 24, 2024
ప్రస్తుతం వారి స్థితి రంగు వెలిసినజీవితాలు. నాటక ప్రదర్శనలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి.
- పింగళి భాగ్యలక్ష్మి 9704725609
బహుళ ప్రజాదరణ పొందిన రంగస్థలం

తెలుగు నాటకరంగం ప్రస్తుతం సంక్షోభంలో వుంది. ఒకనాడు ఊరూరా నాటక సమాజాలు ఉండేవి.ఎక్కడ చూసినా నాటకాల ప్రదర్శనలు సందడిగా సాగేవి. ఉత్సవాల్లో భాగంగా నాటకాలు ప్రదర్శించేవారు.కళాకారులకు ఈనాడు సినీతారలకు అభిమానులు వున్నట్లే, అప్పుడు ఆకర్షణ ఉండేది. ప్రస్తుతం వారి స్థితి రంగు వెలిసినజీవితాలు. నాటక ప్రదర్శనలు గత వైభవ చిహ్నాలుగా మిగిలాయి. నాటక పరిషత్తులకే ప్రదర్శనలు పరిమితం అయ్యాయి. వాటి భవిష్యత్తు మెరుగు పడాలంటే, ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకోవాలి. ప్రతీ మండల కేంద్రంలోనూ ప్రదర్శన శాలలు నిర్మించాలి. వారానికి ఒకనాటకమైనా ప్రదర్శించడానికి నిధులు ఇవ్వాలి.రిహార్సల్స్ వేసుకునేందుకు సదుపాయాలు కల్పించాలి. జిల్లా స్థాయిలో, ప్రతి సంవత్సరం నాటకోత్సవాలు నిర్వహించాలి. రాష్ట్ర స్థాయి పోటీలు క్రమం తప్పకుండా ఏర్పాటు చేయాలి. సాంఘిక, జానపద, పౌరాణిక విభాగాల్లో విడివిడిగా పోటీలు నిర్వహించాలి. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో నాటక రంగంపై సిలబస్ చేర్చాలి.దేవాలయ ఉత్సవాల్లో విధిగా నాటకాలు ప్రదర్శించే విధంగా చర్యలు తీసుకోవాలి.

“కావ్యేషు నాటకం రమ్యం" అన్నది భారతీయ సాహిత్యం నుండి పుట్టిన అతి రమణీయమైన వాక్యం. ఇది కావ్యాలలో నాటకా నికున్న ప్రాధాన్యతను, ప్రాచుర్యాన్ని చెబుతుంది. ప్రాచీన కాలం లో నాటకానికి ఉన్న ప్రాముఖ్యత అనంతం, అమోఘం అనే చెప్పా లి.చరిత్రను తిరగవేస్తే సుమారుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల లోనూ, భారతదేశంలోనూ నాటక కళ మొదలైంది. సుమారుగా నాలుగో శతాబ్దంలో పర్షియన్ నాటికలు గ్రీకులు వేశారని చెబు తారు. అయితే భారతదేశంలో క్రీస్తుకు పూర్వం అంటే నాలుగవ శతాబ్దంలో భరతముని రాసిన నాట్య శాస్త్రమే నాటకానికి స్ఫూర్తి అని చరిత్రకారులు చెబుతుంటారు. అలాగే మొట్టమొదటి నాటకం అక్షర రూపం దాల్చింది మాత్రం సంస్కృత భాషలోనే. కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్నివిత్రం, భవభూతి రచించిన మాలతి మాధవీయం, ఉత్తర రామచరిత్ర.....ఇలా ఎన్నో ప్రాచీన నాటకాలు ఇప్పటికీ అవి అపురూపమైనవి, నేటికీ ఆదరణీయ మైనవిగా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి.

Denne historien er fra March 24, 2024-utgaven av Suryaa Sunday.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra March 24, 2024-utgaven av Suryaa Sunday.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA SURYAA SUNDAYSe alt
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
Suryaa Sunday

తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం

పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.

time-read
3 mins  |
November 03, 2024
'అమరన్' సినిమా రివ్యూ,
Suryaa Sunday

'అమరన్' సినిమా రివ్యూ,

శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.

time-read
2 mins  |
November 03, 2024
'బఘీర'
Suryaa Sunday

'బఘీర'

కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.

time-read
2 mins  |
November 03, 2024
గుల్ మొహర్..
Suryaa Sunday

గుల్ మొహర్..

గుల్ మొహర్..

time-read
4 mins  |
November 03, 2024
ఈ వారం కధ
Suryaa Sunday

ఈ వారం కధ

క్యూ లైన్

time-read
2 mins  |
November 03, 2024
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
Suryaa Sunday

పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు

పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం

time-read
1 min  |
November 03, 2024
సుమతీ శతకం
Suryaa Sunday

సుమతీ శతకం

సుమతీ శతకం

time-read
1 min  |
November 03, 2024
FIND 10 DIFFERENCES
Suryaa Sunday

FIND 10 DIFFERENCES

FIND 10 DIFFERENCES

time-read
1 min  |
November 03, 2024
సూర్య- fill colour
Suryaa Sunday

సూర్య- fill colour

సూర్య- fill colour

time-read
1 min  |
November 03, 2024
సూర్య- match the items
Suryaa Sunday

సూర్య- match the items

సూర్య- match the items

time-read
1 min  |
November 03, 2024