ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట. మనుషులు మారిపోయారు, మమతలు దూరమయ్యాయి అనడం ఒట్టి అపద్దం. మనుషుల మధ్య బం దువుల మధ్య బంధాలు, అనుభందాలు లేని ఈ కాలంలో ఒక పెద్దాయన దేనిపైన బంధం పెంచుకున్నారో చెబితే మీరే ఆశ్చర్య పోతారు. ఇంకా అలాం టి వ్యక్తులు ఉన్నారా అని ఆలోచిస్తూ మీ ఊర్లో కూడా అలానే బ్రతికే మరొ కరిని కచ్చితంగా తలుచుకుంటారు.
ఇవన్నీ నేను వేదంతంగా చెప్పలేదు. నేరుగా చూసినది, చెవులారా విన్నది మాత్రమే చెబుతున్నా. నా పేరు సూర్యనారాయణ శర్మ. మాది వేదాంతం అగ్ర హారం. నేను ఈ ఊరికి పురోహితున్ని మాత్రమే కాదు హితాన్ని కూడా కోరే వాణ్ణి.
మా ఊళ్ళో ఉన్నది ఒకే ఒక శివాలయం. అది చాలా పురాతనమైనది. పూజ లు పునస్కారాలు చేసే వారి మొదలు రెండు చేతులెత్తి ఒక్క నమస్కారంతో దైవానుగ్రహం పొందాలి అనుకునేవారు అందరూ అక్కడికి వస్తుంటారు.
అందరినీ శివయ్య ఒకేలా చూస్తుంటాడు.
ఒకప్పుడు వేద పాఠశాల నడిపిన శ్రీ శ్రీ రామనాథ శాస్త్రి గారు గుడికొచ్చి ఎక్కువ సేపు అక్కడే గడిపే వారిలో ఆయన ప్రథముడు. సరదాగా అందరితో కబుర్లు చెప్పి కాలక్షేపం చేసే మనిషి కాదు ఆయన.
ఆయనకు ఇద్దరు కొడుకులు ఒకరు అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్, మరొకరు పొరుగు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగి ఇద్దరికీ తలొక పై పంచ వేసేశాడు. ఇద్దరు ఎవరి కాళ్లపై వాళ్ళు నిలబడ్డా రు. ఈయన వేదపాఠశాల నడిపి అందులో వచ్చిన డబ్బుతో కాదు పిల్లలను చదివించింది. ఈయన దగ్గర నేర్చుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ రాష్ట్రంలో వేరు వేరు ప్రాంతాలలో పేదరికంలో ఉన్న వారే.
చదవాలన్న ఆకాంక్ష,ఆతృత ఉన్నవాళ్ళందరినీ ఆయన చేర్చుకొని ఉచితంగా భోజనం, వసతి కల్పించి మరీ అక్కడే విద్య నేర్పించేవాడు. కొడుకులు కూడా ఒక్క నయాపైసా తండ్రి దగ్గర ఖర్చు పెట్టించ కుండా గవర్నమెంటు పాఠశాలలో చదివిన వారే.
“ఇంతమంది పిల్లలకు వేదం నేర్పుతున్నాను. మీలో కనీసం ఒక్కడైనా నేర్చుకోండిరా " అని ఆయన ఏనాడూ వాళ్ళను అడగలేదు.
వాళ్లకు నేర్చుకోవాలన్న శ్రద్ధ ఉంటే వాళ్ళే వస్తారని ఆయన నమ్మకం. ఆయన భార్య అన్నపూర్ణ . నిజంగానే పేరుకే కాదు సాక్షాత్తు అన్నపూర్ణే. ఆకలితో ఎవరినీ, అరకడుపుతో మరెవరినీ ఉంచదు. అమ్మా నాన్నలు లేని లోటు ఆ పాఠశాలలో విద్యార్థులకు ఏమాత్రం తెలియకుండా చేసేది.
Denne historien er fra November 24, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 24, 2024-utgaven av Suryaa Sunday.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.
'మెకానిక్ రాకీ'.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.
కళల కాణాచి మన తెలంగాణ
తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.
ఈవారం కథ
ఇలాంటి వారు ఉంటారా?
సూర్య బుడత
బాలల కథ
వేమన పద్యాలు
వేమన పద్యాలు
సూర్య
సూర్య
సూర్య బుడత
బాలల కథ
ఫన్ చ్
ఫన్ చ్
లెజెండ్
గీతాంజలి