CATEGORIES
Kategorier
ఓట్ల కోసం భాజపా తప్పుడు ప్రచారం
మండిపడ్డ మంత్రి హరీశ్ రావు
ఈ ఏడాది మధ్యప్రదేశ్ లో 26 పులులు మృతి
దేశంలో పులుల రాష్ట్రంగా పేరొందిన మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది ఇప్పటి వరకు 26 పులులు మరణించినట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వెల్లడించింది.
అత్యవసర వినియోగ అనుమతి దరఖాస్తుకు మోడెర్నా
కరోనా వ్యాక్సిన్ అభివృద్ధిలో ముందున్న మోడెర్నా, తాము రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం సిద్ధమైంది. ఇప్పటికే తాము రూపొందించిన వ్యాక్సిన్ సమర్థంగా పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
ముంబై పేలుళ్ల దోషి విజ్ఞప్తిని తిరస్కరించిన సుప్రీంకోర్టు
నేరం జరిగిన సమయంలో తాను మైనర్ నని, తనపై కనికరం చూపాలని 1993 ముంబై పేలుళ్ళ కేసులో దోషి చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందు మల్తోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముహమ్మద్ మొయిన్ ఫరీదుల్లా చేసిన దరఖాస్తును తిరస్కరించింది.
ఒక్క కరోనా వైరస్ కణమున్నా గుర్తించొచ్చు..
సైంటిస్టుల కొత్త ప్రయోగం!
ఇన్సూరెన్స్ పైసలు ఇప్పిస్తవా..!?
పార్టీ అధ్యక్షుడివా.. ఇన్సురెన్స్ ఏజెంటువా ? బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్
స్వచ్చత మనకు అందని మానిపండు..
'స్వచ్ఛ'భారతంలో స్వచ్ఛత ఒక దేవతావస్త్రం. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తినే తిండి-ఎందులో చూసినా స్వచ్ఛత మనకు అందని మానిపండు. ప్రపంచ జల నాణ్యత సూచిలో మన దేశం అట్టడుగు నుంచి మూడోస్థానంలో ఉంది.
ముందస్తు విడుదల విఫలమవడంతో శశికళలో ఆధ్యాత్మికత
జైలు జీవితం నుంచి ముందుగానే విముక్తి పొందాలని శశికళ చేస్తున్న ప్రయత్నాలు మళ్లీ బెడిసికొట్టాయి. ససేమిరా అని కర్ణాటక జైళ్లశాఖ చెప్పేసింది. దీంతో మనుషులను నమ్మి ప్రయోజనం లేదు.. దేవుడే దిక్కు అని శశికళ భావించారో ఏమో ఆధ్యాత్మిక జీవనంలో మునిగిపోయారు.
ఫ్లిప్ కార్ట్ బ్లాక్ ఫ్రైడే సేల్.. మొబైల్ ఫోన్లపై బ్రహ్మాండమైన ఆఫర్లు!
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో నేడు ప్రారంభమైన బ్లాక్ ఫ్రైడే సేల్ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. సేల్ లో భాగంగా షియోమి, రియల్), శాంసంగ్, యాపిల్ సహా ఇతర బ్రాండ్ల ఫోన్లపై ఫ్లిప్ కార్ట్ పలు ఆఫర్లు ప్రకటించింది. ఎస్ బిఐ క్రెడిట్ కార్డు హెల్డర్లకు ఈఎంఐ లావాదేవీలపై 5 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది.
సర్వశక్తులొడ్డుతున్న ప్రధాన పార్టీలు
జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రచార గడువు సమయం దగ్గర పడుతుండటంతో ఇప్పటిదాకా ఆరోపణలు, ప్రత్యారోపణలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లతో వాడివేడిగా సాగుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం మరోస్థాయికి చేరుకుంది.
ముంచిన 'నివర్'
నివర్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం ఎడతెరిపి లేకుండా జల్లులు పడ్డాయి. ఈ క్రమంలోనే చలిగాలులు కూడా వీస్తుండటంతో ప్రజలు అల్లాడుతున్నారు.
భారత్ బయోటెక్ నుంచే టీకా..
దేశీయ కరోనా వ్యాక్సిన్ల అభివృద్ధిని తెలుసుకున్న ప్రధాని మోదీ
ఫైజర్ వైస్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు
కరోనా వైరసీని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తీవ్రంగా కృషి చేస్తోన్న సంగతి తెలిసిందే.
తొలి వన్డేలో భారత్ ఓటమి
ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్ లో విరాట్ కోహ్లి సారథ్యంలోని భారత్ కు ఆరంభంలోనే ఝలక్ తగిలింది. శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఆసీస్ 10తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం సిడ్నీ మైదానంలో జరుగుతుంది.
భారీ బీభత్సం సృష్టించిన 'నివర్'
తమిళనాడులో తీరం దాటిన నివర్ తుపాను ప్రభావం ఏపీపై భారీగా పడింది. తుపాను కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నేడు సీఎం సభ
భవిష్యత్ ప్రగతి మ్యాప్ వివరించనున్న కేసీఆర్
అడ్డంకులను అధిగమించి ఢిల్లీలోకి రైతులు
డిసెంబర్ 3న చర్చలకు పిలవాలని డిమాండ్
అరాచక శక్తుల్ని అడుగుపెట్టనీయొద్దు
హైదరాబాద్ శాంతినగరం: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ఆ'జెనెకా వ్యాక్సిన్: పొరపాటుతో ఖుషీ!
కరోనా వైరస్ కట్టికి బ్రిటిష్, స్వీడిష్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రోజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పేర్కొంది.
లగ్జరీ మాలతో కరోనాతో యుద్ధం
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్ మాస్క్ ధరించడం అనివార్యంగా మారిపోయింది.
28న హైదరాబాదు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖ రారైనట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.ఈనెల 28న దిల్లీ నుంచి నేరుగా హకీంపేట విమానాశ్రయానికి ప్రధాని చేరుకోనున్నారు.శామీర్‌పేట సమీపంలోని భారత్ బయోటెక్ ను మోదీ సందర్శించనున్నారు.
డిసెంబర్ 31 వరకు అన్ని అంతర్జాతీయ విమానాలు రద్దు
దేశంలో కరోనా మరోసారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
'ఆ భయంతోనె మెలానియా ఆలస్యం చేస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధాన్ని వీడిన తర్వాతే ఆయన సతీమణి మెలానియా విడాకుల విషయం గురించి ఆలోచిస్తారని ట్రంప్ నకు రాజకీయ సహాయకురాలుగా పనిచేసిన ఒమరోసా మానిగాల్ట్ న్యూమన్ పేర్కొన్నారు.
వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు
హైదరాబాద్ ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టేను డిసెంబర్ 3వ తేదీ వరకు హైకోర్టు పొడిగించింది.
మతతత్వ శక్తుల ఆటలు సాగవు
అరాచక శక్తులను అణిచివేస్తాం
భారత్ పై చైనా మండిపాటు
చైనా యా పై భారత దేశం కఠినంగా వ్యవహరిస్తుండటంతో డ్రాగన్ దేశం తీవ్ర అసహనానికి గురవుతోంది. భారత్ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది.
నా ఫోటో భాజపా వాడుతోంది..
అసద్ హర్షం..
డిసెంబర్ 1 నుంచి కొత్త కోవిడ్ మార్గదర్శకాలు
కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్ ఒకటి నుంచి కొత్త మార్గదర్శకాలు అమలులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన కేంద్రం కొన్ని మార్గదర్శకాలను వెల్లడించింది.
బిల్ గేట్సను బీట్ చేసిన మస్క్. ఈ ఏడాది ఎంత సంపాదించాడంటే?
ప్రపంచ కుబేరుల జాబితాలో అమెరికన్ బిజినెస్ మేన్ ఎలన్ మస్క్ మరో అడుగు ముందుకేశాడు.
రోజూ కలబంద గుజ్జు తింటే..?
కలబందను సంస్కృతంలో కుమారి అని పిలుస్తారు. ఎందుకంటే కలబంద చర్మాన్ని సంరక్షించి ఎల్లప్పుడూ యవ్వనంగా ఉండేలా చేస్తుంది. అందుకే దీన్ని కుమారి అంటారు. ఇక ఇందులో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి మనకు కలిగే అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ఈ క్రమంలోనే రోజూ కొద్దిగా కలబంద గుజ్జును తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.