'ప్రియా! నీ చిరునవ్వు వెలకట్టలేని ఆణిముత్యం. నీ చెంత నుంటే వెన్నెల రాత్రివేళల్లో పిల్లగాలుల తెమ్మ హాయి లో నన్ను నేను మరచిపోయా ను. నీ ఒడిలో సేద తీరేందుకు తపించే నా మనసు కోరికను ఎంతని అణిచివేసుకోను! నిదుర లేని రాత్రుల్లో బరువెక్కే గుండె ఊపిరి పీల్చుకోవడం కూడా చేతకాని నిస్సహాయ స్థితిలో సైతం నీ తలంపులే నా హృద యంలో మల్లెల సువాసనలు జీవవాయువులా పనిచేసింది.నీ అడుగు జాడల్లో పయనిస్తూ నన్ను నేను మరిచిపోయాను.ఎంతగా అంటే.. నాచుట్టూ ప్రపంచాన్ని, నా కుటుంబ అను బంధాలను, బంధు, మిత్రులను సైతం విస్మరించాను. నీ ప్రేమ అంతా నాదేనని, నువ్వే నా వాడివని నమ్మి, నన్ను కన్న అమ్మా నాన్నల్ని వదిలేసి నీ చెంతకు చేరాను. నీతో సహజీవనం చేశాను. ఆ జీవిత మధురిమల్ని కడదాక సాగిద్దా మని ఎన్నో కలలు కన్నాను.. కానీ ఎక్కడో ఏదో తెలియని
ఆందోళన వ్యధ, బాధ, అనుమానం అన్నీ నన్ను వెంటా డాయి. చివరికి అవే నిజమయ్యాయి. నీ నిజస్వరూపం తెలిశాక, నీ ప్రేమ నిజం కాదని, నువ్వొక ఉన్మాదపు వ్యక్తి వని గ్రహించిన క్షణంలో.. ఇక నీతో నా జీవితం వద్దనుకున్న వేళ, నీ చేతిలో ముక్కలైపోయాను. నా ఊపిరిని బిగపట్టి, ఊపిరాడకుండా హతమార్చావు. అంతటితో ఆగక, నా శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేశావు. స్రవించే నాప్రతి రక్తపుబొట్టులో నీ ప్రతిబింబాన్నే నేను చూసుకున్నాను. ప్రేమ పేరుతో మోసపోయానని, ఓడిపోయానని గ్రహించేలోగా నా దేహపు భాగాలు నడివీధుల్లో నాట్యమాడాయి. నానుంచి నా అవయవాలను దూరం చేశావు కానీ నా గుండెగది లో గూడుకట్టుకున్న ప్రేమ ఇంకా పదిలంగానే మిగిలిపోయింది.శ్రద్ధావాకర్లా మరెవరిన్నీ ఇలా మోసగించకు, హత మార్చకు, ప్రేమ పేరుతో వంచనకు గురిచేయకని తడి ఆరని రక్తపు వేదనతో నిన్ను వేడుకుంటున్నాను...ప్రేమ.. ప్రేమ.. ఒకప్పుడు అదొక స్వచ్ఛమైనది, నిర్మలమైనది, మసకబారనిది. కడవరకు కలసి జీవించేందుకు చేసుకునే మధురమైన ఓ ఒప్పందం. కానీ నేటి ప్రేమలు అవసరం తీరాక 'బ్రేకప్' పేరుతో కొత్తజీవితం.. కాదూకూడదని బెదిరిస్తే హతమార్చడం.. ఇంకా కసీ తీరకపోతే ముక్కలు చేసి, తమ ఉన్మాదాన్నిచాటుకుంటున్న ప్రేమలే అధికంగా కనిపిస్తున్నాయి.సహజీవనం చేశాక పెళ్లి చేసుకోమని కోరితే చిర్రెత్తుకోపా లొస్తాయి. ప్రేమను, సుఖాన్ని పంచిపెట్టిన పాపానికి ప్రేయసిని చితికి, పెళ్లాన్ని ఇంటికి చేర్చుకుంటున్న ఘనపాటి యుళ్లు న్నారు.
Denne historien er fra August 27, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 27, 2023-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు