రోజులాగే ఆరోజు కూడా పొద్దున్నే పొలం చుట్టొచ్చిన పరంధామయ్య కాలకృత్యాలు ముగించుకొని, పూజ గదిలోకి వెళ్లాడు. అప్పటికే పూజకవసరమైన సామగ్రిని సిద్ధంగా వుంచింది ఆయన భార్య దమయంతి. ఓ అరగంటకుగానీ ఆయన పూజ గదిలోంచి బయటకు రాడు. ఆ తర్వాతగానీ ఆహారం తీసుకోడు. అది అతని దినచర్య.
రాఘవాపురంలో గ్రామ పెద్దగా పది మందిలో మంచి పేరుంది.పరంధామయ్యకు. దైవభక్తి, దాన గుణం ఆయన ప్రత్యేకతలు. తనకున్న దానిలో నలుగురికి అంతో యింతో సాయం చేసేవాడు. చుట్టుపక్కల గ్రామాలలో కూడా పరంధామయ్య గురించి తెలుసుకున్నవారు ఎప్పుడైనా కష్టాల్లో వుంటే వచ్చి ఆయన దగ్గర సాయం పొందేవారు.ముఖ్యంగా ఆయన అనాథాశ్రమాలకు అంటే వెనకా ముందూ చూడకుండానే విరాళాలు యిచ్చేవాడు. దానికి కారణం లేకపోలేదు. పెద్దలు సంపాదించి - యిచ్చిన ఆస్తిని తన కష్టంతో మరింత పెంచాడు. ఆస్తి అయితే పెరిగింది కానీ దానిని తినటానికి వారసులు పుట్టలేదు.పిల్లల కోసం ఎంతో తాపత్రయపడ్డారు.గుడులు, గుట్టలు తిరిగారు. ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో విసుగొచ్చి మానుకున్నాడు. మరో పెళ్లి చేసుకోమని బంధుమిత్రులు చెప్పారు. దమయంతి కూడా రెండో పెళ్లికి అడ్డు చెప్పలేదు.అయినా పరంధామయ్య ఏమాత్రం తలొగ్గలేదు.
"పోనీ... పెంచుకోడానికి ఓ బిడ్డను తెచ్చుకుందామండీ!" దమయంతి ఉండబట్టలేక అడిగిందో రోజు.
"లేదు దమయంతీ.. యెవరో ఒకరిని పెంచుకుంటే ఆ బిడ్డ కోసం వుంచాలనే స్వార్థంతో సంపాదనను ఇతర అనాథ పిల్లలకు దానం చేయలేం. ఒక అనాథని పెంచి పెద్ద చేయడం కన్నా పది మందికి సాయపడటం బాగుంటుందనేది నా ఉద్దేశం" చెప్పాడు పరంధామయ్య.
భర్త నిర్ణయాన్ని కాదనలేక "అలాగేనండీ... మీ యిష్టం" అంది.
అప్పటి నుండి ఏ అనాథాశ్రమంవారు.వచ్చి విరాళం అంటే కాదనడు.తోచినంత యిచ్చి పంపటం పరిపాటి అయిపోయింది. అనాథ బాలలు అన్నఅతని సెంటిమెంట్ తెలిసినవారు అప్పుడప్పుడూ వచ్చి అంతో యింతో విరాళాలు పట్టుకుపోయేవారు.
"ఏవండీ!" బయట పిలుపు విని వంటగదిలో పనిలో వున్న దమయంతి వచ్చి తలుపు తెరిచింది.
బయట ఒక కాషాయాంబరధారి, ఆ వెనుక నలుగురు వ్యక్తులు వున్నారు. పొద్దున్నే ఎవరో చందాకొచ్చారనే విషయం అర్థం చేసుకున్న ఆమె “వారు పూజలో వున్నారు" అంది.
“పర్లేదమ్మా.. వారు వచ్చేదాకా వుంటాం" వారిలో ఒకతను చెప్పాడు.
"అలాగే.." అని కొట్టం వైపు చూసి "రంగా.. యిలా వచ్చి ఆ హాల్లోని కుర్చీలు వరండాలో వెయ్" అంది.
Denne historien er fra March 10, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 10, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు