ఈ సృష్టి యావత్తు బ్రహ్మదేవుడు తన భూత సృష్టిని ప్రారంభించిన సృష్ట్యాది నుంచి లేక ఈ కలియుగం ప్రారంభం మొదలు నుండిగానీ పంచాంగాలలో లెక్కించటం వాడుకగా వస్తున్న ఆచారం. ఈ బ్రహ్మ సృష్టిలో ప్రళయం అయిపోయిన తరువాత తిరిగి ఆరంభించే అధ్యాయాన్ని బ్రహ్మకల్పం అని అంటూ ఈ ప్రారంభ కాలాన్ని 'కల్పాది' అని వ్యవహరిస్తారు. ప్రతీ కల్పంలోను మొదట వచ్చే 'ఆది' సమయమే 'ఉగాది' పండుగ. దీనిని గురించి 'సూర్య సిద్ధాంతం' అనే జ్యోతిష గ్రంథంలో స్పష్టంగా చెప్పబడింది. నాటి నుండి నేటి వరకు ఈ పద్ధతినే అనుసరిస్తూ ప్రతీ తెలుగు సంవత్సరం ఆరంభ దినంనాడు మనం ఉగాది పర్వదినం జరుపుకునే ఆచారం ఏర్పడింది. 'యుగాది' అన్న సంస్కృత పదం ఉచ్ఛారణ భేదం వలన 'ఉగాది' అనే తెలుగుమాట ఏర్పడింది.
చైత్రేమాసి జగత్ప్ర్బహ్మ ససర్జ ప్రథమే అహని ।
వత్సరాదౌ వసంతాదౌ రసరాద్యే తథైవచ ll
సృష్టి ప్రభవం అయిన మొదటి సంవత్సరం నుండి చరితార్థంగా 'ప్రభవ' అని నామకరణం చేసి అక్కడి నుంచి 'క్షయ' నామ సంవత్సరం క్రమంలో 60 నామాలతో సంవత్సర గమనం సాగుతుంది. క్షయ నామ సంవత్సరంతో సమాప్తమవుతుంది. కనుకనే మనం జన్మించిన మొదలు ఈ నామ చక్రం మనకు 60 సంవత్సరాల వయస్సుకు చేరినపుడు తిరిగి అదే సంవత్సరంతో పూర్తి అగుటచే షష్టిపూర్తి జరుపుకుంటాం.
వేదాలను హరించిన సోమకుడు అనే రాక్షసుని వధించి శ్రీ మహావిష్ణువు తిరిగి పునరుద్ధరించిన రోజు కూడా ఉగాది ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది.తెలుగు సంవత్సరం చైత్రం నుండి శిశిరం వరకు ఆరు ఋతువులుగా విభజించబడింది.సంవత్సరం పొడవునా అనేక ఒడుదుడుకులు అనుభవించిన ప్రకృతిలో చెట్లు శిశిర ఋతువులో ఆకులు రాల్చి జడత్వాన్ని పొందుతాయి.చైత్ర మాసంలో కొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతంగా కనిపిస్తాయి.
ఈ విధంగా ప్రకృతిలో సంభవించే నూతన వత్సరం చైత్ర మాసం. అందుకే ఈ మాసారంభానికి ఉగాది అని పేరు వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇది మనలో కూడా నూతన ఉత్తేజాన్ని కలిగించి నవనవోన్మేషంగా ముందుకు తీసుకుపోవటానికి దోహదం చేస్తుంది. ఉగాది పర్వదినాన అభ్యంగనం, పుణ్యకాల సంకల్పం, ఉగాది పచ్చడి సేవనం, ధర్మకుంభం, సృష్టి క్రమ వర్ణన, కల్పాది వైవస్వత మన్వంతర వివరాలతో కూడిన పంచాంగ శ్రవణం అన ముఖ్యమైన విధులను అనుసరించవలసి ఉంటుంది.
అభ్యంగనం
Denne historien er fra March 31, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 31, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఒక్క రూపాయికే భోజనం
క్రికెటర్గా, మాజీ ఎంపీగా సుపరిచితుడైన గౌతమ్ గంభీర్ కొన్నాళ్లక్రితం తన పేరుమీదే ఓ ఫౌండేషన్ను ద్వారా మూడేళ్లక్రితం 'ఏక్ ఆశా జన్ రసోయీ' పేరుతో మరో కార్యక్రమానికీ శ్రీకారం చుట్టాడు.
జమిలి జటిలమా!
భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.
'సంఘ్' భావం
ఉపాధి కల్పించలేని విద్యావ్యవస్థ
తగ్గుతున్న నిద్రాగంటలు
ఎంత బలవంతంగా కళ్లు 'మూసినా నిద్ర రావడం లేదా? నిద్రలో ఊపిరి ఆడడం ఇబ్బం దిగా ఉన్నదా?
బీపీ ఉందో లేదో తెలిపే యాప్
నాలుగు పదులు దాటితే బీపీ రావడం ఇప్పుడు మామూలైపోయింది.
తాజా వార్తలు
సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా..
షూటింగ్ పూర్తయిన అనుష్క రెండు చిత్రాలు!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి ప్రస్తుతం చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తోంది.
కొత్త సినిమా
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ కథానాయిక అను ఇమ్మానుయేల్ తెలుగు, తమిళంలో పలు సినిమాలు చేసింది.
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.