పేదరికం లక్ష్యసాధనకు అడ్డుకాదని నిరూపించాడు ఒక యువకుడు. సంకల్పబలంతో అత్యున్నత స్థితిని అందిపుచ్చుకున్నాడు. సానుకూల దృక్పధం జీవం పోసింది. గుణసంపద బాట వేసింది. ఆత్మగౌరవం వెన్నుతట్టింది. ఆత్మవిశ్వాసం నడిపించింది. సివిల్స్ ర్యాంకు స్వంతం అయ్యింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం, ఊళ్లపాల్యానికి చెందిన ఉదయకృష్ణారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆయన నాన్నమ్మ కూరగాయలు అమ్మి చదివించింది. ప్రభుత్వ పాఠశాల, కళాశాలల్లో, డిగ్రీవరకు చదివాడు. నాన్నమ్మను కష్టపెట్టడం ఇష్టంలేక పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగంలో చేరాడు. అయితే స్కిల్ ఇన్స్పెక్టర్ అవమానించడంతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు.2019 నుంచి సివిల్స్ సాధనపై దృష్టిపెట్టాడు.
నాలుగవ ప్రయత్నంలో 780వ ర్యాంకు సాధించి వార్తలకు ఎక్కాడు. తెలంగాణకు చెందిన దోనూరు అనన్య సివిల్స్ లో మొదటి ప్రయత్నంలోనే మూడవర్యాంకు సాధించింది. మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టిన ఆమె రోజుకు 12-14 గంటలు చదివి లక్ష్యాన్ని చేరుకున్నది. ఆంత్రోపాలజీకి మాత్రమే కోచింగ్ తీసుకున్నది. మిగిలిన అంశాలు స్వంతంగా చదివి ఆకలింపు చేసుకున్నది. సివిల్స్ అంటే అందని ద్రాక్షేమీ కాదని నిరూపించింది.మేధస్సులో మహిళలు తక్కువ కాదని లోకానికి చాటింది. అందరికి ఆదర్శంగా నిలిచింది.పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన కూనారపుసిరి ఇంటర్ సీఈసీలో 927 మార్కులు సాధించింది. సహజం. ఇందులో గొప్పేముంది అనుకుంటారు. అయితే ఆమె తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కొని మార్కులు సాధించడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆమె ఐదేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. గత ఎనిమిది నెలల క్రితం రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో వారానికి రెండుసార్లు డయాలసిస్ చేయించుకుంటోంది. చదువుపై ఆసక్తితో కష్టపడి చదివింది. కాలేజీకి వెళ్లకపోయినా స్మార్ట్ఫోన్లోనే చదువుతూ మంచిమార్కులు సాధించింది.
లక్ష్యం నడిపిస్తుంది
Denne historien er fra May 05, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 05, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
డబ్బు ఎంత పనైనా చేస్తుంది!
డబ్బు అనేది నాకు ఒక్కో ప్రాయంతో వేర్వేరు అర్థాలిచ్చింది.స్కూల్లో చదువుతున్నప్పుడు మధ్యాహ్నం అన్నం తినడానికి ఇంటికి వెళ్లడం వల్ల బామ్మ డబ్బుని చూపించేది కాదు.
తెలుగు మణిహారం
భారతదేశంలో దేశ భాషలలో పేర్లు, ఆయా రాష్ట్రం లేదా ప్రాంతాల పేర్లు చూస్తే ఒక్క తెలుగు మాత్రం భిన్నంగా వుంది.మహారాష్ట్ర, తమిళనాడు, కన్నడ, అస్సాం, పంజాబు, బెంగాల్ రాష్ట్రాలుమరాఠీ, తమిళం, కన్నడ, అస్సామీ, పంజాబీ, బెంగాలీ భాషల పేర్లు కలిగి వుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గురించి చెప్పేటప్పుడు తెలుగువార అంటున్నాం.
జంతువులను కాపాడుకుందాం
ఆధునిక కాలంలో మానవుడు ప్రకృతికి దూరం అవుతున్నాడు..యాంత్రికంగా జీవితాన్ని వెళ్లదీస్తున్న జీవులకు ఒక జీవితానుభవం కలుగుతుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
బాలగేయం
ఆమని రాక
తప్పిన అపాయం
వీరపు నాయని పల్లిని వీరసూరుడు పాలించేవాడు. అతని అస్థానంలో అనంతుడు, అతిథుడు అనే ఇద్దరు సైనికులు వుండేవారు.
సుందర హిల్ స్టేషన్ మున్నార్
దక్షిణ భారతదేశంలోని కేరళరాష్ట్రంలోని ఇడుక్కీ జిల్లాలో అత్యంత ప్రాచీనమైన వేసవి విడిది మున్నారు.
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
ఆచార్య ఫణీంద్ర సాహితీ ఉషోదయం
చక్కటి కథాకావ్యం 'ప్రాంజలి'
జె. వి. పబ్లికేషన్స్ ద్వారా ఈ పుస్తకం ముద్రించారు. దువ్వూరు సత్యనారాయణ, రావు, దీప్తి పెండ్యాల, చక్కటి విలువైన ముందుమాటలు రాసారు.
వేదకాల సమాజంపై లోతైన చూపు
నాలుగు వేదాలలో మొదటి వేదం అధర్వణవేదం. సామవేదం బుగ్వేదానికి సంగీత రూపమే. కనుక వేదాలు మూడే (8).