అవధుల్లేని అమ్మ ప్రేమ
Vaartha-Sunday Magazine|May 12, 2024
తల్లిగా స్త్రీ గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజంలో స్త్రీ వివిధ సందర్భాల్లో ఆమె నిర్వర్తించే బాధ్యతలే ఆమెను ఉన్నత శిఖరాన నిలబెట్టాయి.
డా॥ ఓరుగంటి సరస్వతి
అవధుల్లేని అమ్మ ప్రేమ

'దేవుడు అన్నిచోట్ల ఉండలేడు. కాబట్టే అమ్మను సృష్టించాడు' తల్లిని మించిన శ్రామికులు ఎవరున్నారు? మిగిలిన శ్రామికులంతా వేతన జీవులేకదా! ఇలా చెప్పుకుంటూ పోతే తల్లిగా స్త్రీ గొప్పతనాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే. సమాజంలో స్త్రీ వివిధ సందర్భాల్లో ఆమె నిర్వర్తించే బాధ్యతలే ఆమెను ఉన్నత శిఖరాన నిలబెట్టాయి. కన్నీటిని దాచుకుంటూ చిరునవ్వులు చిందిస్తుంది.పిల్లలను ఆమె (తల్లి) సరిగ్గా తీర్చిదిద్దకపోతే సమాజం దారితప్పిపోతుంది. అంత గొప్ప బాధ్యతల్ని కూడా తన భుజస్కంధాలపై అవలీలగా మోయగలుగుతున్న ఆ అద్భుత శక్తి ఎవరో కాదు అమ్మ. ఆ అమ్మే మనల్ని అవనిపై తీసుకువచ్చిన దేవత.. దాశరథిగారు అన్నట్లు.. 'అమ్మ అన్నది ఒక కమ్మని మాట.అది ఎన్నెన్నో తెలియని మమతల మూట.

దేవుడు లేడనే మనిషున్నాడు. అమ్మేలేదనువాడు అసలేలేదు.అమ్మంటే అంతులేని సొమ్మురా. అది ఎన్నటికీ తరగని భాగ్యమ్మురా'. అమ్మ ఒడే మొదట బడి. పిల్లలు తల్లి నుండే * కమ్మని మాటలు నేర్చుకుంటారు. అమ్మ నేర్పే మాటల్లో మంచి నడత, నడవడిక మాత్రమే ఉంటుంది. కాబట్టి అమ్మ అంటేనే కమ్మని మాట. అమృతం వంటి మనసు అమ్మకు మాత్రమే ఉంటుంది. అమ్మ ఉంటే అన్ని ఉన్నట్లే. అంటే ఈ ప్రపంచం లోనే తల్లి ఎంత గొప్పదో మాటల్లో చెప్పలేం. అందుకే 'తల్లిని మించిన దైవం లేదు' అంటుంటారు. ఆడపిల్లగా ఉన్నప్పటి నుండే తన భవిష్యత్తుని గురించి కలలు కంటూ తన బాధ్యతల్ని ఎరిగి మసలుకుంటుంది. తన అమ్మ, అమ్మమ్మ, నానమ్మ, మేనత్త తల్లులుగా ఎలా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో గమనిస్తూ పెరుగుతుంది. ఎందుకంటే తను కూడా అలాంటి బాధ్యతల్ని నిర్వర్తించాలి కదా!

ఏ యుగంలోనైనా, ఏకాలంలోనైనా ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఎక్కడైనా మాతృమూర్తులుగా తల్లుల అవిశ్రాంత బాధ్యతలు వర్ణింపలేనివి. స్త్రీ తన గర్భంలో బిడ్డను మోస్తున్నప్పుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నప్పటికీ కొత్త ప్రాణాన్ని భూమిపైకి తీసుకువచ్చే క్రమంలో అమ్మ పోరాటం అంతా ఇంతా కాదు. తన ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా మనల్ని భూమిపైకి తీసుకువచ్చిన త్యాగమూర్తి అమ్మ. తన రక్తాన్ని పాలుగా మార్చి, మనల్ని బ్రతికిస్తుంది.'ఆస్తాం తావడియం ప్రసూతి సమమే దుర్వార శూల వ్యధా నైరుచ్యం తనుశోషణం మలమపి శయ్యాచ సాంవత్సరీ ఏకస్యాపి గర్భధార భరణ క్లేశస్య యస్స్యాక్షమో ధాతుం నిష్కృతి మున్నతోపి తనయ: తస్యై జనన్యై నమ: 

(ఆదిశంకరాచార్య మాతృపంచక శ్లోకాలు)

Denne historien er fra May 12, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra May 12, 2024-utgaven av Vaartha-Sunday Magazine.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA VAARTHA-SUNDAY MAGAZINESe alt
కోటలకు కోట కొండవీటి కోట
Vaartha-Sunday Magazine

కోటలకు కోట కొండవీటి కోట

ఆం ధ్రజాతి ఖ్యాతిని భారతదేశ నలుచెరుగులా వ్యాపింపచేసి చరిత్రలో శాశ్వత స్థానాన్ని పొందిన పాలకులలో కాకతీయ ప్రతాపరుద్రుడు ఒకరు.

time-read
3 mins  |
September 15, 2024
చమత్కార శ్లోకాలు
Vaartha-Sunday Magazine

చమత్కార శ్లోకాలు

మనం మన మాతృభాషనే సరిగ్గా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నాం.

time-read
3 mins  |
September 15, 2024
సాధన చేస్తే గణితం సులభమే!
Vaartha-Sunday Magazine

సాధన చేస్తే గణితం సులభమే!

కొంతమంది విద్యార్థులకు ఉత్సాహాన్ని కలిగిస్తే, మరి సాధన కొంతమందికి భయాన్ని (ఫోబియా) కలిగిస్తుంది. ఫోబియా అనేది వాస్తవికమైనది కాదు.

time-read
3 mins  |
September 15, 2024
బాలగేయం
Vaartha-Sunday Magazine

బాలగేయం

విజయం

time-read
1 min  |
September 15, 2024
హలో ఫ్రెండ్...
Vaartha-Sunday Magazine

హలో ఫ్రెండ్...

చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు

time-read
1 min  |
September 15, 2024
మట్టి విగ్రహం
Vaartha-Sunday Magazine

మట్టి విగ్రహం

రంగాపురం ఒక కుగ్రామం. మరో పదిహేను రోజుల్లో వినాయక చవితి పండుగ రాబోతున్నదన్న సంబరంలో, పిల్లలంతా కేరింతలు కొడుతూ, చందాల వసూళ్లకు తిరుగుతున్నారు.

time-read
1 min  |
September 15, 2024
సూర్యాస్తమయం లేని దేశాలు
Vaartha-Sunday Magazine

సూర్యాస్తమయం లేని దేశాలు

ప్రతిరోజు మనం సూర్యోదయాన్ని చూస్తూనే ఉంటాం. ప్రకృతిలో దాగి ఉన్న వింతలను తెలుసుకోడాన్ని నిత్యం శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉంటారు.

time-read
4 mins  |
September 15, 2024
బ్రతుకు పుస్తకంలో అనుభవ భావాలు
Vaartha-Sunday Magazine

బ్రతుకు పుస్తకంలో అనుభవ భావాలు

ఆయుధం ఏం చేస్తుంది? ధరించిన వాడిని రక్షిస్తుంది. ఎదుటివాడిని శిక్షిస్తుంది. జీవనాధారానికి, స్వరక్షణకు వాక్కయినా, అస్త్రశస్త్రాలయినా ఆయుధాలే!

time-read
1 min  |
September 15, 2024
అలరిస్తున్న పద్యేంద్ర ధనస్సు
Vaartha-Sunday Magazine

అలరిస్తున్న పద్యేంద్ర ధనస్సు

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 15, 2024
అద్భుతకళా 'రంగ్ మహల్'
Vaartha-Sunday Magazine

అద్భుతకళా 'రంగ్ మహల్'

పుస్తక సమీక్ష

time-read
1 min  |
September 15, 2024