మానవ జీవితం ఓ అద్భుతవరం జీవనయానంలో అనుకున్నవి, అనుకోనివి జరుగుతూనే ఉంటాయి. నవ్విన క్షణాలు, బాధపడిన ఘడియలు మనంద రికీ నిత్యఅనుభవమే. జీవన గమనానికి ఓ ప్రణాళిక వేసుకుంటాం. పథకం ప్రకారం జరిగితే పరమానందపడతాం, ఊహించని అవాంఛనీయమైన ఘటనలు జరిగినపుడు చింతించడం సాధారణం అయ్యింది. జీవితం ఓ రోడ్డు ప్రయాణం. రోడ్డంటే అద్దంలా ఉండడమే కాదు, మార్గాన స్పీడ్ బ్రేకులు, గుంతలు, భయంకర మలుపులు, ప్రమాదభయాలు ఉంటాయి. మరణం అనివార్యమని తెలిసినా అతిగా దుఃఖించడం హాస్యస్పదం. జననంతోనే మరణం కూడా నిశ్చయించబడిందని మరువరాదు. ఇలాంటి సుఖదుఃఖాలు, కష్టనష్టాల జీవితాన్ని చిరునవ్వుతో ఎదుర్కొని, అనుక్షణం ఆస్వాదించగలగడం ఓ అద్వితీయ కళ. చింతలు చిదిమేసి సంతోషంగా జీవించడానికి అనేక అంశాలు, మార్గాలు దోహదపడతాయి.
> ఆశావహ దృక్పథం సదా ఆరోగ్యదాయకం. దురాలోచనలు, దురుద్దేశాలు అనారోగ్యదాయకం. పక్కా ప్రణాళిక విజయాన్ని దగ్గరకు చేర్చుతుంది. అనవసరం ఆందోళనకూ ఆస్కారం ఇవ్వొద్దు.
> సమస్యలు లేని జీవితం లేదు. సమస్యకు సమాధానం వెదకడం, సఫలత కోసం సర్వశక్తులు దారపోయడం అలవాటు చేసుకోవాలి. ఫలితాన్ని అతిగా ఊహించుకొని మానసిక ఒత్తిడికి గురికాకూడదు. సత్ఫలితం రానపుడు అంగీకరించడం, తదుపరి నవ్వ అడుగులను అన్వేషించడం ఉత్తమం.
> సంపూర్ణ విషయపరిజ్ఞానం లేకుండా కార్యానికి పూనుకోరాదు. కార్యసాధనకు సమాచార సేకరణ, లోతైన విశ్లేషణ, బహుముఖీన కోణంలో ఆలోచనలు చేయాలి. కొద్ది అవగాహనతో ప్రారంభిస్తే అపజయానికే అవకాశాలు ఎక్కువ. కీడెంచి మేలెంచుదాం.
>సమస్య ఏమిటి? సమస్యకు కారణాలేమి? సమస్య పరిష్కారానికి మార్గాలు ఏమిటి? వీటిలో ఉత్తమ మార్గాన్ని ఎన్నుకోవడంలో సఫలమైతే గెలుపు పునాదులు సిద్ధించినట్లే.
> బిజీగా ఉందాం. ప్రతి క్షణం పనిలో నిమగ్నం అవుదాం. అనవసర ఆలోచనలకు సమయం ఇవ్వవద్దు. అనవసర చింతతో నిరాశ ఆవరించి ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది.
> భౌగోళిక కాలమానంలో మన జీవితకాలం చాలా చిన్నది. నిన్నటి ఓటమి నేటి కార్యదక్షతను రెట్టింపు చేయాలి. ఒకే సమస్యను అనేకసార్లు తలిచి వగచి రోజులు, వారాలు, నెలలు, ఏండ్లు ఏడరాదు.
Denne historien er fra May 26, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 26, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు