"దైవంత తలచరో..."! వీధుల వీధుల విభుడేగే నిధే
మోదముతోడుత మ్రొక్కరో జనులు
గరుడధ్వజ కనకరథంబదె
అరదముపై హరి యలవాడే
రుదెసల నున్నాడు యిందిరయు భువియు
పరగ జగ్గములు పట్టరో జనులు
ఆడే రదివో యచ్చరలెల్లను
పాడేరు గంధర్వపతులెల్లా
వేడుకతో వీడే విష్వక్సేనుడు
కూడి యిందురును జాడరో జనులు
శ్రీవేంకటపతి శిఖరముచాయ
భావింప బహువైభవములవే
గోవిందనామపుఘోషణ విడుచును
దైవంబితడని తలచరో జనులు
కలియుగ వైకుంఠవాసుడు.... బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవ వైభవాన్ని పదకవితాపితామహుడు అన్నమయ్య తన కీర్తనల్లో కీర్తించిన తీరు అద్భుతం.. పరమాద్భుతం. అదిగో వీధివీధినా సంచరిస్తున్న విభుడు శ్రీవేంకటేశ్వరుడు. ఓ భక్తజనులారా ముదమారా చేతులెత్తి మొక్కండి. అదిగో గరుడధ్వజంతో ఉన్న బంగారు తేరు. ఆ రథంలో విరాజిల్లుతున్న శ్రీవారి తేజోవైభవం చూడటానికి వేయికళ్ళయినా చాలదు. ఆయనకు ఇరువైపులా శ్రీదేవిభూదేవేరులు. భక్తులారా దివ్యమైన ఆ రథం పగ్గాలను పట్టుకుని లాగండి. ఆ రథం ముందు భాగంలో అప్సరసలు ఆడుతుండగా గంధర్వులు పాడుతున్నారు. వీళ్ళందరితో విశ్వక్సేనుడు వేడుకతో నడుస్తున్నారు. అదిగో మెరుపులతో ప్రకాశిస్తున్న వేంకటాచల శిఖరాలు. ఆ వేంకటపతి వైభవాలను తలుస్తూ గోవిందనామ ఘోషలు చేస్తూ అద్భుతమైన దేవుడని భావించి కొలవండి జనులారా! అని భావం.
ఆనందదాయకం తిరుమలేశుని బ్రహ్మోత్సవం! “నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు సత్యాత్ముడైయుండి సత్యమై తానుండి ప్రత్యక్షమైయుండి బ్రహ్మమైయుండు-సంస్తుత్యుడీ తిరువేంకటాద్రి విభుడు"
ఇలా అనంతమహిమాన్వితమై కలియుగ వైకుంఠం తిరుమల కొండల్లో స్వయంభువుగా అర్చనామూర్తిగా కొలువైన శ్రీమన్నారాయణుడే శ్రీవేంకటేశ్వరస్వామి.శ్రీవైకుంఠాన్ని వదలిపెట్టి అత్యంత భక్తవాత్సల్యంతో భువికి దిగివచ్చి పుణ్యక్షేత్రం వేంకటాచల శిఖరాలపై వక్షఃస్థల మహాలక్ష్మితో ఆవిర్భవించిన ఇలవేలుపుగా భక్తులను కటాక్షిస్తున్నాడు. అఖిలాండకోటి హ్మాండనాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని కేవలం మానవులు మాత్రమేకాదు.
Denne historien er fra September 29, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra September 29, 2024-utgaven av Vaartha-Sunday Magazine.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ఫోటో ఫీచర్
ఫోటో ఫీచర్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
ఈ వారం కా'ర్ట్యూ'న్స్
మహాక్షేత్రం 'కుబతూర్'
ఆలయాల పూర్తి సమాచారం, క్షేత్రం ప్రాధాన్యం, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ, శిలాశాసనాలను పరిశీలన చేయాలి.
ఇంటి నిర్మాణ విషయంలో..
వాస్తువార్త
నాయకుడి అర్హతలు
నాయకుడి అర్హతలు
తెలుగు భాషా వికాసం
అమ్మ ప్రేమలా స్వచ్చమైనది చిన్నారుల నవ్వులా అచ్చమైనది అమృతం కంటే తీయనైనది. అందమైన మన తెలుగు భాష
యూ ట్యూబ్ సభ్యత్వం
యూ ట్యూబ్ సభ్యత్వం
నవ్వుల్...రువ్వుల్...
దివాలా లంచ్ హోం
పసిడి ప్రాధాన్యత
భారతదేశంలో బంగారం ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు