నదులు దేశానికి జీవనాడుల్లాంటివి. భారతదేశం నదుల్ని కేవలం భౌతిక లేక ప్రాకృతిక విషయాలుగా మాత్రమే కాక దేవతలుగా, సౌభాగ్యదాయినులైన దేవీరూపాల్లో సదా కొలుస్తూ వచ్చింది. భారతదేశపు నదులన్నిటిలోనూ గంగలా ప్రజల మనస్సులను, హృదయాలను ఆకట్టుకున్న నది మరేదీ లేదనే చెప్పవచ్చు. గంగాజలాన్ని ఏదో ఒక రూపంలో ఉపయోగించకుండా ఏ ధార్మిక కర్మగానీ, పారమార్థిక క్రియగానీ పూర్తవదు.
శాస్త్రాల్లో గంగ ప్రస్తావన ఋగ్వేదంలో, శతపథ బ్రాహ్మణంలో, ఐతరేయ బ్రాహ్మణంలో గంగా నదికి సంబంధించిన ప్రస్తావనలున్నాయి. రామాయణంలోను, మహాభారతంలోను (అనుశాసన పర్వం), అలాగే పద్మపురాణం, నారదీయపురాణం, అగ్నిపురాణం, మత్స్యపురాణం తదితర అనేక పురాణాల్లో కూడా ఈ నదీమతల్లి ప్రాశస్త్యాన్ని, మానవుడిని పునీతం చేసే శక్తిని వర్ణించే వందల శ్లోకాలున్నాయి. భగవద్గీతలో (10.31) శ్రీకృష్ణుడు గంగానదితో తన అభిన్నతను తెలియజేస్తాడు.
దేవి గంగ : అవిభాజ్య భారతదేశంలోని దాదాపు అన్ని ప్రఖ్యాత నదులకూ రెండు రూపాలున్నాయి. పౌరాణిక సాహిత్యంలో దేవునిగాగానీ, దేవిగాగానీ అవి వర్ణింపబడ్డాయి.శిల్పశాస్త్రాలు వాటికి నిర్దిష్టమైన రూపాన్ని ఆపాదిస్తూ వాటి వర్ణన వివరాల్ని కూడా ఇస్తున్నాయి. ఉదాహరణకు గంగ రెండు చేతుల్లో కుంభాన్ని కమలాన్ని ధరిస్తూ, మకరవాహనంపై ఆసీనురాలైనట్లు వర్ణింపబడింది. మహాభారతంలో (ఆది పర్వం 96-98) నదీదేవతైన గంగ నరరూపం ధరించి భూలోకంలో జన్మించాలన్న ఒక శాపాన్ని పొందింది. స్వర్గం పొందిన మహాభిషరాజు కూడా అదేవిధంగా శపింపబడ్డాడు.అతడు శంతనరాజుగా పునర్జన్మించాడు. శంతనుడు గంగను పరిణయమాడాడు. మహాభారతంలో ప్రఖ్యాతికెక్కిన భీష్ముడు వీరి పుత్రుడే!
తవజల మమలం యేన నిపీతమ్ పరమపదం ఖలు తేన గృహీతమ్ । మాతర్గంగే త్వయి యో భక్తః శ్రీలందు యమః శక్తః ॥
ఓ గంగమ్మా! నీ జలాన్ని పానంచేసినవారు పరమపదాన్ని తప్పక పొందుతారు. యముడు నీ భక్తులవైపు కన్నెత్తి చూడటానికైనా సాహసించడు!
Denne historien er fra April 2023-utgaven av Sri Ramakrishna Prabha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 2023-utgaven av Sri Ramakrishna Prabha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద