ఇంకా కొద్ది గంటల్లో తెల్లవారుతుంది. శీతాకాలం అవటం వలన విపరీతమైన చలి. ఎప్పటిలాగానే సూర్యదేవుణ్ణి చూస్తామని అనుకున్నారేమో! అప్పటిదాకా గాఢనిద్రలో ఉండి అప్పుడే నిద్రలో కాస్త కల మొదలైంది. ఇంతలోకే మంచాలు కదులుతున్నాయి.తలుపులు, కిటికీలు శబ్దాలు చేస్తున్నాయి. భవనం ఊగటం ప్రారంభించింది. బయట వర్షం చినుకుల శబ్దం కూడా వినిపిస్తున్నది. ఇదేదో వింత కలలాగా ఉంది అని అనిపించి ఉండవచ్చు. ఇంతలోకే పెద్ద శబ్దం. ఏదో బలమైనది శరీరంపై పడింది. అది కలలో భాగంగా జరిగిందా? లేదా బయట తాను ఊహించనిదేదైనా జరుగుతున్నదా? తాను తెలుసుకునేలోపే, తాను గ్రహించేలోపే ఆత్మ స్థూలదేహాన్ని వదిలి, సూక్ష్మశరీరాన్ని తీసుకొన్నది.
మృత్యువు భూకంపం రూపంలో వచ్చి టుర్కీయేలో, సిరియాలో ఫిబ్రవరి ఏడున యాభైవేలమంది 'నిర్భాగ్యుల' పై తన చల్లటి చేతిని పరిచింది. నిద్రనుంచి శాశ్వత నిద్రలోకి తీసుకువెళ్ళింది. లెగిస్తే ఏముంది, మళ్ళీ అదే ఆందోళనలతో, ఒత్తిడి, బాధ్యతలతో కూడుకున్న బరువైన జీవితం. తన ఈ బిడ్డలందరికీ ఆ భారాన్ని తగ్గిద్దామనుకున్నదో ఏమో జగన్మాత వారిని మరణిస్తున్నామని తెలియకుండానే తీసుకుంది. మరణించిన వారికన్నా తమ వాళ్ళనందరినీ పోగొట్టుకొని, తమ సర్వస్వాన్నీ కోల్పోయి ప్రాణాలతో బయటపడిన వారి పరిస్థితి, వేదన, దుఃఖం వర్ణనాతీతం. అంత తన ఒడిలోకి బాధలోనూ వారు తమ మత విశ్వాసం ప్రకారం భగవంతుడి నామాన్ని జపిస్తూనే ఉన్నారు. ఒక మహిళ ‘భగవంతుడా! మమ్మల్ని రక్షించు, మాపై దయచూపు!' అంటూ తన ఏడుగురు కుటుంబ సభ్యులను కోల్పోయి అంత భరించలేని దుఃఖంలోనూ భగవంతుడిని వేడుకుంటున్నది. వారి విశ్వాసం గొప్పది. ఇంత జరిగాక కూడా భగవంతుడి మీద ఇంకా నమ్మకం! మరి భగవంతుడిని తప్ప ఎవరిని ప్రార్థిస్తాం? ఎవరు రక్షించగలుగుతారు? ఎవరు ఉపశమనాన్ని కలిగించ గలుగుతారు? స్థితి ఆయనే. లయ ఆయనే. అనుకంప ఆయనయే. ఆగ్రహం ఆయనే... అన్న భావన.
Denne historien er fra April 2023-utgaven av Sri Ramakrishna Prabha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra April 2023-utgaven av Sri Ramakrishna Prabha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద