అన్నమయ్య పదామృతం
వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడీ ॥
అలరిన చైతన్యాత్మకుఁ డెవ్వడు కలడెవ్వఁడెచట కలఁడనిన తలతు రెవ్వనిని తను వియోగదశ యిల నాతని భజియించుడీ॥
కడగి సకల రక్షకుడిందెవ్వడు వడి నింతయు నెవ్వనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వనిని తడవిన ఘనుడాతని కనుడీ ॥
కదిసి సకల లోకంబుల వారలు యిదివో కొలిచెద రెవ్వనిని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడీ॥
వేదాలు ఆయనే... వేదాంగాలూ ఆయనే! వేదాలు వినుతించేదీ ఆయననే... వేదాంగాలు వర్ణించేదీ ఆయననే! ఆ వేదస్వరూపుడు, ఆ వేదవినుతుడు సకల జీవుల్లో చైతన్యాత్మకుడు. సర్వకాలాల్లో సంరక్షించే సర్వేశ్వరుడు. అందుకే ఆ దేవదేవుడిని కొనియాడి, ఆ దినకరతేజుడిని భజించి, ఆ ఘనాఘన సుందరుడిని సేవించి ఆయనలో ఐక్యం కావటమే మన కర్తవ్యం.
ఆ కర్తవ్యాన్ని క్షణం కూడా విస్మరించకుండా భగవదర్పితంగా బ్రతికేవారే భాగవతోత్తములు. వారికి దైవస్మరణ, దైవసేవే దినచర్య. ఆ స్మరణతో, ఆ సేవతో ఆ భక్తశిఖామణులు ఆ భక్తిమార్గంలో వసివాడని పూలదారులు పరుస్తారు. అలా ఆ తోవలో పూలదారులే కాదు పదామృతధారల్ని కూడా.ప్రవహింపజేసిన పదకవితా పితామహుడు అన్నమాచార్య.ఆయన సంకీర్తనలతో ఆ సప్తగిరీశుడి వైభవం వీనులవిందుగా విశ్వమంతా వ్యాపించింది. ఆయన పాటల్లో శ్రీనివాసుడి శోభ పసిడికాంతులతో విరాజిల్లింది. అలాంటి అరుదైన పదామృతమే ఈ 'వేదం బెవ్వని వెదకెడిని...' కీర్తన. ఆ కొండలరాయడిని ఎందుకు కొనియాడాలో, ఆ భక్తవరదుడిని ఎందుకు భజించాలో, ఆ కామితఫలదాతను ఎందుకు కనులారా వీక్షించాలో, ఆ శ్రీముద్రాంకితుడిని వెదకి వెదకి మరీ ఎందుకు సేవించాలో సంకీర్తనాచార్యుడు ఈ పాటలో ప్రస్ఫుటం చేశాడు. ముఖ్యంగా వేంకటాచలపతిని వేదాలకు సైతం అందని పరిపూర్ణ జ్ఞానస్వరూపుడిగా ఈ కీర్తనలో అన్నమయ్య ప్రస్తుతించాడు. వేదాలు అన్వేషించే అనుపమాన రూపంగా అర్చించాడు. అందుకే "భగవంతుడు వేదాలకు అతీతుడు. వేదవేదాంగాలను అధ్యయనం చేసినంత మాత్రాన ఆయనను పొందలేం. అవన్నీ ఆయన వైపు వెళ్ళేందుకు సూచనలు మాత్రమే! ఆ వేదమార్గంలో మనం పయనించినప్పుడే పరమాత్మ అర్థమవుతాడు" అన్నారు భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస.
ఆ దేవుని కొనియాడు....
Denne historien er fra June 2023-utgaven av Sri Ramakrishna Prabha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 2023-utgaven av Sri Ramakrishna Prabha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద