ప్రపంచాన్నే జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి భారతదేశంలో పర్వత ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు దివ్య తేజస్సుతో కూడిన ఒక సన్న్యాసిని చూసి ఆకర్షితుడయ్యాడు. అతణ్ణి తన దేశానికి తీసుకు వెళ్ళి, తనవారికి ఒక వింత వస్తువుగా బహూకరిద్దాం అనుకున్నాడు. తన కత్తిని తీసి ఝళిపిస్తూ, 'ఏయ్ సన్న్యాసీ! నువ్వు నాతో రావాలి, లేదంటే నీ శిరస్సును ఇప్పుడే ఖండిస్తాను' అన్నాడు. ఆ సన్న్యాసి ఏమాత్రం తొణకలేదు. పెద్దగా నవ్వి 'నన్ను ఏ ఆయుధాలూ గాయపరచలేవు, ఏ అగ్నీ నన్ను దహించలేదు. నేను సచ్చిదానంద ఆత్మస్వరూపుడిని' అన్నాడు. అలెగ్జాండర్ కోపంతో 'నువ్వు నా బానిసవు, నేను చెప్పినట్లు చేయాల్సిందే!' అన్నాడు. ఆ సన్న్యాసి ఇంకా గట్టిగా నవ్వి ఇలా అన్నాడు: 'నేను నీకు బానిసనుగాను, నువ్వే నా బానిసలకు బానిసవు'. నివ్వెరపోవడం అలెగ్జాండర్ వంతయింది. ఆ సాధువు విశదీకరించాడు. 'నేను నా కామక్రోధాలను నిగ్రహించుకొన్నాను, అవి నా బానిసలు. నువ్వు కామ క్రోధాలకు బానిసవు, కనుక నా బానిసలకు బానిసవు. నువ్వు నన్నేమి చేయగలవు?' అని.
శ్రీమద్భాగవతం 11వ స్కంధం 19వ అధ్యాయంలో నిజమైన శౌర్యం లేదా పరాక్రమం గురించి చెబుతూ శ్రీకృష్ణుడు ఇదే మాట అంటాడు. శౌర్యం లేదా పరాక్రమం అంటే ఒక యుద్ధంలో గెలవడం, రాజ్యాలపై దండెత్తడం కాదు. మొత్తం ప్రపంచాన్నే జయించడం కూడా కాదు. స్వభావ విజయః శౌర్యం స్వభావాన్ని జయించడమే నిజమైన పరాక్రమం. ఏ స్వభావాన్ని జయించాలి? పశుస్వభావాన్ని జయించడమే మనిషిలోని నిజమైన పరాక్రమం. 'లోకంలో రెండు రకాల మనుషులు ఉంటారు.దైవీ స్వభావం కలవారు, ఆసురీ స్వభావం కలవారు' అని శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు. ఆ ఆసురీ స్వభావాన్ని జయించడమే నిజమైన పరాక్రమం లేదా బలం. భగవంతుడు మనిషి ఇంద్రియాలన్నిటినీ బహిర్ముఖంగా ఉండేటట్లు సృష్టించాడు.అంటుంది కఠోపనిషత్తు. ధీరుడు మాత్రమే ఇంద్రియాల మార్గాన్ని మళ్ళించి వాటిని భగవంతుడి వైపు మలుపు తిప్పగలుగుతాడు.అదే నిజమైన ధీరత్వం, నిజమైన పరాక్రమం. ఈ పనిని మనుషులు మాత్రమే చేయగలరు. దీన్ని మనం చేయలేకపోతే
Denne historien er fra May 2024-utgaven av Sri Ramakrishna Prabha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 2024-utgaven av Sri Ramakrishna Prabha.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
సింహాద్రి అప్పన్న చందనోత్సవం
వరాహ, నరసింహ అవతారాలు కలసివున్న వరాహనరసింహస్వామి కేవలం సింహాచలంలోనే కొలువై ఉండటం ఈ క్షేత్ర ప్రత్యేకత!
శ్రీరామకృష్ణుల మందిరం ప్రారంభోత్సవం
ఆ౦ధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మొలగవల్లి గ్రామంలో శ్రీరామకృష్ణ సేవాసమితి' నూతనంగా నిర్మించిన భగవాన్ శ్రీరామకృష్ణుల దేవాలయ ప్రారంభోత్సవం 2024 మార్చి 29వ తేదీన వైభవంగా జరిగింది.
ధర్మపరిరక్షకుడు ఆనందుడు
చిత్రాలు : ఇలయభారతి అనుసృజన : స్వామి జ్ఞానదానంద
సమతామూర్తి సందేశం
బ్రీరామానుజుల శిష్యుడు ధనుర్దాసుడు. గురుభక్తి, నిరాడదంబరతగల అతడంటే రామానుజులకు ఎంతో ఇష్టం.
బంధాలు.. బంధుత్వాలు -
తనువుతోనే బంధుత్వాలు కలుగుతున్నాయి జీవునికి. అంటే, జీవునికి నిజానికి ఏ బంధుత్వాలూ లేవు.
బుద్ధుడు ప్రశంసించిన అమూల్య రత్నం
బుద్ధుని ప్రముఖ శిష్యులలో మహాకాశ్యపుడు ఒకరు. బుద్ధునికి శిష్యుడు కాకముందు నుంచే మహాకాశ్యపునికి ఒక విధమైన మహత్వం ఉండేది.
అన్ని ఆచారాలు పాటించినా అనారోగ్యాలెందుకు?
నేటి బేతాళ ప్రశ్నలు
వీళ్ళ విలువ భగవంతుడికే తెలుస్తుంది!
ఇంజినీరింగ్ చదివిన కొడుకును వెంటబెట్టుకొని ఓ తల్లి ఈమధ్య మఠానికి వచ్చింది.
.వాళ్ళు నలిగిపోతున్నారు! . .
పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ప్రముఖ రచయిత గుడిపాటి వెంకటచలం గారు 'బిడ్డల శిక్షణ' అన్న పుస్తకం రాశారు.
వికాసమే జీవనం!
ధీరవాణి - స్వామి వివేకానంద