మత సంబంధిత కథల్లో లింగ అసామానత్వం పునాదులు ఎంత నైపుణ్యంగా వేసారంటే మహిళలు కావాలనుకున్నప్పటికీ వాటిని కదిలించలేరు.
బాల్యంలో తల్లి తరచుగా ఒక కథ చెబుతూ ఉంటారు. కుష్టు వ్యాధితో బాధపడుతున్న తన భర్తను బుట్టలో కూర్చోబెట్టుకుని భార్య సతి స్నానం చేయడానికి నది ఒడ్డుకు వెళ్లేది. ఒక రోజు అదే నది ఒడ్డున ఒక వేశ్య స్నానం చేస్తోంది. అది చూసి కుష్టు వ్యాధి గ్రస్తుడైన భర్త ఆ వేశ్య ప్రేమలో పడతాడు.అప్పటి నుంచి అతనిలో దుఃఖం మొదలైంది. ఎందుకు బాధపడుతున్నావని భార్య అడిగితే అతడు మొత్తం విషయం చెప్పాడు. భార్య భర్తకు ధైర్యాన్ని ఇచ్చింది. అతనికి సహాయం చేస్తానని మాట ఇచ్చింది.
ఆ తర్వాత ప్రతిరోజు ఉదయమే లేచి సతి వేశ్య ఇంట్లోకి రహస్యంగా వెళ్లి ఇంటి పనంతా చేసి తిరిగి వెళ్లిపోయేది. తన ఇంటిపనంతా ఎవరు చేసి వెళుతున్నారని వేశ్య ఆశ్చర్యపోయింది. ఒక రోజు వేశ్య సతిని పట్టుకుంది. కారణం ఏమిటని అడిగింది.
అప్పుడు సతి తన భర్త ప్రేమ కథ గురించి వేశ్యకు చెప్పింది. అప్పుడామె అతన్ని తీసుకు రమ్మంది. ఎంతో సంతోషంగా సతి ఇంటికి వెళ్లిపోయింది. భర్త కోసం కొత్త బట్టలు తీసింది.అతనికి స్నానం చేయించి తుడిచి వేశ్య ఇంటికి తీసుకు వెళ్లడానికి నదివైపు బయలుదేరింది.దారిలో కొద్ది క్షణాలపాటు విశ్రాంతి తీసుకోవ డానికి ఆ బుట్టను ఒక చెట్టు కింద పెట్టింది. ఆమె భర్త కుష్టు రోగి. శరీరం నుంచి దుర్వాసన వస్తోంది. ఆ సమయంలో ఆ దారిలో కొందరు సాధువులు వెళుతున్నారు. వాళ్లు ఆ దుర్వాసన భరించలేకపోయారు. “ఏ ప్రాణి నుంచి ఈ దుర్వాసన వస్తుందో అది సూర్యాస్తమయం లోపు చనిపోవాలి" అని వాళ్లు శపించారు.
సతి వారి మాటలను విన్నది. తర్వాత సూర్యుని వైపు చూసి “నా ఇష్టానికి విరుద్ధంగా సూర్యుడు ఎలా అస్తమిస్తాడో నేను చూస్తాను" అంది.
కథను బట్టి ఆ స్త్రీ పాతివ్రత్యం చాలా శక్తివంతమైనది. ఆమె ముందు సూర్యదేవుడు కూడా తలవంచవలసి వచ్చింది. సూర్యుడు అక్కడే నిలిచిపోయాడు.
ఈ కథ చాలామంది మహిళలు తమ వయసులో ఏదో ఒక సమయంలో విని ఉంటారు.నిజానికి ఇది కేవలం కథ కాదు, మన మతపరమైన కథలతో వారికి తినిపించే ఉగ్గుకి ఒక నమూనా. మతపరమైన కథల్లో ఎక్కువగా స్త్రీలకు నైతిక బోధనలు, ప్రాచీన కాలం నుంచి వస్తున్న వ్యవస్థల ఉగ్గును తినిపిస్తూ ఉంటారు.
Denne historien er fra August 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2022-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు