యవ్వనంగా కనపడేందుకు మేకప్ చిట్కాలు
Grihshobha - Telugu|February 2024
ఈ మేకప్ చిట్కాలు పాటించి మీరూ సినిమా తారల్లా అందంగా కనపడవచ్చు.
- పూనం పాండే
యవ్వనంగా కనపడేందుకు మేకప్ చిట్కాలు

40 దాటిందంటే మీరు మేకపన్ను వదులుకోవనవసరం లేదు. మేకప్లో సరైన షేడ్స్, టెక్నిక్లను ఉపయోగించి ఈ వయసులోనూ యంగ్ లుక్ పొందవచ్చు. నలభై దాటిన మహిళలు యంగ్ గా, ఫ్రెష్ కనిపించడానికి తమ వానిటీ బాక్స్లో ఏం ఉంచాలో మేకప్ ఆర్టిస్టు మనీష్ కెర్కర్ ఇలా వివరించారు.

మేకప్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది

మేకప్ ముఖ సౌందర్యాన్ని పెంచుతుందని అందరూ భావిస్తారు కానీ దీంతో ఆత్మవిశ్వాసం సైతం రెట్టింపు అవుతుందనేది నిజం.అలంకరించుకుని మీరు ఎక్కడికైనా వెళ్తే ఎదుటి వారు మిమ్మల్ని ప్రశంసించినప్పుడు మీ బాడీ 

లాంగ్వేజ్ ఆటోమేటిక్ గా మారుతుంది.ఎందుకంటే ఆ సమయంలో మీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. కాబట్టి బయటికి వెళ్లినప్పుడు మేకప్ చేసుకోవడం మరిచిపోవద్దు.

ఎందుకు దూరంగా ఉండాలి

చాలామంది ఒంటరి మహిళలు ముఖ్యంగా వితంతువులు మేకపికి దూరంగా ఉంటారు. కానీ అలా చేయకూడదు. డార్క్ కాకపోయినా, లైట్ షేడ్స్ మేకప్ మీ అందాన్ని మెరుగుపరుస్తుంది. అలాంటి ఉత్పత్తులకు మీ మేకప్ బాక్స్లో ప్రత్యేక స్థానం ఇవ్వండి. ఫౌండేషన్కి బదులుగా బీబీ లేదా సీసీ క్రీమ్ ను అప్లై చేయండి.

ఇది మీకు సహజమైన రూపాన్ని ఇస్తుంది.పెదాలకు లిప్ బామ్ అప్లై చేయండి. ఐ మేకప్ కోసం కాటుక పెట్టండి. పదిమందిలో మీ ఉనికిని చాటడానికి మీరు ప్రజెంటబుల్గా కనిపించాలన్నది మరిచిపోవద్దు.

మాయిశ్చరైజర్

పెరుగుతున్న వయసుతోపాటు చర్మం పొడిబారుతుంటుంది. ఈ స్థితిలో చర్మానికి అదనపు మాయిశ్చరైజర్ అవసరం. ఇది చర్మంలో తేమ లోపాన్ని భర్తీ చేస్తుంది.

కాబట్టి ముఖంలో డ్రైనెస్ తగ్గించడానికి పగలు, రాత్రి మాయిశ్చరైజర్ అప్లై చేస్తే తేమ నిలచి ఉంటుంది. చర్మం మృదువుగా తయారై, మెరుస్తుంది.

యాంటీ ఏజింగ్ క్రీమ్

ముఖంపై ఏర్పడే ముడతలను దాచడానికి యాంటీ ఏజింగ్ క్రీమ్ వాడండి. చర్మం బిగుతుగా మారుతుంది. కావాలంటే మీరు మార్కెట్లో లభించే పాండ్స్ బివీ లేదా లాక్మేస్ సీసీ క్రీము వాడవచ్చు.

ఇందులో మాయిశ్చరైజర్, యాంటీ ఏజింగ్ క్రీమ్, సన్స్క్రీన్ లాంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి ఫౌండేషన్, సస్క్రీన్, యాంటీ ఏజింగ్ క్రీమ్ మొదలైన వాటిని విడిగా అప్లై చేయాల్సిన అవసరం లేదు.

Denne historien er fra February 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 2024-utgaven av Grihshobha - Telugu.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA GRIHSHOBHA - TELUGUSe alt
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
Grihshobha - Telugu

మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి

మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.

time-read
1 min  |
January 2025
స్పై యాక్షన్ థ్రిల్లర్
Grihshobha - Telugu

స్పై యాక్షన్ థ్రిల్లర్

ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు

time-read
1 min  |
January 2025
కొత్త కథతో నాగార్జున
Grihshobha - Telugu

కొత్త కథతో నాగార్జున

కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.

time-read
1 min  |
January 2025
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
Grihshobha - Telugu

16 అణాల అచ్చ తెలుగమ్మాయి

ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.

time-read
1 min  |
January 2025
ఇండియన్ మెగాస్టార్
Grihshobha - Telugu

ఇండియన్ మెగాస్టార్

' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.

time-read
1 min  |
January 2025
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
Grihshobha - Telugu

తిరిగి యాక్షన్ లోకి వరుణ్

'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.

time-read
1 min  |
January 2025
డ్యాన్సింగ్ క్వీన్
Grihshobha - Telugu

డ్యాన్సింగ్ క్వీన్

తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.

time-read
1 min  |
January 2025
నేషనల్ క్రష్
Grihshobha - Telugu

నేషనల్ క్రష్

పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.

time-read
1 min  |
January 2025
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
Grihshobha - Telugu

దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి

నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.

time-read
1 min  |
January 2025
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
Grihshobha - Telugu

మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి

హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.

time-read
2 mins  |
January 2025