యం గ్గా కనపడటానికి ముఖ్యంగా మీ లైఫ్ స్టయిల్, ఆహార అలవాట్లు, పడుకుని లేచే వేళల్లో మార్పులు, వాకింగ్, రన్నింగ్ లాంటి కొన్ని వ్యాయామాలు మొదలైనవని గమనించండి.
దినచర్యను సరిచేసుకొని వీటిని పాటించినట్లయితే తప్పకుండా మీరు చాలా ఆరోగ్యంగా, ఎప్పటికీ యవ్వనంగా కనపడతారు.మీలో మీకే ఎంతో కంఫర్టుగా అనిపిస్తుంది.
ఎలాంటి ఉపాయాలు మిమ్మల్ని నిత్య యవ్వనంతో మెరిసేలా చేస్తాయో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం.
సరైన టైంలో సరైన పని : మారుతున్న లైఫ్ స్టయిల్స్, టెక్నాలజీ యుగంలో నిద్ర సరిగా లేకపోవటం పెద్ద సమస్య అవుతోంది. ఈ రోజు అందరికీ రోజంతా ఉరుకులు పరుగులు ఉంటున్నాయి. కనుక రాత్రి సమయమే కాస్త ఫ్రీగా ఉంటారు కానీ ఈ వేళలోనూ మొబైల్ తీసుకొని కూర్చుంటారు, లేదంటే తిండి తిప్పలన్నీ టీవీ ముందే కొనసాగిస్తుంటారు. కొన్నిసార్లు అదుపు లేకుండా జంకుడ్ తినేస్తారు. ఈ విధంగా కాలం వేగంగా గడిచిపోతూ ఉంటుంది. దీంతో నిద్ర వేళలు మారుతుంటాయి. ఆలస్యంగా పడుకోవటం వల్ల ఉదయం లేవటంతో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. కనుక లేచినప్పుడు ఫ్రెష్ నెస్ ఉండదు. ఇదంతా కలిసి మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అందుకే మనల్ని మనం ఎల్లప్పుడూ హెల్దీగా, యాక్టివ్ ఉంచుకోడానికి సరైన సమయంలో నిద్రపోయి, లేచేందుకు అలవాట్లు మార్చుకోవాలి.
దినచర్యలో ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు పెట్టుకుంటే ఆరోగ్యంపైన, శరీరంపైనా చాలా పాజిటివ్ ప్రభావం కనిపిస్తుంది.
• మంచి నిద్రతో ఇమ్యూనిటీ పెరుగుతుంది. దీంతో శరీరంలో అనేక రోగాలను ఎదుర్కొనేందుకు శక్తి ఏర్పడుతుంది.ఫలితంగా వ్యాధుల బారిన పడటం నుంచి రక్షించుకోవచ్చు.
• పరిశోధనల ప్రకారం... సరైన నిద్ర వల్ల శరీరంలో రిపేరింగ్ ప్రక్రియ, రీజనరేషన్, రికవరీ వంటివి సవ్యంగా జరుగుతాయి.
• 7-8 గంటలు నిద్రిస్తే మెదడు తాజాదనాన్ని పొందుతుంది. దీంతో మన జ్ఞాపకశక్తి, విశ్లేషణా సామర్థ్యం, ఆలోచనా శక్తి పెరుగుతాయి. పనుల్ని క్రమ పద్ధతిలో పూర్తి చేయగల్గుతాము.
• దీనితో మన కార్య దక్షత పెరుగుతుంది. అంతేగాక పనులన్నీ వేగంగా పూర్తి చేస్తాము.
• మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
• కనీసం 7-8 గంటలు హాయిగా నిద్రిస్తే ఊణుకాయం, మధుమేహం, హృద్రోగాలు, హైబ్లడ్ ప్రెషర్ వంటి రోగాలు దూరం చేసుకోగల్గుతాము.
Denne historien er fra March 2024-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra March 2024-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.