10 మే, 2022 నాడు బెంగళూర్లో బరువు తగ్గడం కోసం లైపోసక్షన్ చికిత్స చేయించుకోవడానికి వెళ్లిన కన్నడ బుల్లితెర నటి చేతన రాజ్ విషాదకరంగా మరణించింది. ఆమె చాలా కన్నడ సీరియల్స్లో నటించింది. అయితే తను లావు తగ్గించుకోవ డానికని సాహెబ్ గౌడ శెట్టి క్లినిక్ కి వెళ్లింది.
ఆమె పరిస్థితి విషమించినా మరో పెద్ద ఆసుపత్రికి వెళ్లేందుకు వైద్యులు అనుమతించలేదు. కొవ్వు రహిత ప్లాస్టిక్ సర్జరీ చాలా సురక్షితమైనది అయినప్పటికీ, ప్రతి శస్త్ర చికిత్సతో కష్టనష్టాలు ఉంటాయి. వైద్యులు శస్త్ర చికిత్సను వారిస్తారు. అయినా కొందరు యువతులు సర్జరీ చేయించుకుంటున్నారు.
తాను సన్నబడటానికి గల రహస్యం ప్రజలకు తెలియకూడదని చేతన తన తల్లిదండ్రులకు కానీ, లేదా ఏ దగ్గరి బంధువులకు కూడా తెలియ జేయకుండా శస్త్ర చికిత్స చేయించుకోవడానికి వెళ్లింది. శస్త్ర చికిత్స సమయంలో, ఆమె ఊపిరితిత్తులలో నీరు చేరింది. దాని కారణంగా ఆమె మరణించింది.
కొవ్వు రహిత శస్త్ర చికిత్సలో, తుంటి, తొడలు, చేతులు మొదలైన వాటి నుంచి కొవ్వు తొలగిస్తారు. మారుతున్న కాలంతోపాటు, తాము అందంగా కనిపించాలన్న కోరిక ప్రజలలో పెరిగింది. కొందరు సెలబ్రిటీలు మరింత నాజూగ్గా కనిపించాలని కోరుకుంటారు. ఇందుకోసం ఎంతటి మూల్యం చెల్లించడానికైనా సిద్ధంగా ఉన్నారు. చాలాసార్లు ఇలాంటి డిమాండ్లు చేస్తుంటే మేము నెరవేర్చలేమని కాస్మెటిక్ సర్జన్లు చెబుతున్నారు. అయితే విదేశాల్లో ఈ కాస్మెటిక్ సర్జరీ సర్వసాధారణం.
రిస్క్ ఉన్నా క్రేజ్
ప్లాస్టిక్ సర్జరీ ఎల్లప్పుడూ విజయవంతం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఈ సర్జరీతో మీరు కోరుకున్న అందం సంగతి అటుంచితే ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. కొన్నిసార్లు కోరుకున్న అందం రాకపోగా భయంకరమైన పరిణామాలను అనుభవించవలసి ఉంటుంది.
కొంతమంది సెలబ్రిటీలు సర్జరీ తర్వాత అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అనేక శస్త్ర చికిత్సలు విజయవంతం కాకుండా, ఉన్న రూపం కూడా చెడిపోతుంది. కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ కూడా అవుతుంది. కాస్మెటిక్ సర్జరీ కూడా మరణానికి కారణం కావచ్చు. అయినా ప్రజలలో దీనిపై క్రేజ్ కొనసాగుతోంది.
ఫేస్ లిఫ్ట్ కాకుండా రొమ్ము శస్త్ర చికిత్స మహిళల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. శస్త్ర చికిత్స కానటువంటి చికిత్సలలో బొటాక్స్ అత్యంత ప్రాచుర్యం పొందింది.
సామాన్య ప్రజలలోనూ ప్రాచుర్యం పొందింది
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 2024-utgaven av Grihshobha - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.