పరీక్షలు అయిపోయాయి. పిల్లలకు ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోంది.
“మమ్మీ, ఈసారి ట్రిప్‌కి ఎక్కడికి వెళుతున్నాం?" అడిగాడు రోరో కుందేలు.
“ఎక్కడా లేదు, మనం ట్రిప్‌కి వెళ్లలేమని నీకు తెలియదా?"
తల్లి సమాధానంతో రోరో నిరాశ చెందాడు. చీకూ, మీకూలదీ అదే పరిస్థితి. వారికి కూడా క్యారమ్స్, లూడో, చెస్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడి ఆడి బోర్ కొట్టింది.
“వినండి. పక్కనే ఉన్న అడవిలో ఒక అద్భుతమైన స్విమ్మింగ్ పూల్ ఉంది. మనం అక్కడికి వెళ్లి పూల్‌లో ఎందుకు స్నానం చేయకూడదు?” డోడో బాతు సలహా ఇచ్చాడు.అందరూ అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
వాళ్లు చాలా దూరం ప్రయాణం చేసారు. స్విమ్మింగ్ పూల్‌ని చూడగానే వారికి అలసిపోయినట్లు ఏమాత్రం అనిపించలేదు.పూల్‌లోని స్వచ్చమైన నీలం రంగు నీరు వారిని రమ్మని పిలుస్తోంది.
“మీరు ఇక్కడ ఈత కొట్టాలంటే ఒక్కో జంతువుకి గంటకు 100 రూపాయలు చెల్లించాలి.మీ దగ్గర డబ్బులు ఉన్నాయా?" గేట్ కీపర్ అడిగాడు. వాళ్లు ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు.
“అంకుల్, మా దగ్గర టిక్కెట్లు కొనడానికి డబ్బులు లేవు.”
“అయితే మీరు ఇందులోకి రాలేరు. ఇక్కడికి కొంచెం దూరంలో ఒక సరస్సు ఉంది. కావాలంటే మీరు అక్కడికి వెళ్లి స్నానం చేయవచ్చు.”
నలుగురు స్నేహితులు ఆ సరస్సువైపు బయలుదేరారు. వాళ్లు సరస్సును కనుగొన్నారు. కానీ అందులో ఉన్న మురికి నీరు చూసి స్నానం చేయవద్దని నిర్ణయించుకున్నారు.
“ఇప్పుడు మనమేం చేయాలి?” ఆలోచనలో పడ్డారు.
అంత దూరం నడిచేసరికి వారికి ఆకలి కూడా వేసింది. స్నేహితులు ఆహారం కోసం చుట్టూ చూసారు. కానీ ఏమీ కనిపించలేదు. దాంతో వాళ్లు అడవిని విడిచి పెట్టి నగరంవైపు దారి తీసారు.
కొన్ని ఫౌంటెయిన్లతో పచ్చదనంతో నిండిపోయిన ఒక పార్క్ వాళ్లు చేరుకున్నారు.
This story is from the June 2022 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 2022 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
దీపావళి పండుగ జరిగిందిలా...
లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
తేడాలు గుర్తించండి
నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు - గురుపురబ్
తాతగారు - గురుపురబ్
'విరామ చిహ్నాల పార్టీ'
విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.
బొమ్మను పూర్తి చేయండి
బొమ్మను పూర్తి చేయండి
దీపావళి పార్టీ ట్రయల్
దీపావళి పార్టీ ట్రయల్