సగం నిద్రలో ఉన్నప్పుడు రఘు టేబుల్ కింద రహస్యంగా కదులుతున్న మొమో ఎలుకను చూసాడు. అక్కడ కొన్ని కాఫీ గింజలు పడి ఉన్నాయి.మొమోవాటిని తన రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లాడు.తినడానికి ప్రయత్నించాడు. కానీ ఒక గొంతు విని ఉలిక్కి పడ్డాడు.
“చూడు మొమో, మమ్మల్ని నువ్వు తిననని ప్రమాణం చేస్తే, నీకు మేం మా కథ చెబుతాం. మేము ఇంకా పండ్లుగా మారలేదు. కాబట్టి మా రుచి నీకు నచ్చదు” ఆ గొంతు కాఫీ గింజల నుంచి వినిపించింది.
“సరే, నాకు మీ కథ చెప్పు. మీ కథ విన్న తర్వాత తినాలావద్దా అన్నది నేను నిర్ణయిస్తాను” చెప్పాడు మొమో.
“అయితే విను. మనం కథలోకి వెళ్లాం" అని కాఫీ గింజలు తమ కథ చెప్పడం మొదలుపెట్టాయి.
"మేము కాఫీ గింజలం. అరబ్బీ భాషలో మమ్మల్ని 'కాహవా' అని పిలుస్తారు. తర్వాత ఇది కాఫీ, కేఫ్ పదాలుగా మారింది. మా జన్మ స్థానం ఎర్ర సముద్రం దక్షిణపు ఒడ్డున ఉన్న యెమన్, ఇథియోపియాలు.యెమనికి చెందిన సూఫీ సాధువులు తమ ఆచారా సంప్రదాయాల్లో దేవుడిని గుర్తు చేసుకోవడానికి, ధ్యానం చేయడానికి మమ్మల్ని ఉపయోగించారు.”
“ఇథియోపియాలోని పీఠభూమి ప్రాంతంలో అడవి మొక్కతో తయారుచేసిన పానీయాన్ని మొదటిసారిగా ఒక గొర్రెల కాపరి రుచి చూసాడు. 1414 వరకు మక్కాకు కాఫీతో పరిచయం లేదు. 15వ శతాబ్దం ప్రారంభంలో కాఫీ
యెమన్లోని మోచా నౌకాశ్రయం నుంచి ఈజిప్టుకి చేరుకుంది. కైరోలోని రిలీజియస్ యూనివర్శిటీ సమీపంలోని ఇళ్లలో కాఫీ వ్యవసాయం చేసేవారు.
1554 నాటికి ఇది అలెప్పో లాంటి సిరియన్ నగరాల్లో ప్రజాదరణ పొందింది. తర్వాత ఇది ఒట్టోమన్ సామ్రాజ్య పూర్వ రాజధాని ఇస్తాంబుల్ వరకు వెళ్లింది" కాఫీ గింజలు చెప్పడం కొనసాగించాయి.
"కాఫీ యూరప్కి రెండు మార్గాల్లో చేరుకుంది. ఒకటి ఒట్టోమన్ సామ్రాజ్యం నుంచి రెండోది మోచా సముద్ర మార్గంలో. 17వ శతాబ్దం ప్రారంభంలో ఈస్ట్ ఇండియా, డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీలు మోచా నుంచి కేప్ ఆఫ్ గుడ్ హెూప్ ద్వీపం చుట్టూ ఓడల సహాయంతో తిరిగి చాలా వరకు కాఫీని కొనుగోలు చేసాయి. వాళ్లు దీనిని భారత దేశం నుంచి కూడా ఎగుమతి చేసారు.
Denne historien er fra November 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra November 2022-utgaven av Champak - Telugu.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో