గ్రీ తూ, సునయన ఒకే స్కూల్లో, ఒకే తరగతిలో చదువుకుంటున్నారు. వాళ్లు కలిసి ఆడుకునేవారు. ఒకే బస్సులో స్కూల్‌కి వచ్చేవారు.
ఒక రోజు సైన్స్ టీచర్ ప్రయోగం చేసి చూపించింది. ఆమె ఒక కుండలో నీళ్లు వేడి చేసింది. తర్వాత బాటిల్ మూతికి బెలూన్ కట్టి దాన్ని వేడి నీళ్లలో పెట్టింది. దాంతో బెలూన్ ఉబ్బిపోయింది.
“వేడిగాలి తేలికగా ఉంటుంది. కాబట్టి అది పైకి లేస్తుంది. ఈ టెక్నిక్‌తో ప్రజలు వేడి బెలూనికి బాస్కెట్ కట్టి విమాన ప్రయాణం ఆనందిస్తారు” అని చెప్పింది.
రీతూ, సునయన సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లినప్పుడు వారి కాంపౌండ్‌లో నివసించే బెక్కీ, తార కూడా వారితో చేరారు. సునయన, రీతూలు తమ స్నేహితులకు టీచర్ ప్రయోగం గురించి చెప్పారు.
“మనం కూడా రైడికి వెళ్లడానికి ఎందుకు హాట్ ఎయిర్ బెలూన్ తయారుచేయకూడదు?" అడిగింది తార.
“కానీ, చిన్న బెలూన్ మన బరువు మోస్తూ ఎగరగలదా?" అడిగింది రీతూ.
“మనం కాకపోయినా, మన దగ్గర ఉన్న బొమ్మలను ఎయిర్ రైడ్‌కి పంపవచ్చు" బొమ్మలు ఎంతో ఇష్టపడే బెక్కీ చెప్పింది.
“అవును, మనం చేయగలం!" అంది సునయన ఉత్సాహంతో.
“సరే, అయితే మీరందరూ మా ఇంటికి రండి.
మా పేరెంట్స్ ఇంకా ఆఫీసు నుంచి ఇంటికి రాలేదు. ఇంట్లో మా నానమ్మ మాత్రమే ఉంది.
మనం నీళ్లు సులభంగా వేడి చేయగలం" అంది రీతూ.
“మా ఇంట్లో బెలూన్ల ప్యాకెట్ ఉంది. దాన్ని తెస్తాను. బెలూన్ కట్టడానికి బాటిల్ తీసుకువస్తాను” అంది సునయన.
"ఇంట్లో నా దగ్గర చిన్న బాస్కెట్ ఉంది.
దాన్ని తెస్తాను” అంది తార.
వారు ఆట మరిచిపోయి తమ సామాను తెచ్చుకునేందుకు పరుగులు తీసారు. కాసేపటికి నలుగురు తమ వస్తువులతో రీతూ ఇంటికి చేరుకున్నారు. తమ బొమ్మలు కూడా తెచ్చుకున్నారు.
ఒక పాత్రలో నీళ్లు వేడి చేసి దానిలో బాటిల్ ఉంచి
బెలూనిని దాని మూతికి కట్టారు. నీళ్లు వేడెక్కిన వెంటనే బెలూన్ ఉబ్బసాగింది. ఆనందంతో వారు ఎగిరి గంతేసారు.
బెలూన్ మూతిని దారంతో కట్టారు.. దాన్ని బాస్కెట్‌కి కట్టి అది ఎగిరిపోయేంతవరకు ఎదురుచూసారు కానీ అది ఎగరలేదు.
"బెలూన్ చాలా చిన్నదని నేను అనుకుంటున్నాను. మనం బెలూన్ల సంఖ్య పెంచాలి. లేకపోతే బాస్కెట్ ఎగరదు" అంది రీతూ.
ఎన్నో బెలూన్లు ఊది బాస్కెట్‌కి కట్టారు.
This story is from the March 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో