కొడీ ఆవుకి రెండు సంవత్సరాల దూడ ఉంది.పేరు చిప్పీ. అతడు చాలా అల్లరి చేసేవాడు, మొండివాడు. ఎవ్వరి మాట వినకుండా తనకు నచ్చినట్లు చేస్తుంటాడు. ప్రతి ఒక్కరు అతనిపై ఫిర్యాదు చేయడంతో కొడీ అతని గురించి చాలా ఆందోళన చెందేది. కొన్నిసార్లు అతని అల్లరి చేష్టల కారణంగా చిప్పీని కొట్టేవారు. తగిలిన దెబ్బలు అతని శరీరంపై ఎర్రని గుర్తులను మిగిల్చేవి.
ఒకసారి అతని గాయాలకు మందు రాస్తూ "బాబూ, నువ్వు నీతోపాటు ఇతరులకు ఇబ్బంది కలిగించే పని చేయకూడదు" అని వివరించింది తల్లి.
“అమ్మా, నీకు అడవి వాళ్ల గురించి తెలుసు కదా. వారు ఎప్పుడూ కథలు అల్లుతూ ఉంటారు.
ఎవరు తప్పు చేసినా నా పేరు చెబుతారు".
“అలా కాదు, అడవిలో వేరే జంతువులూ ఉన్నాయి. మరి వాటి గురించి ఎవరూ ఎందుకు చెప్పుకోరు కథలు. అందరూ నీ గురించే మాట్లాడుకుంటున్నారు”.
“అమ్మా వాళ్ల మాట వినకు. అందరు చెప్పినట్లుగా నేను లేను” అన్నాడు చిప్పీ.
“రేపటి నుంచి నువ్వు ఆహారం కోసం నాతో రావాలి. నీ తమ్ముడు గోల్డీ ఎప్పుడూ నాతోనే ఉంటాడు తెలుసా”.
“అమ్మా, అతడు ఇంకా చిన్నవాడు. అందుకే నీతో కంపెనీ అతనికి నచ్చింది. పెద్దవాడినయ్యాక నా ఆహారం నేనే ఏర్పాటు చేసుకోగలను. నాకు అడవిలో స్వేచ్ఛగా తిరగాలని ఉంది".
“స్వేచ్ఛ అంటే గర్వం ప్రదర్శించడం కాదు” చెప్పింది కొడీ. మౌనంగా ఉండటమే తెలివైన పని అనుకున్నాడు చిప్పీ.
బెల్లా ఎలుగుబంటి పొలంలో లేత గోధుమ మొక్కలు తిన్నందుకు అతడు ఎన్నోసార్లు శిక్షకు గురయ్యాడు. బెల్లా ఒక రోజు పొలం ఒక చివర్లో దాక్కుంది. అతడు వచ్చి తినడం మొదలు పెట్టగానే, ఆమె కర్రతో వచ్చి కొట్టింది.
దెబ్బలు తిన్న చిప్పీ అడవివైపు పరుగెత్తాడు.
సాయంత్రం బెల్లా కొడీని కలుసుకుని “చిప్పీని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ఎవరి వల్లనో అతని జీవితం ప్రమాదంలో పడకూడదు" అని చెప్పింది.
“అలా ఎందుకు అంటున్నావు బెల్లా?”.
“ఏమీ తెలియనట్లు నటించకు కొడీ. ఈ రోజు నేను అతన్ని కర్రతో బాదాను. అతని శరీరంపై నువ్వు తప్పకుండా గాయాలను చూసి ఉంటావు.
వాటిని చూసి నువ్వు ఎందుకు దెబ్బలు తిన్నావని అతన్ని అడగలేదా?”.
This story is from the April 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the April 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.