స్వప సంగీత గారాల కూతురు. తల్లి ఎంతగానో ప్రేమించేది. కూతురు పెంపకంలో చాలా జాగ్రత్త తీసుకునేది. అయితే ఆమె కూతురు ఏ పని చేసినా ఎడమ చేయి ఉపయోగించడాన్ని గమనించలేదు. స్వప్న ఎడమ చేత్తోనే తల్లి చీరను పట్టుకునేది. బొమ్మలు తీసుకునేది. బొటనవేలు నోట్లో పెట్టుకుని చప్పరించేది.
అయితే సంగీత తన కూతురు వేలు చప్పరిస్తున్న సమయంలో ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఆమె ఎడమ చేతి బొటనవేలు ఉపయోగించడం గమనించింది.
స్వప్న పెద్దయ్యాక స్కూలుకు వెళ్లినప్పుడు అక్కడా రాయడానికి ఎడమ చేయి ఉపయోగించ సాగింది.
ఆమెకది ఇబ్బందిగా అనిపించింది.కుడి చేత్తో రాసే విధంగా మార్చడానికి సంగీత ప్రయత్నించింది. కానీ స్వప్న అలా చేయలేకపోయింది. దాంతో సంగీత ఈ విషయం స్వప్న తండ్రి రాకేశికి చెప్పింది. అప్పటివరకు ఇది అతనికి తెలియదు. ఇది ఆందోళన చెందే విషయం కాదన్నాడు.
“చాలామందికి ఎడమ చేయి వాడే అలవాటు ఉంటుంది. సాధారణ వ్యక్తులే కాదు, ఎడమ చేతితో పని చేసి గొప్ప విజయాలు సాధించిన వారు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బ్యాట్స్మెన్ వినోద్ కాంబ్లీ, అల్బర్ట్ ఐన్స్టీన్ ఇంకా ఎందరో క్రీడాకారులను మనం చూడవచ్చు. దాని గురించి నువ్వు బాధపడకు. కుడి చేతిని మనం ఎలా ఉపయోగిస్తామో అలాగే స్వప్న తన ఎడమ చేతిని వాడగలదు" అని సంగీతకు వివరించి చెప్పాడు.
This story is from the August 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
మ్యాప్ క్వెస్ట్
ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.
దీపావళి సుడోకు
దీపావళి సుడోకు
దీపావళి పోస్టర్ పోటీ
దీపావళి పోస్టర్ పోటీ కథ
ఏమిటో చెప్పండి
మీకెన్ని తెలుసు?
డమరూ - దీపాలు
డమరూ - దీపాలు కథ
ష్... నవ్వొద్దు...
హహహ
అందమైన రంగులు నింపండి
అందమైన రంగులు నింపండి
బోలెడు టపాకాయలు
బోలెడు టపాకాయలు
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో