శభమ్, శ్యామ్లు సన్నిహిత మిత్రులు. గ్రామంలో వారి ఇండ్లు ఒకదానికొకటి దగ్గరగా ఉండేవి.
దీపావళి రోజున క్రాకర్స్ కాల్చడం అంటే వారికి చాలా ఇష్టం. ఈసారీ వారు దీపావళికి ముందే టపాసులు కొన్నారు. పండుగ వరకు ఆగలేకపోయారు. ముందే వాటిని కాల్చేసారు.
రెండోసారి టపాసులు కొనుక్కోవడానికి వారికి తల్లిదండ్రులు డబ్బు ఇవ్వరు. కానీ శుభమ్, శ్యామ్లు తక్కువేం తినలేదు. వారు తమ పిగ్గీ బ్యాంక్ లను పగలగొట్టి ఆ డబ్బుతో నగరానికి వెళ్లి టపాసులు కొనుగోలు చేయాలనుకున్నారు. వారి పిగ్గీ బ్యాంక్ లో మొత్తం 767 రూపాయలు లభించాయి.
ఇద్దరూ దీపావళికి ఒక రోజు ముందే నగరానికి వెళ్లాలనుకున్నారు. అది గ్రామానికి చాలా దూరంలో ఉంది. అక్కడికి చేరుకోడానికి అడవి నుంచి వెళ్లాలి.అందుకే సైకిల్పై వెళ్లి సాయంత్రంకల్లా తిరిగి రావాలనుకున్నారు. మర్నాడు నగరంలో టపాసులు కొనుగోలు చేసాక ట్రాఫిక్ రద్దీ కారణంగా వారికి ఆలస్యమైంది. వాళ్లు అదే రూట్లో తిరిగి ఇంటికి చేరేలోపు చీకటి పడుతుంది.
దీని గురించి ఆలోచిస్తూ శుభమ్ శ్యామ్ “శ్యామ్, చీకటి పడక ముందే మనం అడవి నుంచి వెళ్లాలి. గ్రామానికి చేరుకోడానికి ఇదే దగ్గర దారి" అని చెప్పాడు.
"కానీ శుభమ్, అడవిలోంచి వెళ్తున్నప్పుడు జంతువులు మనపై దాడి చేయవచ్చు” అన్నాడు శ్యామ్ యంగా.
“నువ్వు చెప్పింది నిజమే కానీ నాకో విషయం తెలుసు. పగటి పూట అడవి జంతువుల భయం తక్కువ. మన దగ్గర క్రాకర్ గన్లు ఉన్నాయి కాబట్టి భయపడేది ఎందుకు?” అన్నాడు శుభమ్ క్రాకర్ గన్స్న గాల్లో తిప్పుతూ.
“మంచి విషయం చెప్పావు. ఇవి బొమ్మ తుపాకీలే అయినా ఫైర్ క్రాకర్స్న వదులుతాయి.ఇవి అసలైనవో, నకిలీవో జంతువులకు తెలియదు.కాబట్టి క్రాకర్స్ చూడగానే అవి భయంతో పారిపోతాయి” నవ్వుతూ చెప్పాడు శ్యామ్.
“వావ్ శ్యామ్, చాలా గొప్ప ఆలోచన. మనం ఈ పిస్టల్స్న మన బెల్ట్ పెట్టుకుని నిజమైన వేటగాళ్లమవుదాం. ఏదైనా అడవి జంతువు కనిపిస్తే పిస్టల్తో కాల్చేద్దాం. ఢాం... ఢాం... మరుక్షణంలో జంతువు చనిపోతుంది" అన్నాడు శుభమ్ పిస్టల్ను గురి పెట్టినట్లు నటిస్తూ.
This story is from the November 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 2023 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తేడాలు గుర్తించండి
ఈ రెండు చిత్రాల మధ్య ఉన్న 10 తేడాలను గుర్తించండి.
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
దాగి ఉన్న వస్తువులను గుర్తించండి
మారిన దృక్పథం
మారిన దృక్పథం
స్మార్ట్
పేపర్ వింటర్
మీ ప్రశ్నలకు మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
తాతగారు - ప్రపంచ బెయిలీ దినోత్సవం
చుక్కలు కలపండి
అంకెల వెంట చుక్కలు కలిపి బొమ్మను పూర్తి చేయండి.
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
మంచు కొండల సిమ్లా సాహసయాత్ర
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
మనకి - వాటికి తేడా
మనకి - వాటికి తేడా