డ్రోన్ గాలిపటం
Champak - Telugu|January 2024
కొన్ని నెలలుగా సరిస్కా అడవిలో పులులు ఒక్కొక్కటిగా అదృశ్యమవుతున్నాయి. జంతువులన్నీ తమకు ఏం జరుగుతుందో, ఏమోనని ఆందోళన చెందసాగాయి.
అమితాబ్ శంకర్ రాయ్ చౌదరి
డ్రోన్ గాలిపటం

సరిస్కా మహారాజు బగ్గా పులి “అదృశ్యమైన పులులను కనుగొనడంలో సహాయం చేసిన వారికి గొప్ప బహుమతులు ఇస్తాం" అని ప్రకటించాడు.

మకర సంక్రాంతి రోజున పిల్లలందరూ గాలిపటాలు ఎగుర వేయడానికి సరిస్కా సరస్సు ఒడ్డున గుమిగూడారు. ఆ సమయంలో అక్కడికి టోటో పులి తండ్రి రాంబో వచ్చి "మా టోటో నిన్న రాత్రి నుంచి కనిపించడం లేదు. అతని కోసం అన్ని చోట్లా వెతికాను. కానీ కనుక్కోలేకపోయాను. అతన్నివెతకడంలో దయచేసి నాకు సహాయం చేయండి. అతనికి ఏమైనా జరిగి ఉండవచ్చు" ఆందోళనగా చెప్పాడు.

అందరూ విచారంలో మునిగారు. ఏం చేయాలి? రెండు మూడు నెమళ్లు గాల్లో ఎగురుతూ వెతకసాగాయి. టోటో పులి స్నేహితులైన ఎలుగుబంట్లు చెట్లెక్కి చూసాయి. కానీ నిరాశతో కిందికి దిగి వచ్చి “అంకుల్ అతను ఎక్కడా కనిపించడం లేదు. అయినా ఇంత దట్టమైన అడవిలో అంత దూరం ఎలా చూస్తాం?" అన్నాయి.

చంచల్ కుందేలు నిశ్శబ్దంగా జరిగిన సంఘటనంతా గమనించాడు. “నాకో ఆలోచన వచ్చింది. ఈ మకర సంక్రాంతికి మా డాడీ నాకు కెమెరాతో కూడిన ఒక తేలికైన పోన్ బహుమతిగా ఇచ్చాడు. సరిస్కాను అన్వేషించడానికి దాన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది?” అన్నాడు.

చెట్టు మీద కూర్చున్న తోతారామ్ రామచిలుక “అయితే ఆ ఫోన్ను ఏం చేస్తావ్? చేతిలో పట్టుకుని ఏరియా మొత్తం వెతుకుతావా?” కోపంగా అడిగాడు.

“చూస్తూ ఉండు తోతారామ్”.

చంచల్ పొద వెనకాల ఉన్న తన గూడులోకి వెళ్లాడు. రెండు పెద్ద గాలిపటాలు, దారాలు, ఫోన్తో వెంటనే తిరిగి వచ్చాడు.

ఒక గాలిపటాన్ని స్నేహితుడు బల్లూ ఎలుగుబంటికి ఇచ్చి “ఇది పట్టుకోండి. మీరు ఒక గాలిపటం ఎగురవేస్తారు. మరొకటి నేను ఎగురవేస్తాను. మనం రెండు గాలిపటాల మధ్య దారాన్ని కట్టి దానికి ఫోన్ జోడించి ఆకాశంలో ఎగురవేస్తాం. దాన్ని ఆటో మోడ్లో ఉంచుతాం. ప్రతి 30 సెకన్లకు ఒకసారి ఇది అడవి పైనుంచి ఫోటోలు తీస్తుంది. ఇది మన అన్వేషణను వేగవంతం చేస్తుంది. టోటో ఎక్కడైనా ఉంటే మనకు వెంటనే తెలుస్తుంది”.

“కానీ, ఫోన్తో గాలిపటాలు ఎగరగలవా?” అడిగాడు బల్లూ.

This story is from the January 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the January 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
దీపావళి పోస్టర్ పోటీ
Champak - Telugu

దీపావళి పోస్టర్ పోటీ

దీపావళి పోస్టర్ పోటీ కథ

time-read
4 mins  |
November 2024
ఏమిటో చెప్పండి
Champak - Telugu

ఏమిటో చెప్పండి

మీకెన్ని తెలుసు?

time-read
1 min  |
November 2024
డమరూ - దీపాలు
Champak - Telugu

డమరూ - దీపాలు

డమరూ - దీపాలు కథ

time-read
1 min  |
November 2024
ష్... నవ్వొద్దు...
Champak - Telugu

ష్... నవ్వొద్దు...

హహహ

time-read
1 min  |
November 2024
అందమైన రంగులు నింపండి
Champak - Telugu

అందమైన రంగులు నింపండి

అందమైన రంగులు నింపండి

time-read
1 min  |
November 2024
బోలెడు టపాకాయలు
Champak - Telugu

బోలెడు టపాకాయలు

బోలెడు టపాకాయలు

time-read
2 mins  |
November 2024
"కమ్మని" కాఫీ కథ
Champak - Telugu

"కమ్మని" కాఫీ కథ

బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు

time-read
3 mins  |
October 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
October 2024