అమ్మమ్మకు ప్రత్యేక బహుమతిగా ఏమి కొనాలో తేల్చుకోలేకపోతోంది టాయి. మెరిసే లైట్లతో, వివిధ షేడ్స్‌తో వేలాడే దీపాలతో, చిన్న పిల్లలు వారి తల్లిదండ్రులతో షాపింగ్ మాల్స్ సందడిగా మారాయి. షోకేసులన్నీ ఆకర్షణీయమైన గిఫ్టులతో నిండి ఉన్నాయి. రకరకాల సాఫ్ట్ టాయ్స్, బ్యాగ్స్, బుక్స్, చక్కని దుస్తులు, క్యాప్స్, స్వెట్టర్లు, ట్రౌసర్లు, మగ్లు ఇంకా ఎన్నో ఇతర వస్తువులు అక్కడ ఉన్నాయి. గిఫ్ట్ షాప్స్ దగ్గర జనం రద్దీ బాగా ఉంది. కానీ అక్కడ అమ్మమ్మకు ఇచ్చేంత స్థాయిలో గిఫ్ట్‌లు లేవు.
టాయీ తల్లిదండ్రులతో టొరొంటో నగరంలో నివసిస్తోంది. ఈ ప్రదేశం తన అమ్మమ్మ నివసిస్తున్న పాట్నా నగరానికి ఎంతో దూరంలో ఉంది. వాళ్లింటి చుట్టూ మామిడి చెట్లున్నాయి. టాయీ రెండు సంవత్సరాల కొకసారి అమ్మమ్మను చూడడానికి వెళ్లేది. ఆమెకు టాయీకి గాఢమైన అనుబంధం ఉండేది. ఆమెకు తనకున్న అనుబంధాన్ని గురించి టాయీ తన స్నేహితురాళ్లతో “మా అమ్మమ్మ నా బెస్ట్ ఫ్రెండ్. నేను చెప్పే ప్రతి మాట వింటుంది. మా తల్లిదండ్రులు సైతం ఇలా వినరు" అని చెప్పేది.
ఆమె స్నేహితుల్లో ఒకరైన నీలికళ్ల అమ్మాయి లిసా “నువ్వు ఆమెను ఎంతో ప్రేమిస్తున్నట్లు అనిపిస్తోంది. మహిళా దినోత్సవం రోజున ఆమెకు ఒక మంచి బహుమతి ఇవ్వవచ్చు కదా?” అని అడిగింది టాయీని. అది ఆమెను ఆలోచింప చేసింది. అమ్మమ్మ కోసం ఒక స్పెషల్ గిఫ్ట్ కొని ఎయిర్మెయిల్లో ఆమెకు పంపించాలనుకుంది.
ఆదివారం రోజు ఆమె గ్లాసీ స్ట్రీట్ అనే గిఫ్ట్ మార్ట్‌కి వెళ్లింది. ఆమెతోపాటు ఆమె తల్లి గిఫ్ట్‌లను చూడడానికి వచ్చింది. కానీ టాయీ ఏదీ ఎంచుకోలేకపోయింది.
ఆమెతో ఉన్న తండ్రి అసహనానికి లోనయ్యాడు.“అమ్మమ్మకి గిఫ్ట్ కొనడానికి ఇంత ఆలస్యం దేనికీ? నువ్విలా ఏదీ నచ్చకపోతే మనం ఇంటికి వెళ్లడం ఆలస్యమవుతుంది" అన్నాడు.
“సారీ నాన్నా, నాకు ఏదీ స్పెషల్‌గా అనిపించడం లేదు” జవాబు ఇచ్చింది టాయీ నిరుత్సాహంగా.
This story is from the March 2024 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 2024 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.