దెయ్యం గది
Champak - Telugu|June 2024
దెయ్యం గది
కథ • వివేక్ చక్రవర్తి
దెయ్యం గది

"నేను చాలా అలసిపోయాను. కొంచెం నిమ్మరసం తాగాక పని చూసుకుంటాను” అన్నాడు జంపీ కోతి మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి రాగానే.

నిమ్మరసం గ్లాసు తీసుకోవడానికి పక్కనే ఉన్న గదిలోకి ప్రవేశించాడు.

"హేయ్ ఏమిటిది? గ్లాసు ఎలా ఖాళీ అయ్యింది?” ఆశ్చర్యపోతూ అడిగాడు.

బహుశా తాను అప్పటికే నిమ్మరసం తాగి మరిచి పోయినట్లుంది అనుకున్నాడు జంపీ. కానీ ఇలా ప్రతిసారీ జరుగుతుండటంతో అతనికి చాలా కోపం వస్తోంది.

ఒక రోజు “ప్రతి రోజూ నా నిమ్మరసాన్ని తాగుతున్న దుర్మార్గుడు ఎవరో నేను కనుక్కుంటాను” అని శపథం చేసాడు.

ఆ రోజు నుంచి నిమ్మరసం గ్లాసు లోపల పెట్టి గది బయట కూర్చుని దానిపై కన్నేయడం మొదలు పెట్టాడు. అయితే అప్పుడు సైతం గ్లాసు పెట్టిన కాసేపటి తర్వాత గదిలోకి చూస్తే ఖాళీగా కనిపించింది.

విసుగు చెందిన జంపీ నిమ్మరసాన్ని తాగుతున్న దొంగను పట్టుకోవడానికి తన ఇంట్లో సెక్యూరిటీ గార్డులను పెట్టుకున్నాడు. ఇంటి చుట్టూరా సీసీ కెమెరాలను బిగించాడు.అయినప్పటికీ నిమ్మరసమే కాదు అలాంటి కూల్డ్రింక్స్, నీళ్లు లాంటి పదార్థాలు గ్లాసు లోంచి అదృశ్యమవుతూనే ఉన్నాయి. కానీ దొంగ ఆచూకీ దొరకలేదు.

ఇవన్నీ చూసాక జంపీ ఆ గదిలో 'దెయ్యం' ఉందని నిర్ధారించుకున్నాడు. అందుకే జంపీ ఆ గది దగ్గరకు వెళ్లడం మానేసాడు. ఇంట్లో ఒకే గదిని వాడుకోవడానికి పరిమితమయ్యాడు.

ఈ సంఘటన జరిగి చాలా రోజులైంది. ఒక రోజు సాయంత్రం అతని పాత మిత్రులు చీకూ కుందేలు, మీకూ ఎలుక జంపీ ఇంటికి వచ్చారు.

వారికి జంపీ చక్కటి భోజనం ఏర్పాటు చేసాడు.

“వావ్, చాలా రుచిగా ఉన్నాయి వంటకాలు.నాకైతే నిద్ర ముంచుకు వస్తోంది. జంపీ దయచేసి నాకు గది చూపించు. మంచంపై ఒరుగుతాను” అన్నాడు మీకూ పొట్టపై చేయి రాసుకుంటూ.

“సారీ, మీకూ, నువ్వు మాతోపాటు ఈ గదిలోనే పడుకోవాలి" క్షమాపణలు అడుగుతూ చెప్పాడు.

“ఫరవాలేదు జంపీ, మనమందరం ఇక్కడే సర్దుకుందాం. కానీ మిగిలిన గదుల్లో ఎవరైనా పేయింగ్ గెస్ట్లు ఉన్నారా?” అడిగాడు చీకూ.

"లేరు, అక్కడి గది ఖాళీగా ఉంది" వెంటనే సమాధానం చెప్పాడు జంపీ.

"ఏంటి? గది ఖాళీగా ఉందా? మరెందుకు మమ్మల్ని ఇక్కడ పడుకోమని చెబుతున్నావ్. ఆ గదిలో నువ్వేమైనా ఖజానా దాచి పెట్టావా?" చెప్పి పొడిచాడు మీకూ.

“ఒకవేళ ఉంటే ఉండనీ బాధపడకు. నీ ఖజానా మేమేం ఎత్తుకుపోం" అన్నాడు నవ్వుతూ చీకూ.

This story is from the June 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the June 2024 edition of Champak - Telugu.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHAMPAK - TELUGUView All
దీపావళి పండుగ జరిగిందిలా...
Champak - Telugu

దీపావళి పండుగ జరిగిందిలా...

లిటిల్ మ్యాడీ మంకీ స్కూల్ నుంచి ఇంటికి రాగానే \"చాలా బాధగా కనిపించాడు. ఏం జరిగిందో అతని తల్లి పింకీకి అర్థం కాలేదు.

time-read
2 mins  |
November 2024
మ్యాప్ క్వెస్ట్
Champak - Telugu

మ్యాప్ క్వెస్ట్

ఎల్మో ఏనుగు ఒక సంగీత స్వరకర్త. తన తాజా భారతీయ వాయిద్య పాట కంపోజ్ చేయడానికి సరైన ఇన్స్ట్రుమెంట్ కోసం వెతుకుతున్నాడు.

time-read
1 min  |
November 2024
దీపావళి సుడోకు
Champak - Telugu

దీపావళి సుడోకు

దీపావళి సుడోకు

time-read
1 min  |
November 2024
తేడాలు గుర్తించండి
Champak - Telugu

తేడాలు గుర్తించండి

నవంబర్ 11 'జాతీయ విద్యా దినోత్సవం'.

time-read
1 min  |
November 2024
చిన్నారి కలంతో
Champak - Telugu

చిన్నారి కలంతో

చిన్నారి కలంతో

time-read
1 min  |
November 2024
తాతగారు - గురుపురబ్
Champak - Telugu

తాతగారు - గురుపురబ్

తాతగారు - గురుపురబ్

time-read
1 min  |
November 2024
'విరామ చిహ్నాల పార్టీ'
Champak - Telugu

'విరామ చిహ్నాల పార్టీ'

విరామ చిహ్నాలు పార్టీ చేసుకుంటున్నాయి. బోర్డుపై సందేశాలు రాసాయి.

time-read
1 min  |
November 2024
గొడవ పడ్డ డిక్షనరీ పదాలు
Champak - Telugu

గొడవ పడ్డ డిక్షనరీ పదాలు

చాలామంది పండితులు వివిధ బాషలలో నిఘంటువు (డిక్షనరీ)లను రూపొందించడానికి చాలాసార్లు ప్రయత్నించారు.

time-read
3 mins  |
November 2024
బొమ్మను పూర్తి చేయండి
Champak - Telugu

బొమ్మను పూర్తి చేయండి

బొమ్మను పూర్తి చేయండి

time-read
1 min  |
November 2024
దీపావళి పార్టీ ట్రయల్
Champak - Telugu

దీపావళి పార్టీ ట్రయల్

దీపావళి పార్టీ ట్రయల్

time-read
1 min  |
November 2024