సుకలో ఇల్లు బిల్డింగ్ సెట్‌ను ఇతర బ్యాగ్‌ల "మధ్య ఉంచుతూ “మా జాబితాలోని ఇది చివరి వస్తువు" అని నిషా అనడంతో "నేను దాంతో ఇసుకలో ఇళ్లు కట్టే వరకు రేపటి వరకు ఎదురుచూడలేను. నాకెంతో ఎగ్జయిటింగ్ ఉంది" అన్నాడు అఖిల్. వీకెండ్ సెలవులను ఉల్లాసంగా గడపటానికి వారు బీచ్ రిసార్ట్‌కి వెళ్తున్నారు.
నిషా, నిఖిల్ ఇద్దరూ తోబుట్టువులు.మంగళూరులో ఉన్నారు. అఖిల్ వారి బంధువు, రాంచీ నుంచి వారిని కలిసి పోదామని వచ్చాడు.
అఖిల్‌తో కలిసి వాళ్లు బీచ్ కి వెళ్లారు. ఇంతకు ముందు కూడా అఖిల్ బీచ్‌కి వెళ్లాడు. కానీ ఎప్పుడూ బీచ్‌లోని రిసార్ట్‌లో ఉండలేదు.
"షానయ్ బీచ్ టెంట్ తెస్తోందా? ఇంకా ఎంతసేపు. దానిని కూడా సెటప్ చేయాలి.ఇంకా ఎంతసేపు ఎదురుచూడాలి?"
షానయ్ వారి పొరుగింటి స్నేహితుడు. అతను కూడా వారి బీచ్‌కి వచ్చాడు.
"పిల్లలూ ఇప్పుడు పడుకోండి. ట్రాఫిక్‌ను దాటి మనం వెళ్లాలంటే మనం రేపు త్వరగా బయలుదేరాలి” అని వాళ్ల తల్లిదండ్రులు చెప్పడంతో వారు సంతోషంగా గుడ్‌నైట్ చెప్పి నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయాన్నే బయలుదేరి షానాయన్ను కలుపుకుని టిఫిన్లు చేద్దామని ఒక హోటల్ వద్ద ఆగారు.
అఖిల్ బ్రేక్ ఫాస్ట్ ప్రారంభించాడు. అతను మంగళూరు వచ్చినప్పటి నుంచి స్థానికంగా తయారుచేసే 'కడబు'లను ఇష్టంగా తింటున్నాడు.వీటిని జాక్రాట్ లేదా అరటి ఆకులలో ఉడికించిన ఇడ్లీలలాగా ఆవిరితో ఉడికిస్తారు. వాటితోపాటు మంగళూరు బన్ లుగా పేరు గాంచిన తీపి డీప్ ఫ్రైడ్ బన్స్, స్పెసీ కూర, చట్నీతో కలిపి తిన్నాడు.
బీచ్ రిసార్ట్ ప్రయాణం మూడు గంటలు సాగింది. ప్రయాణమంతా సముద్ర మార్గంలోనే జరిగింది. ప్రకృతిని ఎంతగానో ఇష్టపడే నిషా, ఆ దృశ్యాలను చూస్తూ ఎంతో ఆనందించింది. షానయ్ కూడా దారి పొడుగునా ప్రకృతి అందాన్ని చూస్తూ ఆస్వాదిస్తూనే ఉంది. కానీ నిఖిల్, అఖిల్‌తో కలిసి ఫోన్లో అతనికి ఇష్టమైన గేమ్ ఆడాడు. అతని తల్లి వారిస్తున్నా, ఐదు నిమిషాలే ప్రకృతి అందాలను _చూసి తిరిగి అఖిల్‌తో ఆటలో మునిగిపోయాడు. రిసార్ట్‌కు వెళ్లే దారి వాళ్లకి దారిలో గుడిసెలు, చుట్టూ పరుగెత్తే పిల్లలు, గిన్నెలు తోముతూ, బట్టలు ఉతుకుతున్న మహిళలు కనిపించారు. నిషా ఒకే రంగుతో, ఒకే డిజైన్ , వివిధ సైజులలో వరుసగా ఉన్న బట్టలను చూసింది.
“బహుశా అవన్నీ ఒకే కుటుంబానికి చెందినవై ఉండవచ్చు. వారందరికీ ఒకే రకమైన గుడ్డలు కొనుక్కున్నారేమో” అని అనుకుంది.
This story is from the August 2024 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2024 edition of Champak - Telugu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
"కమ్మని" కాఫీ కథ
బిన్నీ మేక సంతోషంగా ఒక పొలంలో పచ్చని గడ్డి మేస్తున్నప్పుడు 'ఆ పొలం యజమాని కర్రతో ఆమె వెంట పడ్డాడు
చిన్నారి కలంతో
చిన్నారి కలంతో
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
తాతగారు అంతర్జాతీయ కాఫీ డే
మనకి - వాటికి తేడా
ఎకార్న్ వడ్రంగి పిట్టలు చేసే శబ్దం నవ్వుతున్నట్లుగా ఉంటుంది.
తేడాలు గుర్తించండి
అక్టోబర్ 4 ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం.
పర్యావరణ అనుకూల దసరా
అక్టోబర్ 12న దసరా పండుగ జరుపుకోవడానికి గీత, స్వాతి, అశిష్, అభి ఎఫిజీలను తయారు చేసుకుంటున్నారు.
పర్యావరణ హిత రావణుడు
ప్ర తి సంవత్సరం లాగే దసరా పండుగ సందర్భంగా పాఠశాలలో వివిధ కార్యక్రమాలతో మూడు రోజుల ఉత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
దాండియా బొమ్మలు - శుభి మెహరోత్రా
నవరాత్రి ఉత్సవాలను నాట్యం చేసే ఈ దాండియా బొమ్మలతో జరుపుకోండి.
బొమ్మను పూర్తి చేయండి
ఈ చిత్రంలో కొన్ని భాగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని పూర్తి చేసి, రంగులు నింపండి.
మీ ప్రశ్నలకు - మేనకా ఆంటీ జవాబులు
మేనకా ఆంటీ ఒక పర్యావరణ వేత్త, కేంద్ర సహాయమంత్రి & జంతు ప్రేమికురాలు.