'భగవాన్ భక్త భక్తిమాన్'- భాగవతంలో భగవంతుడు కూడా భక్తుని భజిస్తాడు- సేవిస్తాడు! భక్తుల కొరకు రోదిస్తాడు, ఉద్విగ్నుడౌతాడు, పరితపిస్తాడు. గిరిధారి హరి పరిపరి విధాల భక్తులను కనికరిస్తాడు.
వారి భద్రతకై తాను నిద్రను కూడా త్యజిస్తాడు. క్షము (సర్వసమర్థు)డైనా వారిని క్షమించమని వేడుకొంటాడు. వారి ప్రేమకు లోనై కాపాడటానికి కాని పనికైనా పూనుకొంటాడు! తన వారి ప్రతిన (ప్రతిజ్ఞ)ను కొమ్ముకాయడానికి తన ప్రతినను వమ్ము చేయడానికి కూడా వెనుకాడడు.తాను ఎంత భక్త పరాధీనుడంటే నిత్యముక్తుడైనా అస్వతంత్రుని వలె బంధనం స్వీకరిస్తాడు!
శుక ఉవాచ.. పరీక్షిన్మహారాజా! నిర్దోషి, హిత మిత భాషి, మహా మనీషి ఐన అంబరీషునే ఆశ్రయించమని పీతాంబరుడు అచ్యుతుడు ఆనతివ్వగా, చక్రజ్వాలల వల్ల మిక్కిలి ఆయాసం పొందినవాడూ, వికాసం- తేజస్సు పోగొట్టుకొన్నవాడూ, రొప్పుతున్నవాడూ ఐన దుర్వాసునికి అప్పటికి ఊపిరి (శ్వాస ఆడింది. ఆఘమేఘాల మీద వచ్చి ఆ అవనీపతి అంఘి (పాద) పద్మాలను విడువకుండా పట్టుకొన్నాడు. ఆ చక్రవర్తి తన చరణ స్పర్శకు సిగ్గుపడుతూ వెనుకాడుతూ, కరుణతో నిండిన హృదయంతో సర్వశరణ్యమైన సుదర్శన చక్రాన్ని ఇలా స్తుతించాడు శా% 'నీరజాక్షుండు చాల మన్నించు నట్టి, శస్త్రముఖ్యమ! కావవే చాలు మునిని'- అవక్ర పరాక్రమంతో పేరెన్నికగన్న ప్రధాన శస్త్రమా! ఓ సుదర్శన చక్రమా! నిన్ను త్రివిక్రముడు బాగా మన్నిస్తాడు. నీకు పదేపదే నమస్కారం. ఆపదకు చిక్కిన ఈ మునిని కాపాడు. నాకదే చాలు! నాకు విహిత- విధింపబడిన ధర్మమార్గంలో నేను వర్తించే- నడచే వాణ్నయితేబీ వేద విదులు, బీద సాదలు యాచకులై వచ్చి కోరిన ద్రవ్యాన్ని లేదు కాదనక మోదంతో ఇచ్చే దాతనైతేబీ ధరణీసురుడు బ్రాహ్మణుడు మాకు దైవ స్వరూపుడైతే ఈ
మహర్షికి హర్షం కలుగుగాక!
కం 'అఖిల గుణాశ్రయుఉడగు హరి
సుఖియై నా కొలువు వలనఉ జొక్కెడి నేనిన్
నిఖిలాత్మమయుండగుటకు
సుఖమందుం గాక భూమిసురుఉ డివ్వేళన్'
This story is from the August 2023 edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2023 edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.