
కాణిపాకం పుణ్యక్షేత్రం బాహుధా నది ఉత్తరపు ఒడ్డున, తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై, చిత్తూరు నుండి 12 కి.మీ.దూరంలో ఉంది. కాణిపాకంలో అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఇక్కడ జనమేజయుడుకట్టించాడని అనుకునే ఒక పాత దేవాలయము ఉంది.మణికంఠేశ్వర స్వామి ఆలయాన్ని చోళ రాజైన రాజరాజేంద్ర చోళుడు కట్టించాడు. ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్పసంపద చోళ విశ్వకర్మ శిల్పి శైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది.
చరిత్ర : కాణి అంటే పావు ఎకరా మడిభూమి లేదా మాగాణి అని, పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం అని అర్ధం. చరిత్ర ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు వుండేవారు. వారు ముగ్గురు మూడు రకాల అవిటితనాలతో బాధపడేవారు, ఒకరు గుడ్డి, ఇంకొకరు మూగ మరొకరికి చెవుడు. వారికి వున్న చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు. పూర్వకాలంలో నూతి నుండి ఏతాంలతో నీటిని తోడేవారు. ముగ్గిరిలో ఒకరు క్రింద వుంటే ఇద్దరు ఏతాం పైన వుండి నీరు తోడేవారు. అలా వుండగా ఒక రోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది. దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వటం మొదలు పెట్టాడు. కాసేపటి తరువాత గడ్డపారకు రాయిలాంటి పదార్ధం తగలటంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు. గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూసి నిశ్చేత్రుడయ్యాడు. కొద్ది క్షణాలలో బావిలో నీరు అంతా కూడా రక్తం రంగులో మారిపోయింది. మహిమతో ముగ్గిరి అవిటితనం పూర్తిగా పోయి వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారు. ఈ విషయం విన్న చుట్టుప్రక్కల గ్రామస్థులు తండోపతండోలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతు త్రవ్వటానికి ప్రయత్నించారు. వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామి వారి స్వయాంభు విగ్రహం నీటి నుండి ఆవిర్భవించింది. ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు. ఈ కొబ్బరినీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది. దీన్ని కాణిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు, రానురాను కాణిపాకంగా పిలవసాగారు. ఈ రోజుకి ఇక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే వుంటుంది. అక్కడ ప్రాంగణములోనే ఒక్క బావి కూడా వున్నది దానిలో స్వామి వారి వాహనము ఎలుక ఉంది. అక్కడ స్వామివారికి, మనకి ఇష్టమైన పదార్థం ఏదైనా వదిలి వెస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని ప్రసిద్ధి.
ఏలా వెళ్ళాలి- : ...
Esta historia es de la edición Telugu muthyalasaralu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Telugu muthyalasaralu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా, అశుభములు

వంటిల్లే ఓ ఔషదాలయం
-ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి
సందిగ్ధ నామములకు నక్షత్రములు - బ్రహ్మ యామిళముననుసరించి

ఇది ప్రపంచం
ఇది ప్రపంచం

లక్ష్మీదేవిని ఉసిరికాయ దీపాలతో పూజించండి.
శ్రీమహాలక్ష్మీదేవికి ఉసిరికాయ అత్యంత ప్రీతికరమైనది శుక్రవారం సాయంత్రం ఉత్తర భారత దేశంలో శ్రీ మహాలక్ష్మీదేవికి ఉసిరికాయ దీపాలను వెలిగిస్తారు.

సర్వాంగాసనం
నేలమీద వెల్లకిలా పడుకొని వుండి, రెండు కాళ్ళు చాచాలి, మోకాళ్ళ వద్ద గట్టిగా బిగపట్టి, రెండుచేతులూ కాళ్ళు పక్కగా ఉంచాలి.అరచేతులను భూమికి తాకేటట్లుగా ఉంచాలి.

శ్రీమద్భగవద్గీత-మానవ కర్తవ్య దీపిక
సనాతన భారతీయ సంస్కృత సాహిత్యంలో పంచమవేదంగా ఇతిహాస కావ్యమైన మహాభారతం ప్రసిద్ధి చెందినది.

ద్వాదశ జ్యోతిర్లింగాలు
భారతదేశవ్యాప్తంగా మహాశివరాత్రి నాడు 12 క్షేత్రాలలో జ్యోతిర్లింగ రూపుడైన పరమశివుడు మనకు దర్శనమిస్తున్నాడు.

వాస్తులోని ఫలితాలు
ఒక మనిషికి ముఖ్యముగా ఆరోగ్యమే మహాభాగ్యము అను సామెత ప్రకారం ఆరోగ్య కరము ఉన్న ఎడల ఏవైనను సాధించగలరు.

జంట సాలు పద్దతిలో బిందు సేద్యం ద్వారా మొక్కజొన్న సాగు
పంటకు సరైన సమయంలో సరైన మోతాదులో సరైన రీతిలో, సరైన భాగంలో నీరు అందించినప్పుడు మాత్రమే అధిక దిగుబడిని పొందవచ్చు