చిత్తూరు జిల్లా, సత్యవేడు తాలూకా, పిచ్చాటూరు మండలము, పుత్తూరు, చెన్నై రహదారిలో, అరుణానదీ తీరమున, రామగిరి గ్రామము నందు పర్వతమును ఆనుకొని వున్న క్షేత్రమే శ్రీ మరకతాంబికాసమేత శ్రీ వాలీశ్వర స్వామి దేవాలయము. ఈ పురాతన ప్రసిద్ధి పొందిన దేవాలయం తొమ్మిదవ శతాబ్ధమునకు చెందినది. ఈ దేవాలయము పల్లవకాలపు శిల్పకళా నైపుణ్య ములతో రూపు దిద్దుకున్నది. పర్వతము క్రింద ఉత్పత్తియగు నంది నోటి ద్వారా దేవాలయ కోనేటిలో నీరు నిరంతరం వస్తూ వుండడం వలన దీనిని నందితీర్ధమని అంటారు. నీరు త్రాగుటకు తీయగా, అమృత పానీయముగా ఉండును. ప్రకృతి సౌందర్యాలన్నీ రంగరించుకొని ఉండుట వలన ఈ ప్రదేశము ప్రశాంతంగా వుంటుంది. ఈ దేవాలయమును దర్శించిన భక్తులకు ఆత్మ సంతృప్తి, దైవానుగ్రహము పుష్కలంగా లభించునని భక్తుల ప్రగాఢ విశ్వాసము, నమ్మకము. ప్రస్తుతము ఈ దేవాలయము ఆంధ్రప్రదేశ్ దేవా దాయ, ధర్మాదాయ శాఖ వారిచే నిర్వహించబడుచున్నది. ఈ ఆలయమే వాలీశ్వర స్వామి దేవాలయము, రామగిరి.
పురాణకాలములో దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రులవారు, లంకాధిపతియైన రావణాసురుని సంహరించి, అతని ఆధీనములో బంధింప బడిన తన శ్రీమతి శ్రీ సీతాదేవిని విడిపించుకొని, తన పరివారముతో రామేశ్వరమునకు వచ్చెను శ్రీరామచంద్రులవారు.
రావణాసురుడు బ్రహ్మాంశ సంభూతుడగుటచే అతనిని సంహరించుటచే శ్రీరాముల వారికి బ్రహ్మహత్యాదోషము కలిగినది. ఈ దోషముతో అయోధ్య వెళ్ళి పట్టాభిషేకము చేసుకొనుట అంత మంచిది కాదని, వశిష్టాది మహర్షులు తెలిపారు. కాశీ పట్టణమందు గల ఒక స్వయంభు శివలింగమును తెచ్చి ప్రతిష్టించి, పూజించినచో, ఆ బ్రహ్మహత్యా దోషము తొలగునని తెలిపారు.
అందుకు శ్రీ రాములవారు సమ్మతించి, తన నమ్మినబంటుటైన శ్రీ హనుమంతుని పిలిచి ఆంజనేయా! ఈ రోజునే నీవు కాశీ పట్టణమునకు వెళ్ళి, రేపు తెల్లవారుజామున (సూర్యుడు ఉదయించక ముందే) గంగానదిలో స్నానంచేసి, కాశీ క్షేత్రమందున్న స్వయంభు శివలింగము నొకదానిని, మధ్యా హ్నములోగా తీసుకొని, రామేశ్వరమునకు రావలయునని ఆజ్ఞాపిం చెను.ఆంజనేయస్వామి శ్రీ రాముని ఆజ్ఞను శిరసావహించి ముందురోజే, రామేశ్వ రమును వదలి, ఆకాశమార్గములో తిరుక్కారిక అను గ్రామము మీదుగా కాశీకి వెళ్ళెను.
This story is from the telugu muthyalasaraalu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the telugu muthyalasaraalu edition of Telugu Muthyalasaraalu.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
కలియుగపు ఉడిపి హోటల్సుకు- ఉడిపి రాజు శ్రీకారం !!
కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది.
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
మీ పేరులోని మొదటి అక్షరం అనుసరించి నక్షత్రం - గణము - జంతు వివరము
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
నక్షత్రం- అదృష్ట వారాలు- అదృష్ట సంఖ్య
ఈ పదార్ధాలతో శివునికి అభిషేకం చేస్తే కలిగే ఫలితాలు
పరమ శివునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఏ ఫలితం లభిస్తుంది.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
మానవుని శరీరంలో విటమిన్ లోపం వలన ఏఏ వ్యాధులు సంక్రమిస్తాయో తెలుసుకుందాం.
దశావతారాలు
భగవంతుడు మాయాతీతమైన తన దివ్యస్థితి నుండి, ఈ మాయా ప్రపంచంలోకి అడుగుపెట్టడమే అవతరించడం అన్నమాట.
వాస్తు - వాటి వివరములు
వాస్తు అనగా పంచభూతములు = 5 అవి 1) భూమి, 2) ఆకాశము, 3) గాలి, 4) అగ్ని, 5) నీరు
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
సరిహద్దు భద్రత (బిఎస్ఎఫ్) ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
రాత్రి జరిగే ఆకస్మిక మరణాలకు దూరంగా ఉండండి,
మీ కుటుంబం,స్నేహితులు, ప్రియమైన వారితో ఈ విషయం షేర్ చేయండి.చిన్నవారైనా లేదా ముసలివారైనా, వయస్సుతో సంబంధం లేకుండా ఇది జరగవచ్చు.అందరికి తెలియ జేయండి. - సేకరణ
ఘనంగా చిత్తూరు నేచర్ లవర్స్ అసోసియేషన్ 15వ వార్షికోత్సవం.
ప్రకృతిని కాపాడుదాం.