అక్టోబర్ 21వ తేదీ 'అమరవీరుల సంస్మరణ దినం'గా నిర్వహిస్తారు. అక్టోబర్ 15 నుండి 21 వరకు వారం రోజుల పాటు అమరవీరుల సంస్మరణ వారోత్సవంగా నిర్వహిస్తారు. ప్రజల ధన, మాన, సంరక్షణ దిశలో అసువులు బాసిన అమరవీరుల సేవలను గుర్తుచేసుకుంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చరిత్ర - నేపథ్యం
భారత్- చైనా సరిహద్దులో ఉన్న లడఖ్ ని ఆక్సామ్ చిన్ వద్ద కేంద్ర రిజర్వ్ పోలీసు దళం (సి.ఆర్.పి.ఎఫ్) మన సరిహద్దుల రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్నది. 1959 అక్టోబర్ 21వ తేదీన రక్తం గడ్డకట్టేలా ఉన్న విపరీతమైన చలిలో పది మంది సి.ఆర్.పి.ఎఫ్. పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. చైనా దేశానికి చెందిన సైనికులు పెద్ద సంఖ్యలో మన దేశ సరిహద్దులోకి చొరబడి, మన భూభాగాన్ని ఆక్రమించడానికి వచ్చినప్పుడు ఈ పదిమంది సి.ఆర్.పి.ఎఫ్. పోలీసులు ధైర్యంతో చైనా సైనికులను, చివరి రక్తం బొట్టు వరకు ఎదురించి, ఆ పోరులో తమ ప్రాణాలు కోల్పోయారు.భారతదేశ రక్షణ కోసం పోలీసులు ప్రాణాలు వదిలిన సంఘటన అదే కావడం గమనార్హం. దాంతో పోలీసు బలగాల్లో ఆత్మస్థైర్యం నింపాలని, వారిని ప్రతి సంవత్సరం స్మరించుకోవాలని భావించి, అన్ని రాష్ట్రాల పోలీసు అధికారులు 1960 జనవరి 9వ తేదీన సమావేశమై, అక్టోబర్ 21వ తేదీని 'అమర వీరుల సంస్మరణ దినం'గా పాటించాలని తీర్మానించారు. నాటి నుండి పోలీసు అమరవీరుల త్యాగాన్ని స్మరించుకొని, వారి కుటుంబాలకు సానుభూతిని, సహకారాన్ని ప్రకటించి, వారికి ఘనమైన నివాళులు అర్పించడం సంప్రదాయంగా వస్తున్నది.
మన దేశ సైనికులు మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న అత్యంత ఎత్తైన సియాచిన్ పర్వత శ్రేణుల్లో సరిహద్దు రక్షణకు తమ ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనవి, మిక్కిలి చలితో కూడిన ప్రాంతం సియాచిన్ పర్వత ప్రాంతం. జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో, పాకిస్తాన్ సరిహద్దులోని ఈ సియాచిన్ గ్లేసియర్లో విధులు నిర్వహించడం అనేది మన సైనికులకు అత్యంత క్లిష్టమైన పని. దేశ సరిహద్దులను కాపాడుతూ, శత్రు సైనికులు మన దేశ భాగంలోకి ప్రవేశించకుండా ఎదుర్కొని పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది. దేశ సరిహద్దులను కాపాడుతూ, శత్రు సైనికులు మన దేత భాగంలోకి ప్రవేశించకుండా ఎదుర్కొని పోరాటం చేయవలసిన అవసరం ఉంటుంది.
This story is from the October 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 2023 edition of Police Today.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఆన్లైన్లో బాల్యం బంధీ
ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పేరుతో భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అభినందనలు
మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.
ఆన్లైన్ కాల్స్తో అప్రమత్తంగా ఉండండి
ఆన్లైను మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అక్టోబరు 16న అన్నారు.