విడివిడిపోచలు ఆఊరి పశువులకు రోజూ గడ్డి మోపులవుతుంటాయి కానీ.. మనుషులను ఒక్కటి కానివ్వని కొన్ని పరిస్థితులున్నాయ్ ఆఊళ్ళో.. రకరకాల పార్టీలు, కులాలు, సామాజిక స్థితులు బాధితులందరినీ ఒక్కటి కానివ్వటంలేదు.. అందుకని ఎవరికివారు విడివిడిగా వాపోవటమే జరుగుతోంది...
'రోడ్డు బాగు చెయ్యమని ధర్నా చేద్దాం'.. అని ఒకసారి అనుకున్నారు కానీ ఊరినుంచి టవునుకుపోయేటోళ్లు టవును నుంచి ఊళ్ళోకి వచ్చేటోళ్లు అంతా తమ ఊరివాళ్ళు చుట్టుపక్కల ఊళ్ళ వాళ్ళు, పాలోళ్ళు కనుక తమవాళ్ల రాకపోకలను అడ్డుకొని అంతరాయం కల్పించటం ధర్మంకాదని ఆ ప్రయత్నం విరమించుకున్నారు..
' ఓట్లను బహిష్కరిద్దాం.. కలెట్టర్ దిగొస్తడు రోడ్డు సౌలత్ అదే వొస్తది అని సర్పంచ్ ఎన్నికలనుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలకు ముందు తీర్మానించుకుంటారు కానీ తీరా పోలింగ్ తేదీ దగ్గర పడేసరికి ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, వాళ్లనోళ్లను కరెన్సీ నోట్లతో కట్టి పడేస్తారు..
పార్టీలు, కులాలు అందుకు ఊతమిస్తుంటాయి..
నంతమేరా అధ్వాన్నంగా 'ఊరు ఇంకెంత దూరం ఉంటుంది'.. చూపు కనపడుతున్న మట్టి రోడ్డును చూస్తూ అడిగాడు ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి..
ఇంగో మూడు కిలోమీటర్లుంటది సార్ అన్నాడు అతని పార్టీ నాయకుడు..
ఊళ్ళో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు కార్లు, ప్రచార రథం మంది మార్బలంతో వచ్చాడు రామిరెడ్డి ఎన్నికల ప్రచార బృందాన్ని స్వాగతించి ఊళ్ళోకి తీసుకుపోయేందుకు అక్కడికి మోటార్ సైకిళ్లతో చేరుకున్నారు గ్రామ, మండల పార్టీ శ్రేణులు.. 'రోడ్డు అసలేం బాలేదు సార్, గోతులతో కంకరతేలి ఉంది కొన్నిచోట్ల బురదగుంటలు కూడా ఉన్నాయ్ టైర్లు దిగబడే ప్రమాదం ఉంది' అని చెప్పాడు డ్రైవర్.. 'మోటార్ సైకిళ్లమీద ఎలాగో వెల్దాం సార్ ఊళ్ళో మొత్తం పదివేల దాకా ఓట్లున్నాయ్ ' అని పార్టీ నాయకుడు చెబుతుండటంతో..కారు దిగి మోటార్ సైకిల్ ఎక్కాడు.. ఎంత తప్పిద్దాం అనుకున్నా టైర్లు ఒకటికాకపోతే మరో గుంటలో పడుతూ లేస్తుండటంతో టూ వీలర్ గంతులేస్తోంది.. ఎమ్మెల్యే అభ్యర్థి సహా ప్రచార బృంద నడుములు హూనమవుతున్నాయి..
This story is from the December 17, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 17, 2023 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ఇంట్లో అక్వేరియం ఏ దిక్కున ఉంచాలి
హిందూ మతంలో వాస్తుకు చాలా ప్రాము ఖ్యత ఉంది. ఇంటి నిర్మాణం నుండి ఇంట్లో ఉంచే ప్రతి వస్తువు వరకు వాస్తు నియ మాలను పాటించడం చాలా ముఖ్యం.
'మెకానిక్ రాకీ'.
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన తాజా సినిమా 'మెకానిక్ రాకీ'.
కళల కాణాచి మన తెలంగాణ
తెలంగాణ సంస్కృతికి సుమారు 5,000 సంవత్సరాల సాంస్కృతిక చరిత్ర ఉంది.
ఈవారం కథ
ఇలాంటి వారు ఉంటారా?
సూర్య బుడత
బాలల కథ
వేమన పద్యాలు
వేమన పద్యాలు
సూర్య
సూర్య
సూర్య బుడత
బాలల కథ
ఫన్ చ్
ఫన్ చ్
లెజెండ్
గీతాంజలి