మానవ శరీర నిర్మాణం ఒక అద్భుత సృష్టి కాగా శరీరంలోని ప్రతి అవయవానికి దేని ప్రత్యేకత దానికున్నప్పటికీ సర్వేంద్రియానాం నయనం ప్రధానం” అని కళ్ళకు మరింత ప్రత్యేక స్థానముంది. ఈ సృష్టి లోని అందాలను, అద్భుతాలను చూసి తాదాత్యం పొందడంలో కళ్ళు కీలక భూమిక పోషిస్తాయన్నది జగమెరిగిన సత్యం.“భగవంతుడు ఒక తలుపు మూసివేస్తే, మరొక కిటికీ తెరుస్తాడు” అన్న సామెత లాగా దృష్టి లోపం ఉన్న వారిలో పంచేంద్రియాలలో దృష్టి తప్ప మిగతా నాలుగు ఇంద్రియాలైన ధ్వని, వాసన, రుచి,స్పర్శతో పాటు జ్ఞాపక శక్తి మరియు భాష పైన పట్టు సాధారణ వ్యక్తుల కంటే అధికంగా ఉంటుంది. అంతేకాదు సాధారణ వ్యక్తులతో పోలిస్తే వారిలో ఆశావహ దృక్పథం, వినూత్నమైన ఆలోచనా విధానం మరియు సృజనాత్మకత మెండుగా ఉంటాయి. ఈ సానుకూల అంశాల ఆధారంగానే గుజరాత్ లోని గాంధీనగర్లో ప్రత్యేకించి మారుమూల గ్రామాలు, పట్టణాలకు చెందిన అంధ మరియు దృష్టి లోపం గల విద్యార్థులకు మెరుగైన విద్యావకాశాలను అందించడం కోసం ఆనంద్ సోనేచా నేతృత్వంలో సీల్యాబ్స్ సంస్థ ఒక ప్రత్యేక పాఠశాలను రూపొందించింది. ప్రత్యేకంగా వినూత్న ఆలోచనలతో రూపొందించబడిన ఈ పాఠశాలలో విద్యార్థులు పంచేంద్రియాలలోదృష్టి తప్ప మిగిలిన నాలుగు ఇంద్రియాల శక్తి ఆధారంగా సాధారణ విద్యార్థులతో సమానంగా _ విద్యనభ్యసించడానికి అవకాశం కల్పించబడింది. దృష్టి లోపం గల విద్యార్థుల యొక్క ప్రతి అవసరాన్ని సునిశిత దృష్టితో పరిగణనలోకి తీసుకుని వారు సునాయాసంగా గుర్తించేందుకు అనుగుణంగా ఉందేలా చేసిన కొన్ని మార్పులు చేర్పులు, ఈ పాఠశాల భవనం యొక్క మానసిక పటాన్ని విద్యార్ధులు తమ మస్తిష్కంలో ఊహించుకునేలా సహాయపడుతుంది. సాధారణంగా దృష్టిలోపం ఉన్న వారిలో సంపూర్ణ అంధత్వం కేవలం 15 శాతం మందిలో ఉండగా మిగతా 85 శాతం మంది కాంతిని గుర్తించే పాక్షిక దృష్టి కలిగిఉంటారు.
This story is from the May 19, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the May 19, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
'35: చిన్న కథ కాదు'
ఈ మధ్య కొన్ని సినిమాలు స్టార్ పవర్ లేకపోయినా కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించాయి.
ఉరుకు పటేల
ప్రకాష్ రాజ్ దర్శకత్వం వహించిన 'ఉలవచారు బిర్యానీ'తో కథానాయకుడిగా పరిచయమైన యువకుడు తేజస్ కంచర్ల. 'హుషారు'తో విజయం అందుకున్నారు.
ముక్కు బ్లాక్ అయిందా? ఈ చిట్కాలు పాటిస్తే త్వరగా ఉపశమనం
ముక్కు దిబ్బడకు జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యలు, అలర్జీలు వంటి అనేక కారణాలు వుంటాయి.
మొహం కడిగేటప్పుడు ఈ తప్పులు చేయకండి
సాధారణంగా ప్రతీ ఒక్కరు తన చర్మ సౌదర్యం పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు.
గోధుమ పిండితో టేస్టీ బిస్కెట్లు..
ఇంట్లో తయారు చేసే బిస్కెట్లు అనగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది మైదాపిండితో తయారు చేసిన బిస్కెట్లు.. కానీ గోధుమ పిండితో కూడా బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.. చాలా హెల్దీ కూలగడా.. సాధారణంగా పిల్లలు బిస్కెట్లు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
క్షణికావేశాలు ఆత్మహత్యలు
ఈ ప్రపంచంలో అత్యున్నతమైనది మానవ జీవితం.జీవితంలో వచ్చు అనేక ఒడుదుడుకులను ఎదుర్కొంటూ జీవిత యాత్రను కొనసాగిస్తూ, తన జీవితాన్ని, కుటుంబాన్ని సురక్షితంగా, సంతృప్తికరంగా పూర్తి చేసే విధంగా మానవుడు తన జీవితాన్ని కొనసాగించాలి.
సమయస్పూర్తి
బస్టాండ్ లో కూర్చుని ఉన్నారు శ్రీధర్, విశాల, బాబీ. తన చేతిలోని క్రికెట్ బాల్ కేసి సంతోషంగా చూస్తున్నాడు బాబీ. అది చూసి చిరాకుపడ్డాడు శ్రీధర్.
పుట్టింటి గౌరవం
లహరి చిన్న పిల్లేం కాదు. తనకు అంతా తెలుసు, తను ఏం చేస్తోందో? ఎందుకు చేయబోతోందో ? అన్ని ఆమెకు తెలుసు.
స్వాతంత్ర్యోద్యమంలో చవితి.. చారిత్రక ఉత్సవాలు
దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి
తెలుగు వేటు పద్యాలు
తెలుగు వేటు పద్యాలు