ఆనకు తడుస్తమని గుడిసెలు ఆకులుగప్పుకునే కాలం.. ఆగులు గాజు లబేరమాడే కాలం.. శెర్లశాసలు ఇళ్ళిల్లకు సుట్టిరికెంగలి పెకాలం ఉత్తర బాజురోడ్డుకాడ మల్లేశ్ మనసుదోశిందిసుకన్య. కాలేజిల ఇంటర్ సది వేందుకు రోజు టవునుకు బోయెటందుకు గా సోటుకొస్తదామె.. ఆమె ఒక్కతేగాదు గాఊళ్ళెఎవుళు బస్సో, ఆటో, జీబో ఎక్కాల్నన్నా.. గాసోటుకే రావాల. ఊరికి దచ్చినంబాజున ఇంగొక రోడ్డుంది. రైలు దిగచ్చేటోళ్ళు.
అనంగొస్తరు.. గా శిన్నటేసన్ల పగులొక రొండు ప్యాసింజర్లు, ఒకటోకొం డో గూడ్సులు రేత్రొక ప్యాసింజర్ మాత్రమే అగుతయ్. గనుక గా రోడ్డు అంత సందడిగుండదు. ఉత్తరంబాజురోడ్డు అట్లగాదు. నాలుగూళ్ళకు పోయేటి దారిగాబట్టి అచ్చెటోళ్ళూ పోయెటోళ్ళతో సందడిగుంటది. ఆడ సోడాలోళ్ళూ, అరటిపళ్ళేల్లు, మొక్కజొన్న కంకులోళ్ళు, పాన్ దుకనోళ్ళ సందడుంటది. టీ ఓటర్ల కెల్లి టేప్ రికాడ్ పాటలుంటయ్.
సుకన్య తన ఊరినుంచి ఒకదారిన, మల్లేశ్ తన ఊరినుంచి ఇంగొకదారిన గా సోటురతరు.. ఆసోటుకొచ్చేటాల్కె ఇద్దరిఊళ్ళదార్లు వి షేప్ లో ఉంటాయి. కొండుదార్లకు ఇద్దరు చీలినా చాలాసేపు ఇద్దరుచీలినా గాపొలాల మీదికెళ్ళి సూసుకుంటనేపోతరు. రొండూ మట్టిదార్లగానీ సుక్కుమ్మొచ్చెదారి సక్కంగుంటది. బాటకు రొండేపుల ఎరుపు, పసుపు గుల్మొహర్ శెట్లుంటయ్. ఆనాకాలం మొదట్ల గవి ఇరగబూసి భలే అందంగుంటయ్. గాదారంతా పూలరెక్కలురాలి ఎరుపుపసుపు రంగులుంటాయ్..
మట్టికానరాక మల్లేశ్ జాను జిగ్రీ దోస్తులు ఇద్దరిదీ ఒకే కాల్నీ, నిజానికి జాన్ అని బైబిల్ పేరు పెట్టిన్లు ఆళ్ళ ఇంటోళ్ళు. కానీకాల్నీల జాను జాను అనుట్ల గదే నడుస్తోంది. ఆడు పది పెయిలై టవున్ల సుతారి పనిజేస్తందు మల్లేశ్ ఇంటర్ సదువు మద్దెలాపి టవున్ల మెకానిక్ షెడ్ల పని నేర్చుకుంటండు.
ఎప్పటికైన అఫిషియల్ ఇంజనీర్మైతనని అంటుంటాడు. సుకన్య రామచంద్రాపురం పెద్దదొర మనుమరాలు.
రోజూ తనఊరినుండి స్నేహితురాళ్ళతో కలిసి నడిసొచ్చేసుకన్య అక్కడికి రాంగనే గా గుల్మొహర్లను జూశి మస్తు ఖుష్ అయితుంటది. గాపూలను తనివితీర జూసుడు ఆమెకెంతో ఇష్టం. గట్ల పూలనేజూస్తన్నప్పుడు కన్నార్పకుండా గామెనే జూస్తన్న మల్లేశ్ ను గమనించింది. మొదట్లో సూశినా పట్టించుకోక పోయేది. గా తర్వాత సూశీ సూడనట్టుండేడిది.
This story is from the November 03, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 03, 2024 edition of Suryaa Sunday.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items